iDreamPost
android-app
ios-app

నా వ్యక్తిగత జీవితం గురించికాదు, నా వ‌ర్క్ గురించి మాట్లాడండి. ఫీల‌యిన నాగ చైత‌న్య‌

  • Published Jul 31, 2022 | 4:49 PM Updated Updated Jul 31, 2022 | 4:50 PM
నా వ్యక్తిగత జీవితం గురించికాదు, నా వ‌ర్క్ గురించి మాట్లాడండి. ఫీల‌యిన నాగ చైత‌న్య‌

లాల్ సింగ్ చద్దాపై నాగ చైన‌త్య చాలా ఆశ‌లు పెట్టుకున్నాడు. సమంతతో విడిపోయిన త‌ర్వాత తన సినిమాల కంటే వ్యక్తిగత జీవితానికి సంబంధించిన గాసిప్స్, కామెంట్స్ ఎక్కువ‌గా వినిపించాయి. ఇది చైతుకు అస్స‌లు న‌చ్చ‌లేదు.

నాగ చైతన్య, సమంత రూత్ ప్రభు గత ఏడాది విడిపోయారు. ఆ త‌ర్వాత స‌మంత దూకుడు పెంచింది. ఒక్క పాట‌తోనే ఇండియాను ఆక‌ట్టుకుంది. ఇప్పుడు బాలీవుడ్ మీద దండ‌యాత్ర మొద‌లుపెట్టింది. లేటెస్ట్ గా , కాఫీ విత్ క‌రణ్ తో నేష‌న‌ల్ వైడ్ గా ఇంకా పాపుల‌ర్ అయిపోయింది. ఆమె వ్య‌క్తిగ‌త జీవితం, చైతూతో విడాకులు కూడా మ‌ళ్లీ వార్త‌ల‌కెక్కాయి.

స‌మంత నుంచి విడిపోయిన తర్వాత, చై, బంగార్రాజు, థాంక్యూ చిత్రంలో న‌టించాడు. మొదటిది బాక్సాఫీస్ వద్ద హిట్, రెండోది డిజాస్టర్. కొన్ని నెలలుగా, చై, తన సినిమాల కంటే తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తల్లో న‌లిగాడు. శోభితా ధూళిపాలాతో అనుబంధం గురించి చాలా పుకార్లు వ‌చ్చాయి.

ఇటీవ‌లే ఇంటర్వ్యూలో, తన సినిమాల కంటే తన వ్యక్తిగత జీవితం గురించి ఎక్కువ హ‌డావిడి న‌డుస్తోంద‌ని చైత‌న్య ఫీల‌య్యాడు. “నేను చేసే సినిమాల కంటే (నా వ్యక్తిగత జీవితం గురించే) సందడి ఎక్కువ. కానీ ఇప్పుడున్న కాలం అలానే ఉంది. కొన్ని మీడియా వర్గాలు రిపోర్ట్ చేయడానికి నా వ్య‌క్తిగ‌త జీవితాన్నే ఎంచుకుంటున్నాయి. కష్టపడి పనిచేయడం నటుడిగా నా బాధ్యత. చివరికి, నా క‌ష్ట‌మే విజ‌యం సాధిస్తుంది. దాని గురించే పాజిటీవ్ గా ఉండాల‌నుకొంటున్నాను. ఆగస్ట్ 11 నుండి నా పని గురించి కూడా మాట్లాడతార‌ని ఆశిస్తున్నాన‌ని నాగ చైన‌త్య అన్నాడు. లాల్ సింగ్ చద్దా ఆగస్టు 11న రిలీజవుతోంది. ఈ సినిమా తర్వాత జనం తన పర్సనల్ లైఫ్ గురించి కాక టాలెంట్ గురించి కూడా మాట్లాడుకుంటారని “చై” ఆశపడుతున్నాడు.

నాగ చైతన్య లాల్ సింగ్ చద్దాతో బాలీవుడ్ అరంగేట్రం చేస్తున్నాడు. ఇది ఇది పొడిగించిన అతిధి పాత్ర. కాని చాలా కీల‌కం. నిజానికి ఇది విజయ్ సేతుపతి ఈ పాత్రను పోషించాల్సి ఉంది. బిజీ షెడ్యూల్ కారణంగా, అతను కాల్ షీట్స్ ఎడ్జెస్ట్ చేయ‌లేక‌పోయాడు. ఆ త‌ర్వాత‌ అవ‌కాశం నాగ చైత‌న్య‌కి వ‌చ్చింది. త‌న కెరీర్ ను మ‌లుపుతిప్పే స‌త్తా లాల్ సింగ్ చద్దాకి ఉంద‌న్న‌ది చైతు న‌మ్మ‌కం. ఇటీవల, మేకర్స్ నాగ చైతన్య యొక్క సోలో పోస్టర్‌ను షేర్ చేశారు. అతని పాత్ర బాలరాజు బోడిని పరిచయం చేశారు.

Jojobet GirişmeritbetmeritbetcasibomJojobetcasibomgalabetJojobet GirişjojobetjojobetjojobetcasibomcasibomPokerklasMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin GirişitemciCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/