iDreamPost
android-app
ios-app

తెలంగాణకు గట్టి షాక్, పాలమూరు-రంగారెడ్డి ఆపాలని NGT ఆదేశం

  • Published Sep 22, 2021 | 6:24 AM Updated Updated Sep 22, 2021 | 6:24 AM
తెలంగాణకు గట్టి షాక్, పాలమూరు-రంగారెడ్డి ఆపాలని NGT ఆదేశం

గత సంవత్సర కాలంగా గా నీటి ప్రాజెక్టులపై ఇరురాష్ట్రాల ఫిర్యాదుల పరంపర కొనసాగుతోంది. తెలంగాణ ప్రభుత్వం 2015 లో పాలమూరు-రంగారెడ్డి అనే పథకంతో దాదాపు 89 టీఎంసీల నీటిని తీసుకోవడానికి ఇచ్చిన GO ను నిరసిస్తూ నాటి ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ మోహన్ రెడ్డి కర్నూలు కేంద్రంగా మూడు రోజుల దీక్ష కూడా చేసిన విషయం తెలిసిందే. దీని మీద నాటి అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం నామ మాత్రపు పిర్యాదు చేసి వదిలేసింది. కానీ తదుపరి ప్రాజెక్ట్ ను ఆపటానికి గట్టి ప్రయత్నం చేయలేదు.

తెలంగాణ ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డి, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాల ద్వారా 800 అడుగుల నుంచే నీళ్ళు తీసుకోవడం వల్ల ఆంధ్రకు నీటి లభ్యత తగ్గిపోతోంది. శ్రీశైలంలో 841 అడుగుల నీటి మట్టం ఉంటేనే పోతిరెడ్డిపాడు నుంచి గ్రావిటీ ద్వారా రాయలసీమకు ఏడు వేల క్యూసెక్కుల నీళ్లు వచ్చే అవకాశం ఉన్నది. పోతిరెడ్డిపాడు నుంచి పూర్తిస్థాయిలో రాయలసీమకు నీరు రావాలంటే శ్రీశైలంలో 854 అడుగుల పైన నీటి మట్టం ఉండాలి. కానీ శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం 854 అడుగుల స్థాయిలో నిండక ముందే తెలంగాణ ప్రభుత్వం కల్వకుర్తి ఎత్తిపోతల ఆపరేట్ చేయడం, విద్యుత్ ఉత్పత్తి చేసి నీటిని కిందికి వదిలెయ్యటం వల్ల శ్రీశైలంలో కనీస నీటిమట్టం జూలై ,ఆగస్టు నెలల్లో కూడా సాధ్యపడని పరిస్థితి నెలకొంది. ఫలితంగా శ్రీశైలం జలాశయం మీద ఆధారపడిన రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులకు నీటి లభ్యత మృగమ్యమౌతోంది.

ఈ సమస్యకు పరిష్కారంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 800 అడుగుల నుండీ నీటిని ఎత్తిపోసుకునే ఉద్దేశ్యంతో 30 రోజుల వరదను అంచనాగా పెట్టుకొని, రోజుకు 3 టీఎంసీ ల నీటిని ఎత్తిపోసేలాగ గత సంవత్సరం రాయలసీమ ఎత్తిపోతల పథకానికి అనుమతినిస్తూ లో GO No: 203 విడుదల చేశారు.

Also Read : రాజస్థాన్,ఛత్తీస్‌ఘడ్‌లపై పంజాబ్ ఎఫెక్ట్

GO No: 203 మీద తీవ్రంగా స్పదించిన తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కు మరియూ KRMB కి పిర్యాదు చేసింది. అలాగే నిజామాబాద్ కు చెందిన రైతు రాయలసీమ ఎత్తిపోతల పథకం వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోంది అంటూ మద్రాసులోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు పిర్యాదు చేయడం జరిగింది. దీని మీద NGT ఒక కమిటీని వేసి రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సబంధించిన జరిగిన పనుల్లో పర్యావరణ ఉల్లంఘనలు ఏమైనా జరిగాయా అనే విషయంపై దర్యాప్తు చేస్తున్నారు, ఇందుకు సంభంధించిన విచారణ కొనసాగుతోంది.

