iDreamPost
android-app
ios-app

Rowdy Boys : భారీ హంగామాతో కొత్త హీరో ఎంట్రీ

  • Published Jan 11, 2022 | 4:58 AM Updated Updated Jan 11, 2022 | 4:58 AM
Rowdy Boys : భారీ హంగామాతో కొత్త హీరో ఎంట్రీ

దిల్ రాజు నిర్మాణంలో ఆయన సోదరుడు శిరీష్ అబ్బాయి ఆశిష్ హీరోగా పరిచయమవుతున్న రౌడీ బాయ్స్ ని చాలా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఒక్క హైదరాబాద్ లోనే బంగార్రాజుతో సమానంగా థియేటర్లను పంచారంటే ఏ రేంజ్ లో మార్కెటింగ్ జరుగుతోందో అర్థం చేసుకోవచ్చు. అలా అని దీని కోసం ప్రేక్షకులు విపరీతంగా ఎదురు చూస్తున్నారని కాదు. ముందు ప్రమోషన్ పీక్స్ లో చేసుకుంటే ఆ తర్వాత ఓపెనింగ్స్ అవే వస్తాయనే ధీమా కనిపిస్తోంది. ట్రైలర్ ని జూనియర్ ఎన్టీఆర్ తో లాంచ్ చేయించారు. ఒక పాట విడుదల కోసం ఏకంగా ఈవెంట్ చేసి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని గెస్ట్ గా పిలిచి మంచి కవరేజ్ ఇప్పించారు.

రేపో ఎల్లుండో ప్రభాస్, రామ్ చరణ్ లను కూడా రంగంలోకి దించబోతున్నట్టు తెలిసింది. సినిమా బడ్జెట్, పబ్లిసిటీతో కలిపి రౌడీ బాయ్స్ మీద దిల్ రాజు సుమారు 25 కోట్ల దాకా ఖర్చు పెట్టారని ఇన్ సైడ్ టాక్. ఆ స్థాయిలో బిజినెస్ జరిగే అవకాశాలు లేవు కాబట్టి చాలా ప్రాంతాల్లో స్వంతంగా రిలీజ్ చేస్తున్నారట. ప్రేమదేశం, ఆర్య, తొలిప్రేమ షేడ్స్ లో ఈ రౌడీ బాయ్స్ యూత్ ని విపరీతంగా ఆకట్టుకుంటుందని దిల్ రాజు తెగ చెబుతున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ పరిమితులను దాటుకుని మొదటి సారి కొంచెం లిమిట్ దాటామని హింట్ కూడా ఇస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

హుషారు లాంటి చిన్న సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న దర్శకుడు శ్రీహర్ష ఇందులో కూడా యువతనే టార్గెట్ చేశారు. అంతా బాగానే ఉంది కానీ రౌడీ బాయ్స్ కి టాక్ చాలా కీలకం. ఎంత పండగ బరిలో పాన్ ఇండియా సినిమాలు లేకపోయినా అవతల బంగార్రాజు నుంచి గట్టి పోటీ నెలకొంది. గల్లా అశోక్ హీరోని తక్కువ అంచనా వేయడానికి లేదు. ఇంత హంగామాతో లాంచ్ అవుతున్న ఆశిష్ తో తర్వాత కూడా సినిమాలు ప్లాన్ చేశారట దిల్ రాజు. నిర్మాతల వారసులు హీరోగా నిలదొక్కుకున్న దాఖలాలు తక్కువ. రామానాయుడు గారి అబ్బాయి వెంకటేష్ మాత్రం స్టార్ లీగ్ లోకి దూసుకుపోయారు. మరి ఈ ఆశిష్ ఏమవుతాడో చూడాలి

Also Read : 2022 Sankranthi : వాయిదా వేసుకున్నోళ్ళే ధన్యులు సుమతీ

jojobet girişJojobet GirişJojobet GirişCasibomiptv satın alMadridbetMadridbetmadridbetmeritbetMarsbahis GirişCasibom Girişmeritbet