iDreamPost
android-app
ios-app

రాజకీయం.. ఓ సేవా మాధ్యమం : మోడీ

రాజకీయం.. ఓ సేవా మాధ్యమం : మోడీ

కొంతమంది రాజకీయాలను కేవలం ఎన్నికల దృష్టిలోనే చూస్తున్నారు.కానీ బిజెపి మాత్రం రాజకీయాలను ప్రజలకు సేవ చేసే మాధ్యమంగానే చూస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు.సొంత ప్రయోజనాల కోసం అధికారాన్ని బిజెపి నాయకులు ఎప్పుడు ఉపయోగించుకోలేదని ప్రధాని మోడీ స్పష్టం చేశారు.బిజెపి నిర్వహించిన ” సేవా హీ సంఘటన్ ” అనే కార్యక్రమంలో భాగంగా కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. నిస్వార్థ సేవ అనే ప్రతిజ్ఞ విలువలుగా ఉండాలని కార్యకర్తలకు ఆయన సూచించారు.ఈ సందర్భంగా లాక్ డౌన్ సమయంలో బిజెపి కార్యకర్తలు ప్రజలకు అందించిన సేవలను మోడీ శ్లాఘించారు.

అది అతి గొప్ప కార్యం…

బీజేపీ కార్యకర్తలు నిర్వహించిన ‘సేవా యోజన’ మానవ చరిత్రలోనే పెద్ద కార్యక్రమం అని హర్షం వ్యక్తం చేశారు. దీనిపై డిజిటల్ బుక్ లెట్స్‌లను రూపొందించి మండల, జిల్లా స్థాయిలో పంచాలని ఆయన కార్యకర్తలను ఆదేశించారు. ఈ బుక్ లెట్స్ కనీసం 3 భాషల్లో ఉండేలా రూపొందించాలని సూచించారు. కరోనా అన్న మహమ్మారి ఉన్నప్పటికీ… ఏమాత్రం దానిని పట్టించుకోకుండా, జంకకుండా కార్యకర్తలు ప్రజలకు సేవ చేసి, వారి జీవితాలను తృణ ప్రాయంగా అర్పితం చేశారన్నారు. సేవలో ప్రాణాలు కోల్పోయిన కార్యకర్తలకు మోదీ నివాళులర్పించారు.

అది పూర్తిగా తప్పు..

అత్యధిక ఉష్ణోగ్రతల కారణంగా దేశంలోని తూర్పు ప్రాంతాల్లో కోవిడ్ అత్యంత వేగంగా విస్తరించే అవకాశాలున్నాయని కొందరుపేర్కొన్నారు.అయితే అది పూర్తిగా తప్పని నిరూపించామని ప్రకటించారు. రాజకీయాలను బీజేపీ ఎప్పటికీ సేవ అన్న దృష్టితోనే చూస్తుందని, ఎన్నికల గెలిచే యంత్రంగా చూడదని పేర్కొన్నారు. సేవా దృక్పథ రాజకీయాల ద్వారా.. ప్రజల్లో, సమూహాల్లో, దేశంలో ఓ పెద్ద మార్పును తీసుకురావచ్చు అని మోదీ తెలిపారు.,.

jojobet girişJojobet GirişJojobet GirişCasibomkarın ağrısına ne iyi gelirluxbetluxbetRulobetkatlaJojobet GirişJojobet GirişMarsbahis GirişCasibom GirişMarsbahis Giriş