iDreamPost
android-app
ios-app

MAA Elections : సినిమాలను మించుతున్న ‘మా’ ట్విస్టులు

MAA Elections :  సినిమాలను మించుతున్న ‘మా’ ట్విస్టులు

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జరిగి వారం గడుస్తున్న ఇప్పటికీ ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారుతూనే ఉంది. మునుపెన్నడూ లేని విధంగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జరిగాయి. రెండు వర్గాలుగా విడిపోయి ప్రకాష్ రాజ్, మంచు విష్ణు మద్దతుదారులు ఒకరిమీద ఒకరు తీవ్ర ఆరోపణలు కూడా చేసుకున్న పరిస్థితి కనిపించింది. అయితే అసోసియేషన్ ఎన్నికల పోలింగ్ వ్యవహారంలో మోహన్ బాబు, మంచు విష్ణు తరపు మనుషులు దౌర్జన్యంగా ప్రవర్తించారని ప్రకాష్ రాజు ప్యానల్ వారు ఆరోపిస్తున్నారు. సీనియర్ నటుడు బెనర్జీ అయితే తనను మోహన్ బాబు బూతులు తిట్టారు అని చెబుతూ కన్నీళ్లు పెట్టుకోగా తనీష్ కూడా తనను తిడుతుంటే బెనర్జీ అడ్డుకోవడానికి వెళ్లారని ఆయన మీద మోహన్ బాబు ఊహించని విధంగా మాటలు మాట్లాడారని చెప్పుకొచ్చారు.

మొత్తం మీద ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి పోటీ చేసిన అందరూ తమ తమ పదవులకు రాజీనామా చేయగా ఇప్పుడు మంచు విష్ణు ప్యానల్ నుంచి ఎన్నికైన అందరూ ప్రమాణస్వీకారం చేశారు. అయితే ఎన్నికల పోలింగ్ సమయంలో జరిగిన దౌర్జన్యకాండ అలాగే కౌంటింగ్ సమయంలో జరిగిన అవకతవకలు సీసీటీవీలో రికార్డ్ అయి ఉంటాయి కాబట్టి ఆ ఫుటేజ్ తనకు ఇప్పించవలసిందిగా ప్రకాష్ రాజ్ మా ఎన్నికల అధికారి కృష్ణమోహన్ కి లేఖ రాశారు. ప్రకాష్ రాజ్ లేఖకు వెంటనే స్పందించిన కృష్ణమోహన్ నిబంధనల ప్రకారం అడిగితే ఇవ్వడానికి సిద్ధమని పేర్కొన్నారు కానీ ఇప్పుడు ఆయన సిసి టివి ఫుటేజ్ ఇవ్వడానికి నిరాకరించినట్లు తెలుస్తోంది. సీసీ టీవీ ఫుటేజ్ ఇవ్వడానికి నిరాకరిస్తున్న కారణంగా ప్రకాష్ రాజ్ ఇప్పుడు పోలీసులను ఆశ్రయించినట్లు చెబుతున్నారు.

ఎన్నికల సమయంలో తమ మీద దాడి జరిగింది అని చెబుతూ ఆ దాడి దృశ్యాలు సిసి టివి ఫుటేజ్ లో ఉన్నాయని అవి దొరికితే ఫిర్యాదు చేస్తామని చెబుతూ పోలీసులను ఆశ్రయించారట. ఇక పోలీసులకు తప్పక ఎన్నికలు జరిగిన జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్ కు వెళ్లి సీసీటీవీ సర్వర్ రూమ్ కి తాళాలు వేశారు. ఆ తాళాలు పోలీసులు దగ్గర పెట్టుకుని తదుపరి విచారణ ప్రారంభించారు. గతంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో చాలా సమస్యలు బయటికి వచ్చాయి కానీ ఎప్పుడూ కూడా పోలీసుల దాకా వచ్చిన దాఖలాలు లేవు. కానీ మొట్టమొదటిసారిగా ప్రకాష్ రాజ్ పోలీసులను ఆశ్రయించడంతో ఈ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే సామాన్యులకు మాత్రం ఈ వ్యవహారం వెగటు పుట్టిస్తుంది. సినిమాల్లో మంచి మాటలు చెప్పి నలుగురికి ఆదర్శంగా ఉంటుండే సినీనటులు ఇలా వారిలో వారు గొడవలు పడుతూ ఉండడంతో వారందరూ రక రకాలుగా స్పందిస్తున్నారు.

Also Read :Surya : స్టార్ హీరోల ఆలోచనా ధోరణిలో మార్పులు

Jojobet GirişbetparkGrandpashabetgrandpashabetGrandpashabetMeritkingCasibomCasibomcasibomjojobet girişjojobetdeneme bonusu veren sitelerjojobetMadridbetMadridbetJojobet girişgrandpashabetJojobetjojobetgrandpashabetjojobetcasibomjojobetjojobetcasibomcasibom girişgrandpashabetholiganbetgrandpashabet güncel girişjojobetjojobet girişjojobet