iDreamPost
android-app
ios-app

పాటలతో దోచుకున్న ప్రియురాలు – Nostalgia

  • Published Mar 03, 2021 | 10:53 AM Updated Updated Mar 03, 2021 | 10:53 AM
పాటలతో దోచుకున్న ప్రియురాలు – Nostalgia

అందాన్ని చూపించే సినిమా కెమెరా కంటికి మనకు తెలియని ఎన్నో అద్భుత శక్తులు ఉంటాయి. అందులో నుంచే ఎన్నో ఆలోచనలు పుట్టుకొస్తాయి. అందుకే కెమెరామెన్ లు దర్శకులుగా మారినప్పుడు వాళ్ళు ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసేంత బ్లాక్ బస్టర్లు తీసుండరు కానీ చరిత్ర గుర్తుపెట్టుకునే క్లాసిక్స్ రూపొందించి ఉంటారు. అందుకు ఉదాహరణగా బాలు మహేంద్ర, పిసి శ్రీరామ్ లాంటి వాళ్ళను చెప్పుకోవచ్చు. తెలుగులోనూ కెఎస్ ప్రకాష్ లాంటి వాళ్ళు ప్రయత్నాలు చేశారు కానీ కమర్షియల్ సక్సెస్ కు మాత్రమే పరిమితం కావడం వల్ల అంతగా పేరు రాలేదు. మొదటి కోవలోకి వచ్చే మరో క్లాసిక్ ఫిలిం మేకర్ రాజీవ్ మీనన్.

1991 తెలుగులో నాగార్జున నటించిన చైతన్యతో పరిచయమైన సినిమాటోగ్రాఫర్ రాజీవ్ మీనన్. మణిరత్నం తీసిన సెల్యులాయిడ్ వండర్ బొంబాయికి పని చేసినప్పుడు ఈయన పనితనం ప్రపంచానికి తెలిసింది. చేసింది తక్కువ చిత్రాలే అయినప్పటికీ గుర్తింపు మాత్రం అపారంగా సంపాదించుకున్నారు. ఆ టైంలోనే తన ఆలోచనలను తెరమీద ఆవిష్కరించే ప్రయత్నం ఎందుకు చేయకూడదన్న ఉద్దేశంతో 1997లో మిన్సార్ కనవుని డైరెక్ట్ చేశారు. తమిళంలో మంచి విజయం సాధించిన ఈ మూవీ తెలుగులో మెరుపు కలలుగా వచ్చి ఫ్లాప్ అయ్యింది. ఏఆర్ రెహమాన్ పాటలు మాత్రం సంగీత ప్రియులను ఉర్రూతలూపాయి. ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకుని 2000 సంవత్సరంలో అజిత్-మమ్ముట్టి-టబు-ఐశ్వర్యరాయ్-అబ్బాస్ కాంబోలో కండుకొండైన్ కండుకొండైన్ రూపొందించారు. కెమెరా బాధ్యతలు రవి కె చంద్రన్ కు అప్పగించారు. రాజీవ్ తన ఫోకస్ మొత్తం డైరెక్షన్ మీదే పెట్టారు.

మనకు ప్రియురాలు పిలిచింది పేరుతో అనువదించారు. ఐశ్యర్య రాయ్ క్యారెక్టర్ కోసం ముందు మంజు వారియర్, సౌందర్యలను సంప్రదించారు మీనన్. అయితే సెకండ్ హీరోయిన్ లా అవుతుందని వాళ్ళు నో చెప్పడంతో అప్పటికే కోలీవుడ్ లో ఇరువర్, జీన్స్ చేసి పేరు తెచ్చుకున్న ఐశ్వర్య రాయ్ ని లాక్ చేశారు. ఇది చేసే టైంకి అజిత్ ఇప్పుడంత పెద్ద స్టార్ కాదు. మమ్ముట్టి ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యారెక్టర్ చేయడానికి వెనుకాడలేదు. రెహమాన్ మరో అద్భుతమైన ఆల్బమ్ ఇచ్చాడు. శంకర్ మహదేవన్ కి జాతీయ అవార్డు కూడా వచ్చింది. ఇలా ప్రియురాలు పిలిచింది బాక్సాఫీస్ లెక్కలను పక్కనపెడితే ఓ అందమైన అనుభూతిని మిగిల్చింది. ఆ తరువాత ఏవో కారణాల వల్ల రాజీవ్ మీనన్ దర్శకత్వానికి దూరంగా ఉండి 2019లో సర్వం తాళమయంతో రీ ఎంట్రీ ఇచ్చారు. ఆ మధ్య పుదు పుదు కలై అనే యాంథాలజీలో ఒక ఎపిసోడ్ డైరెక్ట్ చేశారు.

gamdomCasibommarsbahis girişMarsbahisJojobet Girişjojobetjojobet giriş