iDreamPost
android-app
ios-app

RanaNaidu వెంకీ రానాల ఊర మాస్

  • Published Sep 24, 2022 | 4:30 PM Updated Updated Sep 24, 2022 | 4:30 PM
RanaNaidu వెంకీ రానాల ఊర మాస్

దగ్గుబాటి అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వెంకటేష్ రానాల ఫుల్ లెన్త్ కాంబినేషన్ ఎట్టకేలకు రెడీ అవుతోంది. నెట్ ఫ్లిక్స్ భారీ బడ్జెట్ తో నిర్మించిన రానా నాయుడు త్వరలో ఓటిటి ప్రీమియర్ కు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా తాము రిలీజ్ చేయబోయే బిగ్ టైటిల్స్ తాలూకు టీజర్లను సదరు సంస్థ వరసగా విడుదల చేసింది. అందులో రానా నాయుడు ఉంది. పూర్తిగా హిందీ వెర్షన్ లో కరణ్ అంశుమాన్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ని తెలుగుతో సహా ఇతర భాషల్లో అనువదించబోతున్నారు. రానాకు డిజిటల్ స్పేస్ కొత్త కాదు కానీ వెంకీకి మాత్రం ఇదే స్మార్ట్ స్క్రీన్ డెబ్యూ. అందుకే ఫ్యాన్స్ మంచి ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు.

ఇక టీజర్ విషయానికి వస్తే ఉన్నది నిమిషమే అయినప్పటికీ గూస్ బంప్స్ ఇచ్చే విజువల్స్ తో నింపేశారు. మాఫియా బ్యాక్ డ్రాప్ లో రానా ఏదో సీరియస్ మిషన్ మీద ఉండగా ఏదో పెద్ద నేరం మీద జైల్లో ఉన్న ఓ పెద్దాయన సహాయం కావాల్సి వస్తుంది అతనే మిస్టర్ నాయుడు. మాసిపోయిన తెల్ల గెడ్డంతో శిక్ష అనుభవిస్తున్న తనను బయటికి తీసుకురావడమైతే జరుగుతుంది కానీ ఆ తర్వాతే అసలు సవాల్ మొదలవుతుంది. చూస్తుంటే సినిమాలో ఇద్దరూ తండ్రి కొడుకులు పాత్రలు చేసినట్టుగా కనిపిస్తోంది. టీజర్ చివర్లో ఉన్న డైలాగ్, వెంకీ మీదకు రానా కలబడిపోవడం చూస్తే అదే అనిపిస్తోంది. మొత్తానికి అభిమానులకు కావాల్సిన స్టఫ్ అయితే ఇందులో ఇచ్చారు.

దీపావళికి రానా నాయుడు స్ట్రీమింగ్ జరిగే అవకాశం ఉంది. ఈ ఏడాది ఎఫ్3 తో ఒక హిట్టు ఖాతాలో వేసుకున్న వెంకటేష్ అక్టోబర్ 21 ఓరి దేవుడాలో టైటిల్ రోల్ లో కనిపిస్తారు. ఆ తర్వాత సల్మాన్ ఖాన్ కిసికి జాన్ కిసీకి భాయ్ లో ఉంటారు. వీటి మధ్యలో రానా నాయుడు ఉంటుంది.వెంకీని ఈ తరహా ఊర మాస్ సీరియస్ రోల్ లో చూసి చాలా కాలమయ్యింది. నారప్ప చేసినప్పటికీ అది కూడా ఓటిటిలోనే వచ్చింది కనక ఇప్పుడీ రెండోది కూడా సర్దుకోవాల్సి ఉంటుంది. సుర్వీన్ చావ్లా, సుశాంత్ సింగ్, ఆశిష్ విద్యార్ధి, జెస్సికా హారిసన్ తదితరులు ఇతర పాత్రలు పోషించిన రానానాయుడు కనక బ్లాక్ బస్టర్ అయితే మరికొందరు సీనియర్ హీరోలు డిజిటల్ లోకి వచ్చే ఛాన్స్ ఉంది

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomcasibomJojobetjojobetgrandpashabetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetmarsbahis giriş