iDreamPost
android-app
ios-app

పెళ్లైన మూడ్రోజులకే ప్రియుడితో జంప్.. ఆగ్రహంతో..

  • Published Jun 13, 2022 | 8:40 AM Updated Updated Dec 21, 2023 | 6:34 PM

యువతికి బలవంతంగా మరో వ్యక్తితో పెళ్లి జరిపించారు పెద్దలు. ప్రియుడిని మరిచిపోలేక ఆ యువతి పెళ్లైన మూడోరోజే అతనితో కలిసి వెళ్లిపోయింది. విషయం తెలిసిన కుటుంబసభ్యులు ఆగ్రహంతో యువకుడి ఇంటికి నిప్పుపెట్టారు. ఈ ఘటన కర్నూల్ జిల్లాలో జరిగింది.

యువతికి బలవంతంగా మరో వ్యక్తితో పెళ్లి జరిపించారు పెద్దలు. ప్రియుడిని మరిచిపోలేక ఆ యువతి పెళ్లైన మూడోరోజే అతనితో కలిసి వెళ్లిపోయింది. విషయం తెలిసిన కుటుంబసభ్యులు ఆగ్రహంతో యువకుడి ఇంటికి నిప్పుపెట్టారు. ఈ ఘటన కర్నూల్ జిల్లాలో జరిగింది.

పెళ్లైన మూడ్రోజులకే ప్రియుడితో జంప్.. ఆగ్రహంతో..

ఇద్దరూ గాఢంగా ప్రేమించుకున్నారు. కానీ.. వారి ప్రేమను పెద్దలు అంగీకరించలేదు. యువతికి బలవంతంగా మరో వ్యక్తితో పెళ్లి జరిపించారు పెద్దలు. ప్రియుడిని మరిచిపోలేక ఆ యువతి పెళ్లైన మూడోరోజే అతనితో కలిసి వెళ్లిపోయింది. విషయం తెలిసిన కుటుంబసభ్యులు ఆగ్రహంతో యువకుడి ఇంటికి నిప్పుపెట్టారు. ఈ ఘటన కర్నూల్ జిల్లాలో జరిగింది. మంత్రాలయం మండలం మాధవరం గ్రామానికి చెందిన యువతికి పొరుగూరుకు చెందిన యువకుడితో జూన్ 9వ తేదీన వివాహమయింది. కానీ.. అప్పటికే యువతి మాధవరం గ్రామానికి చెందిన శివాజీ అనే వ్యక్తితో ప్రేమలో ఉంది.

పెద్దల బలవంతంతో పెళ్లికి ఒప్పుకున్నా.. ప్రియుడ్ని మరిచిపోలేకపోయింది. పెళ్లైన మూడోరోజే శివాజీతో వెళ్లిపోయింది. విషయం తెలిసిన యువతి బంధువులు ఆదివారం (జూన్ 12)రాత్రి మాధవరం చేరుకుని శివాజీ ఇంటికి నిప్పటించారు. ఆ సమయంలో ఆ ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. సాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని స్థానికుల సహాయంతో.. మంటలను అదుపుచేశారు. శివాజీ కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

jojobet girişJojobet GirişJojobet GirişCasibomiptv satın alMadridbetMadridbetMadridbetmeritbetCasibom GirişmeritbetholiganbetMeritking giriş