iDreamPost
android-app
ios-app

థ్రిల్లర్ స్టైల్ లో రియా చుట్టూ ఉచ్చు

  • Published Sep 05, 2020 | 10:15 AM Updated Updated Sep 05, 2020 | 10:15 AM
థ్రిల్లర్ స్టైల్ లో రియా చుట్టూ ఉచ్చు

అకాల మరణాన్ని కోరుకుని ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయిన సుశాంత్ రాజ్ పూత్ సూసైడ్/మర్డర్ తాలుకు మిస్టరీ థ్రిల్లర్ సినిమాను మించే స్థాయిలో సాగుతోంది. ఈ కేసులో అందరి వేళ్ళు తనవైపే వచ్చేలా చేసుకున్న రియా చక్రవర్తిని మీడియా నీడలా వెంటాడుతోంది. ఆఖరికి ఫుడ్ డెలివరీకి వచ్చిన బాయ్ ని కూడా వదలకుండా మరీ ఇంటర్వ్యూల కోసం మీదపడుతున్నారు. తాజాగా నిన్న రియా తమ్ముడు షౌయిక్ చక్రవర్తి డ్రగ్స్ డీలింగ్ విషయంలో తన తప్పును ఒప్పుకోవడంతో పాటు రియాకు కూడా ఇందులో ప్రమేయం ఉన్నట్టుగా చెప్పడంతో ఇప్పుడిది ఇంకా బిగుసుకుంది. తాజాగా షౌయిక్ కి 4 రోజుల కస్టడీని అప్పగిస్తూ ఎన్సిబికి కోర్టు ఉత్తర్వులు జారీ చేయడంతో రానున్న పరిణామాలు మరింత ఆసక్తికరంగా మారబోతున్నాయి.

ఇతనితో పాటు సుశాంత్ మాజీ మేనేజర్ శ్యామ్యూల్ మిరిండా కూడా విచారణను ఎదురుకోబోతున్నాడు. ఇప్పటికే రియా కాల్ డేటాను పలు కోణాల్లో విశ్లేషించిన పోలీసులు కొన్ని కీలకమైన ఆధారాలు సేకరించినట్టుగా తెలిసింది. డ్రగ్స్ దందాతో రియాకు లింక్ ఉందా లేదా అనే కోణంలో కూడా ఇన్వెస్టిగేషన్ గట్టిగా జరుగుతోంది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(NCB) రంగంలోకి దిగాక ఊహించని పరిణామాలు జరుగుతున్నాయి. షౌయిక్ చక్రవర్తి తన సోదరికి డ్రగ్స్ తో ప్రమేయం ఉన్నట్టుగా స్పష్టంగా ఆరోపించడంతో ఉచ్చు ఇంకాస్త బలంగా బిగుసుకుంటోంది. సుశాంత్ సింగ్ రాజ్ పూత్ తన సోదరి వల్లనే డ్రగ్స్ కు అలవాటు పడ్డాడు అనేలా స్టేట్ మెంట్ ఇవ్వడం కూడా రియాను ఇబ్బందుల్లోకి నెడుతోంది. మరికొద్ది గంటల్లో విచారణకు పిలిచాక తన అరెస్ట్ కూడా ఖాయమనే వార్త ముంబై మీడియాలో జోరుగా ప్రచారమవుతోంది.

మొన్నటిదాకా రియా తరఫున గళమెత్తి సపోర్ట్ చేసిన సినిమా సెలెబ్రిటీలందరూ గప్ చుప్ అయిపోయారు. స్వయానా రియా కుటుంబ సభ్యుడే తనకు వ్యతిరేకంగా సాక్ష్యం ఇస్తున్నప్పుడు ఎవరు మాత్రం చేయగలిగింది ఏముంది. తప్పు రుజువు అయ్యేదాకా ఎవరిని నిందితులుగా పేర్కొనడం భావ్యం కాదు కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు సుశాంత్ రియాల కథ మీద సినిమాలు ప్లాన్ చేసుకుంటున్న వాళ్లకు మంచి స్క్రిప్ట్ మెటీరియల్ గా మారుతున్నాయి. తమ హీరో మరణానికి న్యాయం జరగాలని ప్రతి అభిమాని కోరుకుంటున్నాడు. చూడాలి న్యాయం ఎవరి వైపు ఉందో ఎవరు గెలుస్తారో. నాలుగు రోజుల కస్టడిలో ఎలాంటి నిజాలు బయటికి వస్తాయనే దాని మీద సర్వత్రా ఆసక్తి నెలకొంది

gamdomCasibommarsbahis girişMarsbahisJojobet Giriş