iDreamPost
android-app
ios-app

పట్టు తప్పిన విక్రమార్కుడు – Nostalgia

  • Published Nov 04, 2020 | 2:54 PM Updated Updated Nov 04, 2020 | 2:54 PM
పట్టు తప్పిన విక్రమార్కుడు – Nostalgia

మెగాస్టార్ చిరంజీవి లాంటి హీరోతో సినిమా చేసేటప్పుడు దర్శకనిర్మాతలకు ఎలాగైతే కొన్ని లెక్కలు ఉంటాయో అభిమానులకు కూడా అంచనాలు ఉంటాయి. వాటి మధ్య పెర్ఫెక్ట్ బ్యాలెన్స్ కుదిరినప్పుడే బ్లాక్ బస్టర్లు సాధ్యమవుతాయి. ఏ మాత్రం తేడా వచ్చినా ఫలితం బాక్సాఫీస్ వద్ద నెగటివ్ కలెక్షన్ల రూపంలో బయటపడుతుంది. అలాంటి సినిమానే రాజా విక్రమార్క. 1990లో చిరంజీవి మంచి ఊపుమీదున్న సమయం. కొండవీటి దొంగ సూపర్ హిట్, జగదేకేవీరుడు అతిలోకసుందరి ఇండస్ట్రీ హిట్ తో మార్కెట్ రేంజ్ మాములుగా లేదు. కొదమసింహం సైతం సక్సెస్ క్యాటగిరీలో పడింది. హిందీలో డెబ్యూ చేసిన అంకుశం రీమేక్ ప్రతిబంద్ చక్కని లాంచ్ గా ఉపయోగపడింది. అప్పుడు వచ్చిందే ఈ రాజా విక్రమార్క.

1988లో హాలీవుడ్ మూవీ కమింగ్ టు అమెరికా అనే సినిమా ప్రపంచవ్యాప్తంగా అదరగొట్టిన సమయమది. తెలుగు ప్రేక్షకులకు ఇలాంటివి చూసే అవకాశం ఇప్పట్లా ఉండేది కాదు. అందులో ఉన్న యూనిక్ పాయింట్ సౌత్ ఫిలిం మేకర్స్ ని ఆకట్టుకుంది. తమిళంలో ప్రభు హీరోగా ప్రతాప్ పోతన్ దర్శకత్వంలో మై డియర్ మార్తాండన్ అనే సినిమా దీని స్ఫూర్తిగానే తెరకెక్కింది. అదే సమయంలో తెలుగులోనూ సత్యానంద్ రచనలో రాజా విక్రమార్క స్క్రిప్ట్ సిద్ధమైపోయి స్కందా ఆర్ట్స్ బ్యానర్ పై అమల, రాధికా హీరోయిన్లుగా భారీ బడ్జెట్ తో షూటింగ్ జరుపుకుంది. ఆగస్ట్ లో మార్తాండ రిలీజ్ కాగా నవంబర్ లో రాజా విక్రమార్క ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ రెండూ కమింగ్ టు అమెరికాకు రీమేక్ గా సదరు దర్శక నిర్మాతలు ఎవరూ చెప్పుకోలేదు.

కట్ చేస్తే రాజా విక్రమార్క అంచనాలు అందుకోలేకపోయింది. రవిరాజా పినిశెట్టి దర్శకత్వం మేజిక్ చేయలేకపోయింది. రాజ్ కోటి పాటలు ఆడియో పరంగా చాలా బాగా వచ్చినప్పటికీ చిరంజీవిని ఆ పాత్రలో అభిమానులు పెద్దగా రిసీవ్ చేసుకోలేకపోయారు. రాచరికం వ్యవస్థ లేని రోజుల్లో అది ఉన్నట్టుగా చూపించడమే కాక అంత పెద్ద రాజకుమారుడు సినిమా మొత్తం ధనవంతురాలైన హీరోయిన్ అమలను కాపాడటం తప్ప ఇంకేమి చేయకపోవడం తేడా కొట్టించింది. సెకండ్ హాఫ్ మొత్తం ఇది తప్ప కథ ఇంకేం ఉండదు. తమిళ సినిమాలో వేరే మలుపులు ఉంటాయి. చిరు అమల కాంబోలో వచ్చిన ఒకే ఒక్క సినిమా ఇది. రాధికతో మెగాస్టార్ చేసిన లాస్ట్ మూవీ కూడా ఇదే. అప్పటికే సినిమా స్కోప్ లకు అలవాటు పడ్డ జనానికి రాజా విక్రమార్క ఓల్డ్ స్టైల్ లో 35ఎంఎంలో తీయడం కూడా ఒక మైనస్ గా అనిపించింది.

jojobet girişmarsbahiscasibomJojobet GirişcasibomJojobet GirişCasibomcasibom girişholiganbetvaycasinomarsbahis girişJojobetJojobet Girişiptv satın al