iDreamPost
android-app
ios-app

18 ఏండ్ల తర్వాత పేపర్ ఓటింగ్

18 ఏండ్ల తర్వాత పేపర్ ఓటింగ్

ఈ ఏడాది జరగనున్న గ్రేటర్ ఎన్నికలు మరో రికార్డును సొంతం చేసుకోనున్నాయి. ఏ పార్టీ పీఠమెక్కనుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తుండగా.. ప్రస్తుత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్లు ఉపయోగిస్తుండటం వెనుక మరో ఆసక్తికరమైన గతం ఉంది. బల్దియా ఎన్నికల్లో పద్దెనిమిదేండ్ల తర్వాత పేపర్ బ్యాలెట్ ఉపయోగిస్తున్నారు. ఈవీఎం టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత దాదాపు బ్యాలెట్ ఓటింగ్‌కు స్వస్తి చెప్పేలా ప్రయత్నాలు జరుగుతున్న సందర్భంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇప్పుడు పేపర్‌ ఓటింగ్ కార్పొరేటర్లను నిర్ణయించనుంది.

బ్యాలెట్ ఓటింగ్‌లో పేపర్ల, ఓటర్ స్లిప్, బ్యాలెట్ పేపర్లు ముద్రణ ఖర్చు, ఎక్కువ సిబ్బంది అవసరం వంటి కారణాలతో ఆ విధానానికి స్వస్తి చెప్పాలనే అభిప్రాయాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో టెక్నాలజీ ద్వారా ఈవీఎం ఓటింగ్ అందుబాటులోకి వచ్చింది. వీటి తయారీ, వాడుకలోనూ అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏదీ ఎలా ఉన్నా మనదేశంలో రాజస్థాన్, ఢిల్లీ మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో మొదటిసారి 1994లో ప్రయోగాత్మకంగా ఈవీఎంలను ఉపయోగించారు. ఆ తర్వాత 2004 లోక్ సభ ఎన్నికల్లోనూ ఈవీఎంలను మొదటిసారిగా దేశమంతా ఉపయోగించారు. ఆ తర్వాత దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఈవీఎంలను ఉపయోగిస్తుండటం ఆనవాయితీగా మారింది.

ఆకర్షణగా నిలుస్తున్న బ్యాలెట్

జీహెచ్ఎంసీ పరిధిలో 2002లో నిర్వహించిన ఎన్నికలే చివరి బ్యాలెట్. ఆ తర్వాత 2209, 2014 సంవత్సరాల్లో ఈవీఎంల ద్వారా ఓటింగ్ నిర్వహించారు. మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ (ఎంసిహెచ్)లో 2202 ఎన్నికల్లో బ్యాలెట్ బాక్స్‌లను చివరిసారిగా ఉపయోగించారు. 2007తో ఆ పాలకమండలి ముగిసింది. అదే ఏడాది జీహెచ్ఎంసీ ఏర్పడింది. సరిహద్దు జిల్లాల నుంచి కలిసిన గ్రామాలు, మున్సిపాలిటీలతో కలిపి వార్డుల పునర్విభజన. రిజర్వేషన్లు కేటాయించేందుకు రెండేండ్ల సమయం పట్టింది. ఆ తర్వాత 2009లో ఎన్నికలయ్యాయి. 2014లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నప్పటికీ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో 2016లో జీహెచ్ఎంసీ ఎన్నికలను నిర్వహించాల్సి ఉంచింది. ఆయా సమయాల్లో ఈవీఎంల ద్వారానే ఎలక్షన్స్ జరిగాయి. ప్రస్తుతమున్న పాలక మండలి పదవీకాలం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ముగియనుంది. కొత్తం పాలక మండలి కోసం నిర్వహిస్తున్న ఈ ఎన్నికలను బ్యాలెట్ పద్దతిలో నిర్వహిస్తున్నారు. ఈవీఎం వ్యవస్థ అందుబాటులో ఉన్నప్పటికీ ఎన్నికల సంఘం బ్యాలెట్ ఓటింగ్‌కు మొగ్గు చూపింది. అది కూడా ఏకపక్షంగా ఏమీ జరగలేదు. ఎన్నికలను ఎలా నిర్వహించాలనే అంశంపై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నుంచి అభిప్రాయాలను రాష్ట్ర ఎన్నికల సంఘం కోరింది. ఈవీఎంలను ఉపయోగించాని బీజేపీ.. టీఆర్ఎస్ సహా కొన్ని ప్రధాన పార్టీలు బ్యాలెట్ ఓటింగ్‌ను ఆహ్వానించాయి. ఈవీఎం, బ్యాలెట్ ఓటింగ్‌ల్లో పేపర్ ఓటింగ్‌లోనే పారదర్శకతకు ఎక్కువ అవకాశముందని కొందరు విమర్శకుల అభిప్రాయం. అయితే గెలుస్తామన్న నమ్మకున్న అభ్యర్థికి ఎన్నికలు ఏ పద్ధతిలో నిర్వహిస్తారనే అంశమే పట్టింపుకాదని ఓ ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు.

డిసెంబర్ 1న నిర్వహించే ఎన్నికల కోసం రాస్ట్ర ఎన్నికల సంఘం 28 వేల బ్యాలెట్ బాక్స్‌లను సిద్ధం చేసింది. విక్టరీ ప్లేగ్రౌండ్‌లో పోలీస్ పహారా మధ్య భద్రత కల్పించి సోమవారం నాటికే డీఆర్‌సీ కేంద్రాలకు తరలించారు. ఇప్పటి వరకు నిర్వహిస్తున్న గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌లు, వార్డు సభ్యులు, మండల పరిషత్ ఎన్నికల కోసం బ్యాలెట్ బాక్స్‌లనే ఉపయోగిస్తున్నారు. ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల సందర్భంలో మాత్రం ఈవీఎంలనే ఇప్పటి వరకూ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నూ బ్యాలెట్ పద్ధతిలో జరుగుతుండగా.. ఇదే విధానం పద్దెనిమిదేండ్ల కింద అధికారులు అమలు చేశారు.

jojobet girişJojobet GirişCasibomivermectin tabletMadridbetMadridbetMadridbetmeritbetCasibom GirişmeritbetjojobetBetvolemarsbahis girişJojobet GirişJojobet GirişcasibomHoliganbet