iDreamPost
android-app
ios-app

యూట్యూబ్ ద్వారా ఆ కేంద్రమంత్రికి నెలకు రూ. 4 లక్షలు వస్తున్నాయట..!

యూట్యూబ్ ద్వారా ఆ కేంద్రమంత్రికి నెలకు రూ. 4 లక్షలు వస్తున్నాయట..!

కరోనా మహమ్మారి ప్రభలడంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఆటుపోట్లకు అస్తవ్యస్తంగా మారింది. చాలా దేశాలు, రాష్ట్రాల ఆదాయం తగ్గి అప్పులు పెరిగాయి. ఎందరో అసంఘటిత రంగ కార్మికులు, వీధి వ్యాపారులు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారు. కాని ఈ విపత్తుకాలంలోనూ కొందరు తమ ఆదాయాన్ని రెట్టింపు చేసుకోగా మరికొందరు సంపద సృష్టిపై దృష్టి పెట్టి అదనపు ఆదాయాన్ని పొందుతున్నారు. 

కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కూడా అదనపు ఆదాయం పొందుతున్న వారి జాబితాలోకే వస్తారు. లాక్ డౌన్ వేళ ఇంటికే పరిమితమైన గడ్కరీ, యూట్యూబ్ ఛానల్ ద్వారా నెలకు నాలుగు లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. అవును నిజంగానే ఆయనకు రాయల్టీ రూపంలో యూట్యూబ్ నెలనెలా పేమెంట్ చేస్తుంది.

లాక్ డౌన్ వేళ ఇంట్లోనే ఉన్న నితిన్ గడ్కరీ.. వంట చేయడంతో పాటు ఆన్ లైన్ లెక్చర్లు ఇచ్చేవారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఫారిన్ యూనివర్సీటీ విద్యార్థులకు పాఠాలు చెప్పేవారు. వాటిని రికార్డు చేసి తర్వాత యూట్యూబ్ పోస్టు చేయగా మంచి రిస్పాన్స్ వచ్చింది. వీవర్షిప్ పెరగడంతో పాటు ఆయన యూట్యూబ్ ఛానల్ సబ్ స్ర్కైబర్స్ కూడా భారీగా పెరిగారు.

Also Read : జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్ ,డీజిల్ – రాష్ట్రాలపై నెపం నెడితే సరిపోతుందా?

Nitin Gadkari పేరుతో ఉన్న యూట్యూబ్ అకౌంట్ కు 207K సబ్ స్క్రైబర్స్ ఉన్నారు. అయితే ఈ అకౌంట్ 2015 మార్చి 25న క్రియేట్ చేసినప్పటికీ గడిచిన రెండేళ్ల నుంచి యాక్టివ్ గా వీడియోస్ అప్ లోడ్ చేస్తున్నారు. ఇందులో ఆయన ప్రసంగాలు, లెక్చర్స్ తో పాట పర్యటనలు, మీడియా కాన్ఫరెన్స లతో పాటు వ్యక్తిగతమైన వ్యాయమ సంబంధిత వీడియోలు కూడా ఉన్నాయి. పండుగలు, ప్రముఖుల ప్రసంగాల వీడియోలు కూడా అప్ లోడ్ చేస్తున్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి, ప్రధాని చేసిన ప్రసంగాలు కూడా గడ్కరీ అకౌంట్ లో పోస్టు చేయగా వేలమంది ఫాలో అయ్యారు. పోస్ట్ కోవిడ్ రిహాబిలిటేషన్ పై వీడియో పోస్ట్ చేయగా 653k మంది చూశారు. అయితే అకౌంట్ కు సంబంధించిన కామెంట్స్ ఆప్షన్ మాత్రం ఆఫ్ లో ఉంది.

నాగ్ పూర్ లోని ఓ మధ్యతరగతి బ్రహ్మణ కుటుంబంలో పుట్టిన గడ్కరీ.. వాణిజ్య, న్యాయ శాస్త్రల్లో పట్టభద్రులు. బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘమైన abvp లో ఆయన పనిచేశారు. వ్యాపారరంగంలో ఎంతో సక్సెస్ సాధించిన గడ్కరీ.. రాజకీయాల్లో కూడా అంతే పేరు గడించారు. మహారాష్ట్రలో ఎక్కువ సీట్లు వచ్చిన ప్రతిసారి ఆయన సీఎం పోటీలో ఉండేవారు. కానీ సీఎం పీఠం మాత్రం ఆయనకు దక్కలేదు.

1995 నుంచి 1999 వరకు మహారాష్ట్ర ప్రభుత్వంలో ప్రజాపనుల శాఖ మంత్రిగా ఉన్నారు. 2014లో మోదీ ప్రధాని అయిన తర్వాత కేంద్రమంత్రివర్గంలో గడ్కరీకి చోటు దక్కింది. ప్రస్తుతం గడ్కరీ, రోడ్డు రవాణా, నేషనల్ హైవేస్ మినిస్టర్ గా ఉన్నారు. ఢిల్లీ –ముంబై ఎక్స్ ప్రెస్ వే పురోగతి పై సమీక్ష నిర్వహించిన గడ్కరీ.. తనకు యూట్యూబ్ ద్వారా వస్తున్న ఆదాయాన్నిఆ మీటింగ్ లో వివరించారు. 

Also Read : బీజేపీకి బిగ్‌ షాక్‌: బాబుల్‌ సుప్రియో రీఎంట్రీ