iDreamPost
android-app
ios-app

సాయిధరమ్ అపార్ట్మెంట్లో వ్యభిచారం.. ఎస్ఓటీ పోలీసుల దాడులతో గుట్టురట్టు

  • Published Jun 15, 2022 | 9:32 AM Updated Updated Jun 15, 2022 | 9:32 AM
సాయిధరమ్ అపార్ట్మెంట్లో వ్యభిచారం.. ఎస్ఓటీ పోలీసుల దాడులతో గుట్టురట్టు

ఐదోకంటికి తెలియకుండా.. నలుగురు కలిసి ఓ అపార్ట్మెంట్లో ఫ్యామిలీలా ఉంటూనే.. వ్యభిచారం నిర్వహిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఎస్ఓటీ, పోలీసులు అపార్ట్మెంట్ లో తనిఖీలు నిర్వహించి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన హైదరాబాద్ లోని మియాపూర్ పీఎస్ పరిధిలో వెలుగుచూసింది. మియాపూర్ లోని గోకుల్ ప్లాట్స్ ప్రభా సాయిధరమ్ అపార్ట్మెంట్లో వ్యభిచారం జరుగుతుందని పోలీసులకు సమాచారం అందింది. నిన్న సాయంత్రం ఎస్ఓటీ, మియాపూర్ పోలీసులు ఆ అపార్ట్మెంట్లో తనిఖీలు నిర్వహించగా.. వ్యభిచారం జరుగుతున్నట్లు తేలింది.

విశాఖపట్నం చిన్నజాగ్ రావు పేటకు చెందిన కిష్టాఫర్ సన్నీ (25), చెలమ భరత్ (35) లు సహా మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహిళలను రెస్క్యూహోమ్ కు తరలించి, కిష్టాఫర్ సన్నీ, చెలమ భరత్ లను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. వారి వద్దనున్న ఐదు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కాగా.. వ్యభిచారం నిర్వహిస్తున్న నాని అనే వ్యక్తి పరారీలో ఉండగా.. అతని కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

gamdomCasibommarsbahis girişMarsbahisJojobet Girişjojobetjojobet giriş