iDreamPost
android-app
ios-app

ప్రేమదేశం అబ్బాస్ రీ ఎంట్రీ

  • Published Jun 23, 2022 | 4:44 PM Updated Updated Jun 23, 2022 | 4:45 PM
ప్రేమదేశం అబ్బాస్ రీ ఎంట్రీ

అప్పుడెప్పుడో పాతికేళ్ల క్రితం యువకులుగానో చిన్న పిల్లలుగానో ఉన్నవాళ్ళకు ప్రేమదేశం సృష్టించిన సునామి ఇంకా గుర్తుండే ఉంటుంది. ఏఆర్ రెహమాన్ పాటలకు తెలుగు రాష్ట్రంతో పాటు తమిళనాడు కేరళ మొత్తం ఊగిపోయాయి. హిందీ వెర్షన్ లోనూ అంతే ప్రభంజనం సృష్టించిన క్లాసిక్ ఇది. ఇందులో హీరోలుగా నటించిన అబ్బాస్ వినీత్ ల ఫాలోయింగ్ గురించి చెప్పాలంటే నిముషాలు గంటలు సరిపోవు. ముఖ్యంగా వాళ్ళ డ్రెస్సింగ్ తో మొదలుపెట్టి హెయిర్ స్టైల్ దాకా అనుకరించిన వాళ్ళను లెక్కబెట్టడం కష్టం. జుత్తు కత్తిరించే సెలూన్స్ లో అబ్బాస్ కటింగ్ అని ప్రత్యేకంగా వాటిని చేసే బార్బర్స్ ని సెపరేట్ గా పెట్టేవాళ్ళు ఓనర్లు.

అలాంటి అబ్బాస్ తర్వాత ఎక్కువ కాలం నిలదొక్కుకోలేకపోయాడు. తెలుగులోనూ నీ ప్రేమకై, రాజా లాంటి అడపాదడపా సినిమాలు చేశాడు కానీ అవేవి స్టార్ డంని తీసుకురాలేకపోయాయి. కట్ చేస్తే తెరకు దూరమై యాడ్స్ తో ప్రయాణం మొదలుపెట్టాడు. టాయిలెట్ క్లీనర్ ప్రకటనలో తనను చూసినప్పుడు ఫ్యాన్స్ ఎంత బాధ పడ్డారో. ఇదంతా వృత్తిలో భాగమే కానీ ఇప్పుడు ఇంత గ్యాప్ తర్వాత అబ్బాస్ ని టాలీవుడ్ రీ ఎంట్రీ ఇప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయట. గోపిచంద్ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో రూపొందబోయే భారీ చిత్రంలో అబ్బాస్ కో ప్రత్యేకమైన క్యారెక్టర్ ఉందట. దాదాపుగా అతనితోనే చేయించే అవకాశాలున్నాయని టాక్.

ఇంకా అధికారికంగా చెప్పలేదు కానీ అబ్బాస్ రాక మంచిదే. క్యారెక్టర్ ఆరిస్టులు తగ్గిపోయి పదే పదే మురళీశర్మ, ప్రకాష్ రాజ్ అంటూ రిపీట్ మొహాలను చూస్తున్న ట్రెండ్ లో ఇలాంటి వాళ్ళను తీసుకొస్తే ఆడియన్స్ కూడా ఫ్రెష్ గా ఫీలవుతారు. పక్కా కమర్షియల్ ప్రమోషన్లు, రిలీజ్ పూర్తయ్యాక గోపిచంద్ దీని షూటింగ్ లో పాల్గొంటాడు. రాజశేఖర్ ని మరో పాత్రకు అడిగారు కానీ అది జరగలేదు. కట్ చేస్తే అందులోకి జగపతిబాబు వచ్చి చేరారు. అన్నట్టు అబ్బాస్ కు తెలుగు కూడా బాగానే వస్తుంది. కాకపోతే మీడియా ముందు రావడం కానీ అప్పుడప్పుడు ఈవెంట్లకు వెళ్లడం లాంటివేవీ చేయడు. అందుకే ఇప్పటి జెనరేషన్ కు అతని పరిచయం తక్కువే

Jojobet GirişmeritbetmeritbetmeritkingPradabet güncel girişcasibomJojobet GirişjojobetjojobetjojobetcasibommeritkingMadridbetPokerklasJojobet GirişjojobetHoliganbet GirişOnwin Girişdeneme bonusu