Idream media
Idream media
పవన్‌కల్యాణ్ సూర్యరాయంధ్ర నిఘంటువులు కష్టపడి సేకరించినట్టు సోషల్ మీడియాలో తెలిపారు. కానీ అన్ని పదాలకి అర్థాలు నిఘంటువుల్లో ఉండవు. స్వయంగా కష్టపడి తెలుసుకోవాలి.
1) అధికారం- ఉపన్యాసాలతో రాదు. ఊరూరూ తిరిగి జనంలో కలిసిపోతే వస్తుంది.
2) అవమానం- మనం కష్టపడకుండా ఏదైనా సాధించాలనుకుంటే ఎదురయ్యేది.
3) అతిశయోక్తి- కిందపడినా మనదే పైచేయి అనుకోవడం.
4) అరచేతిలో స్వర్గం- అప్పుడప్పుడు మీటింగులు పెట్టి జనాలకి చూపించేది.
5) ఆర్భాటం- అభిమానుల ఈలలు, తోపులాటలు.
6) అతివిశ్వాసం- రాష్ర్టంలో ఏ నియోజకవర్గం ఎక్కడుందో తెలియకుండా మనం అధికారంలోకి వస్తామని నమ్మడం.
7) అందలం- ఆశపడితే ఎక్కలేం. ప్రజలు అనుకుంటేనే ఎక్కగలం.
😎 అనితర సాధ్యం- పార్టీ పెట్టిన అధ్యక్షుడే రెండుచోట్ల ఓడిపోవడం.
9) అజ్ఞాతం- రాజకీయాల్లోంచి సినిమాల్లోకి చేసే ప్రయాణం.
10) అచంచల విశ్వాసం- ఏమీ పనిచేయకుండా పాతికేళ్లు రాజకీయాల్లో ఉంటానని నమ్మడం