అదే సమయంలో పాలామూరు – రంగా రెడ్డి అనే ప్రాజెక్టుకు సంబంధించి బ్రజేష్ కుమార్, బచావత్ ట్రిబ్యునల్లు, కేంద్ర జలసంఘం, ఆంధ్ర ప్రదేశ్ విభజన చట్టంలో కూడా గుర్తించబడలేదు. అలాగే ఈ ప్రాజెక్టు డిపిఆర్ కు , పర్యావరణ అనుమతులు కానీ లేవు. అందువల్ల ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపాలంటూ ఆంధ్ర ప్రాంతానికి చెందిన మరొక రైతు NGT కి పిర్యాదు చేయడం జరిగింది. ఈ పిర్యాదులపై విచారణలో భాగంగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పర్యావరణ అనుమతులు లేవని ముందుగా ఈ ప్రాజెక్టును ఆపాలంటూ నిన్న తీర్పు వెలువరించింది.

ఇప్పుడేం జరుగుతోంది?

రంగారెడ్డి ప్రాజెక్టు సంబంధించి గత ఐదు, ఆరేళ్ల కాలంగా పనులు జరుగుతున్నాయి. దీనికి సంభంధించిన కాలువలు, రిజర్వాయర్లు పనులు చాలామేరకు పూర్తి అయ్యాయి. అయితే పంప్ హౌస్ నిర్మాణ పనులు పూర్తి కావలసి ఉన్నది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అనుమతులు తెచ్చుకోవాలంటే ముందుగా డిపిఆర్ KRMB కీ సమర్పించాలి. దీనికి సంబంధించి అనుమతులు తెచ్చుకోవాలి. ఒక ప్రాజెక్టు సంబంధించిన అనుమతులు మంజూరు కావాలంటే అనేక క్లిష్ట దశలను దాటవలసి ఉంటుంది. వీటన్నిటిని దాటి అనుమతులు మంజూరు కావాలంటే చాలా సమయం పడుతుంది. అప్పటి వరకూ ఈ పనులు ఆపవలసి ఉంటుంది.

Also Read : హెరాయిన్ కేసులో నిందితుడు సుధాకర్ ఎవరు?అతని వెనక ఎవరున్నారు?

రాజకీయ వాదనలు నిజానిజాలు..!

ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కేవలం వరద జలాలను తీసుకునే ఉద్దేశంతో నిర్మించినట్లు అయితే 90 టీఎంసీలు తీసుకునెలా నిర్మించండం సరైనది కాదు అనే వాదన వినిపిస్తోంది. ఎందుకంటే వరద రోజులు ఏడాదికి ఏడాదికి తగ్గుతూ వస్తున్నాయి. ఇటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు అటు కేంద్రం ప్రభుత్వం కావచ్చు కృష్ణా నది వరద రోజుల అంచనా 30 నుండి 40 రోజుల మధ్యన ఉంటుంది అనే అంచనాతో ఉన్నాయి. అయితే ఈ ప్రాజెక్టు DPR ప్రకారం చూస్తే 90 రోజుల వరద అంచనాతో నిర్మిస్తుండటం వలన ప్రాజెక్టు అనుమతులకు సాంకేతికంగా ఇబ్బందులు సృష్టిస్తుంది .

ముఖ్యంగా 2014 విభజన చట్టం ప్రకారం ఏదైతే కల్వకుర్తి, నెట్టెంపాడు, తెలుగు గంగ, గాలేరు-నగరి, హంద్రీనీవా మరియు వెలిగొండ ప్రాజెక్టులు కొనసాగించాలి. ఈ ప్రాజెక్టులు తెలంగాణ ఏర్పడడం వల్ల గాని లేదా ఎటువంటి రాజకీయ కారణాలతో గానీ ఆపడానికి వీలు లేదని దీని అర్ధం . వీటి అనుమతులకు సంబంధించి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు వాదనలు జరిగాయి. దీనికి సంబంధించి నాటి ఉమ్మడి ఆంధ్ర ప్రభుత్వం ఇవి కేవలం వరద జలాల మీద ఆధారపడి నిర్మిస్తున్న ప్రాజెక్టులు అనిచెప్పింది. దీని మీద కూడా నాడు కొందరు ఫిర్యాదు చేయటం వలన నాటి ప్రభుత్వం కేవలం వరద ఉన్నపుడే నీళ్ళు తీసుకుంటాం అని విస్పష్టంగా తెలిపింది.

Also Read : టీడీపీ గోపవరంలో గెలిస్తే బద్వేల్లో కూడా గెలుస్తుందా?

ఆంధ్ర ప్రదేశ్ వైపు ఉన్న గాలేరు-నగరి, హంద్రీనీవా, తెలుగు గంగ, వెలిగొండ ప్రాజెక్టులపై విభజన చట్టం స్ఫూర్తిని విస్మరిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసినప్పటికీ ఇది చట్టపరంగా కూడా చెల్లదు. బ్రిజేష్ అవార్డు సంబంధించి అంశం కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ బ్రజేష్ వీటి గురించి విచారించి అవార్డులో చేర్చడం జరిగింది. కనుక వీటిని కాదనడానికి హక్కు ఉండదు. అలాగే తెలంగాణ సంబంధించి కల్వకుర్తి, నెట్టెంపాడు ప్రాజెక్టు పూర్తయ్యి నీరు తీసుకుంటూ ఉండటం వల్ల విభజన చట్టంలో పేర్కొనబడిన ఆంధ్ర ప్రాంతపు ప్రాజెక్టులను అపాలనే వాదన సాంకేతికంగా నిలబడదు.

