iDreamPost
android-app
ios-app

ఇకపై ఎల‌క్ట్రానిక్ రూపాయలు.. అస‌లు ల‌క్ష్య‌మేంటి?

ఇకపై ఎల‌క్ట్రానిక్ రూపాయలు.. అస‌లు ల‌క్ష్య‌మేంటి?

రూపాయి నోట్లు కూడా రూపాంతరం చెందుతున్నాయి. డిజిటల్‌ పేమెంట్లు, ఆన్‌లైన్‌ ట్రాన్స్‌ఫర్లే కాదు.. డబ్బు కూడా నోట్ల రూపంలో కాకుండా డిజిటల్‌గానే కనిపించనుంది. ఈ సరికొత్త ప్రక్రియకు కేంద్రం శ్రీకారం చుడుతోంది. ప్రభుత్వ పథకాలకు, సంక్షేమం పేరుతో పేదలకు అందించే నగదు లావాదేవీలు ఇకపై ఈ-రూపాయలనే వాడే అవకాశాలు ఉన్నాయ‌న్న భావ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. ఎల‌క్ర్టానిక్ రూపంలో ఉండే ఈ రూపాయి (ఈ-రూపీ).. సోమవారం నుంచి అందుబాటులోకి రానుంది.

దేశంలో కొత్త తరహా లావాదేవీలు ప్రారంభం కానున్నాయి. ఈ-రూపీ పేరుతో కేంద్రం కొత్త విధానాన్ని అందుబాటులోకి తెస్తోంది. ఈ-రూపీ అనేది వినియోగదారుల మొబైల్‌ఫోన్‌కు క్యూఆర్‌ కోడ్‌ లేదా ఎస్సెమ్మెస్‌ స్ట్రింగ్‌ వోచర్‌ రూపంలో చేరుతుంది. ఇది ఎలాంటి ప్లాట్‌ఫాం కాదు. థర్డ్‌ పార్టీ పేమెంట్‌ గేట్‌వే ప్రమేయం ఇందులో ఉండదు. ఈ కోడ్‌/వోచర్‌ను లబ్ధిదారులు ఎలాంటి కార్డులు, నెట్‌బ్యాంకింగ్‌, డిజిటల్‌ పేమెంట్‌ యాప్‌తో సంబంధం లేకుండా.. నగదుకు బదులుగా వినియోగించుకోవొచ్చు. భారత జాతీయ చెల్లింపుల సాధికార సంస్థ(ఎన్‌పీసీఐ) ఈ-రూపీకి రూపకల్పన చేయగా.. ఇందులో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆరోగ్య శాఖ, జాతీయ ఆరోగ్య సాధికార సంస్థ సహకారం ఉంది. క్యూఆర్‌ కోడ్‌ లేదా ఎస్సెమ్మెస్‌లో వచ్చే స్ట్రింగ్‌ వోచర్‌ను సంబంధిత వాణిజ్య, వ్యాపార సంస్థల వద్ద రీడీమ్‌ చేసుకోవచ్చు.

ఉదాహరణకు.. కొవిడ్‌ టీకా కోసం ప్రైవేటు ఆస్పత్రిలో చెల్లింపులకు ఈ విధానం ఉపయోగపడుతుంది. టీకా కోసం ఇ-రూపీని తీసుకుంటే.. వ్యాక్సిన్‌ కోసం మాత్రమే రీడీమ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఆరోగ్య సంబంధిత మందులు, మాతాశిశు సంరక్షణ పథకం, టీబీ కార్యక్రమంలో డయాగ్నస్టిక్‌/మందులు, ఎరువుల కొనుగోళ్లకు సంబంధించి ఇప్పుడు నగదు/నగదు బదిలీ రూపంలో సబ్సిడీ ఇస్తున్నారు. వీటికి తొలిదశలో ఇ-రూపీని వినియోగించే అవకాశాలున్నాయని కేంద్రం స్పష్టం చేసింది.

కార్పొరేట్‌ సంస్థలు తమ ఉద్యోగుల సంక్షేమానికి, కార్పొరేట్‌ సామాజిక బాధ్యతలో భాగంగా ఇ-రూపీ వోచర్లను జారీ చేయవచ్చని కేంద్రం పేర్కొంది. ముఖ్యంగా వ్యాక్సినేషన్‌కు సంబంధించి ఆయా సంస్థలు తమ ఉద్యోగులకు ఇ-రూపీని గిఫ్ట్‌గా ఇవ్వొచ్చని తెలిపింది. అలా ఇ-రూపీని బహుమతిగా ఇచ్చిన వారు.. వోచర్ల వినియోగాన్ని ట్రాక్‌ చేయవచ్చు. ఇప్పటికే ఎస్‌బీఐ, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, కెనరా బ్యాంక్‌, ఇండస్‌ సిండ్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ ఎన్‌పీసీఐతో ఇ-రూపీ కోసం ఎన్‌పీసీఐతో ఒప్పందం కుదర్చుకున్నాయి.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం ఈ – రూపీని ప్రారంభించనున్నారు. బ్యాంకు ఖాతాలు, కార్డులు, యాప్‌లతో సంబంధం లేకుండా.. నగదు రహిత, కాంటాక్ట్‌లెస్‌ లావాదేవీలకు ఈ విధానం ఉపయోగపడుతుంది. ఇ-రూపీని ఏ ఉద్దేశంతో తీసుకుంటారో.. అదే ఉద్దేశానికి మాత్రమే ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇతర చెల్లింపులకు అది పనికి రాదు. అంటే.. ప్రభుత్వం సబ్సిడీల రూపంలో నగదును అందజేస్తున్న పలు పథకాలను క్రమంగా ఇ-రూపీ పరిధిలోకి తెచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీని ద్వారా వృథా, దుర్వినియోగాన్ని అరికట్టవచ్చనేది కేంద్రం అభిప్రాయంగా తెలుస్తోంది.

jojobet girişJojobet GirişJojobet GirişCasibomiptv satın almadridbetmadridbetmadridbetkatlaMarsbahis GirişCasibom GirişJojobet GirişCasibomMarsbahis Giriş