iDreamPost
android-app
ios-app

ఆ ఇద్దరు హీరోల ఊసేది

  • Published Jul 17, 2021 | 7:34 AM Updated Updated Jul 17, 2021 | 7:34 AM
ఆ ఇద్దరు హీరోల ఊసేది

స్టార్ ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నంత మాత్రాన ఇండస్ట్రీలో అన్నీ సాఫీగా జరిగిపోవు. మనం ఇష్టపడే హీరో కుటుంబం నుంచి వచ్చాడన్న కారణంగా ప్రేక్షకులు ప్రతి ఒక్కరిని ఆదరిస్తారన్న గ్యారెంటీ ఉండదు. ఇక్కడ సక్సెస్ కీలకం. దాని కోసం టాలెంట్ అవసరం. అఫ్కోర్స్ కొన్నిసార్లు అదృష్టం కూడా కలిసిరావాలి. విషయానికి వస్తే సోలో హీరోగా చిలసౌతో మంచి విజయం దక్కించుకున్నప్పటికీ తర్వాత గ్యాప్ తీసుకున్న సుశాంత్ ఇటీవలే ఇచట వాహనములు నిలుపరాదుని పూర్తి చేసుకుని విడుదల కోసం ఎదురు చూస్తున్నాడు. గత ఏడాది లాక్ డౌన్ టైంలోనే మొత్తం పూర్తయినా ఇప్పటిదాకా ఎలాంటి అప్ డేట్ ఇవ్వడం లేదు. పోనీ దగ్గరలో సూచనలు కూడా కనిపించడం లేదు. అల వైకుంఠపురములో చేసిన పాత్ర వల్ల ఇతనికి ఒరిగింది ఏమి లేదు.

సోషల్ మీడియాలో అప్పుడప్పుడు సుశాంత్ ఏవో ఫోటోలు షేర్ చేసుకోవడం తప్ప ఇంకెలాంటి సమాచారం లేదు. అక్కినేని బ్రాండ్ ఉన్నా కూడా ఎందుకో మరి ఆలస్యమవుతూనే ఉంది. ఆ మధ్య వదిలిన టీజర్ ఆకట్టుకునేలా ఉన్నా విడుదల గురించి మాత్రం మౌనమే సమాధానం. ఇక మెగాస్టార్ చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ సూపర్ మచ్చి సంగతి ఎటూ తేలక అయోమయంలోనే ఉంది. పోనీ ఓటిటికి ఇచ్చారా అంటే అదీ జరగలేదు. ఫస్ట్ కాపీ ఎప్పుడో సిద్ధమయ్యింది. కానీ నో కదలిక. కిన్నెరసాని అనే మరో సినిమా కూడా దాదాపుగా ఫినిష్ అయ్యింది. ఇది కూడా సైలెన్స్ నే పాటిస్తోంది. మరోవైపు కళ్యాణ్ దేవ్ సినిమాలు సైన్ చేస్తూనే ఉన్నాడు.

దీన్ని బట్టి అర్థమవుతోంది ఏంటంటే బ్యాక్ గ్రౌండ్ ప్రతిసారి పనిచేయదు. ఒకవేళ నిజంగా వీటికి క్రేజ్ ఉంటే ప్రైమ్ లేదా నెట్ ఫ్లిక్స్ లాంటివి భారీ ఆఫర్లు ఇచ్చి సొంతం చేసుకునేవి. పోనీ థియేటర్లలో చూసేందుకు జనాలు ఎదురు చూస్తున్నారనుకుంటే అదేదో మొన్న జనవరి నుంచి ఏప్రిల్ మధ్యలోనే చేయాల్సింది. కానీ సాధ్యపడలేదు. దీన్ని బట్టి వీటి బిజినెస్ వ్యవహారాలు అంత సులువుగా జరగడం లేదని అర్థమవుతోంది. సూపర్ మచ్చి, కిన్నెరసాని, ఇచట వాహనములు నిలుపరాదు సినిమాలు మరి ఎప్పుడు ఏ రూపంలో వస్తాయో ఆయా యూనిట్లు కనీసం ఏదైనా సమాచారం లాంటిది పోస్టర్ రూపంలో అయినా ఇస్తే బెటర్

jojobet girişJojobet GirişBetcioivermectin tabletMadridbetMadridbetPusulabetmeritbetCasibom GirişmeritbetpokerklasTophillbetmarsbahis girişJojobet GirişcasibomCasibom GirişMarsbahis GirişHoliganbetgalabetHoliganbet