మరి వెలుగొండ సంగతి?

KRMB నోటిఫై చేసిన గెజిట్లో వెలిగొండ గురించి Unapproved(APR Act 214) అని కాకుండా Unapproved అని ఉండటం మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం KRMB కి ఫిర్యాదు చేసింది. భవిషత్తులో గెజిట్ కరెక్షన్లో APR Act 214 అని వెలిగొండ ప్రాజెక్ట్ కింద చేర్చవచ్చు. ఒక వేళ KRMB కరెక్షన్ చేయని పక్షంలో సుప్రీం కోర్టు కు వెళ్ళయినా 2014 విభజన చట్టం ఆధారంగా వెలిగొండకు గుర్తింపు తీసుకు రావచ్చు.

నిన్న పాలమూరు-రంగారెడ్డి పర్యావణ అనుమతుల మీద విచారణ చేసిన NGT తన తీర్పులో 2014 విభజన చట్టాన్ని ప్రస్తావిస్తూ అందులో తెలుగు గంగ, హంద్రీ-నీవా, గాలేరు-నగరి, వెలిగొండ, నెట్టెంపాడు మరియు కల్వకుర్తి ప్రాజెక్ట్ లు మాత్రమే ఉన్నాయని చెప్పింది. దీని అర్ధం వెలిగొండ ప్రాజెక్టుకు విభజన చట్టం హామీ ఉంది.. దాన్ని ఎవరు ఆపలేరు. దీని మీద రాజకీయ పక్షాలు చేస్తున్న విమర్శలు కేవలం ప్రచారం కోసమే.

Also Read : తెలుగుదేశం ఎమ్మెల్యేలతో రాజీనామా చేయిస్తుందా?

సామరస్యమా? న్యాయ పరిష్కారమా!

కృష్ణా నది మీద ప్రధానంగా చర్చ జరుగుతున్నది వరద జలాల మీద కనుక, ఈ ప్రాజెక్టులకు సంబంధించి బచావత్ చెప్పినట్టుగా దిగువ రాష్ట్రాల కి వరద జలాల మీద సహజమైన హక్కు ఉంటుంది. వరద జలాలే కాకుండా 150 టీఎంసీల క్యారీ ఓవర్ నీటిని నిలువ చేసుకోవటానికి బచావత్ ట్రిబ్యునల్ ఆంధ్రప్రదేశ్ కు అవకాశమిచ్చింది.

రాయలసీమ లిఫ్ట్ మీద తెలంగాణకు అభ్యంతరం ఉన్నట్లే పాలమూరు రంగారెడ్డి మీద ఆంధ్రాకు అభ్యంతరం ఉన్నది. ఇరురాష్ట్రాల ఫిర్యాదులను KRMB తేల్చటానికి చాలా ఎక్కువ సమయం పడుతుంది. అప్పటి వరకు 60-70% పూర్తయిన పాలమూరు-రంగా రెడ్డి ప్రాజెక్ట్ పనులు ఆపటం తెలంగాణాకు తీవ్రమైన నష్ట చేస్తుంది. రాయలసీమ లిఫ్ట్ అనేది సంవత్సరం కిందట మొదలు పెట్టిన ప్రాజెక్ట్కొం. త ఎర్త్ వర్క్ మాత్రమే జరిగింది. ఈ ప్రాజెక్ట్ పనులు ఆపటం వలన తక్షణం వచ్చే నష్టమేమి లేదు. అసలు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ లేకుంటే రాయలసీమ లిఫ్ట్ ప్రతిపాదనే వచ్చి ఉండకపోయుండొచ్చు.

వాస్తవిక పరిస్థితులను అంచనా వేసుకొని తెలంగాణ ప్రభుత్వం ముందుకు వెళితే ఉభయ రాష్ట్రాలకు లాభం జరుగుతుంది.

Also Read : జగన్ సర్కార్ ఎక్కడా తగ్గలే..

Jojobet GirişBetcioivermectin tabletPusulabetPusulabetMadridbetmeritbetCasibom GirişmeritbetlunabetTophillbetmarsbahis girişJojobet GirişcasibomCasibom GirişMarsbahis Giriş