iDreamPost
android-app
ios-app

మరో పరువు హత్య.. కూతురిని గొంతుకోసి చంపిన తండ్రి

  • Published Jun 08, 2022 | 6:36 PM Updated Updated Jun 08, 2022 | 6:36 PM
మరో పరువు హత్య.. కూతురిని గొంతుకోసి చంపిన తండ్రి

వేరే కులం లేదా మతానికి చెందిన వారిని ప్రేమించిన పాపానికి నిండునూరేళ్లు జీవించాల్సిన పిల్లల జీవితాలు మధ్యలోనే ముగిసిపోతున్నాయి. ఇటీవల హైదరాబాద్ లో వరుస పరువు హత్యలు కలకలం రేపాయి. తాజాగా కర్ణాటక రాష్ట్రం మైసూరు నగరంలో మరో పరువు హత్య జరిగింది. మైసూరు జిల్లా పరిధిలోని పెరియపట్నం తాలూకా కగ్గుండి గ్రామానికి చెందిన సురేష్, బేబీ దంపతుల కుమార్తె షాలిని (17) పీయూసీ సెకండ్ ఇయర్ చదువుతోంది. పొరుగూరు మేళ్లహళ్లి గ్రామానికి చెందిన మంజు అనే దళిత యువకుడితో షాలిని ప్రేమలో పడింది. ఈ విషయం షాలిని ఇంట్లో తెలియడంతో కుమార్తెను మందలించి కట్టడి చేశారు.

ఓ రోజు మంజు – షాలిని పారిపోయారు. కూతురు ఇంట్లో లేదని గ్రహించి.. వెంటనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని వారిద్దరినీ వెతికి తీసుకొచ్చారు. షాలిని పోలీసుల సమక్షంలో తాను మంజు మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నామని, అతనితోనే ఉంటానని చెప్పింది. షాలిని మైనర్ కావడంతో.. ఆమెను పోలీసులు బాలసదన్ కు పంపారు. కొద్దిరోజులు బాలసదన్ లో ఉన్న షాలిని.. తల్లిదండ్రులకు ఫోన్ చేసి తనను ఇంటికి తీసుకెళ్లమని కోరింది.

సురేష్ దంపతులు బాలసదన్ కు వచ్చి తమ కుమార్తెను ఇంటికి తీసుకువెళ్లారు. ఇంటికి వచ్చిన కొద్దిరోజులకు షాలిని మళ్లీ తాను మంజు ను ప్రేమిస్తున్నానని.. అతనితో తనకు పెళ్లి జరిపించాలని తల్లిదండ్రులను అడిగింది. ఆగ్రహానికి గురైన సురేష్ సోమవారం (జూన్ 6) తెల్లవారుజామున కూతురిని గొంతుకోసి హత్య చేసి, మంజు స్వగ్రామమైన మేళహళ్లి గ్రామంలోని వ్యవసాయభూమిలే పడేసి.. మంగళవారం ఉదయం పెరియపట్నం పోలీసు స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, మేళహళ్లి గ్రామంలో ఉన్న షాలిని మృతదేహాన్ని పోస్టుమార్టమ్ కు తరలించారు.

Jojobet GirişBetcioivermectin tabletMadridbetMadridbetPusulabetmeritbetCasibom GirişmeritbetpokerklasTophillbetmarsbahis girişJojobet GirişcasibomCasibom GirişMarsbahis GirişHoliganbetbetebetHoliganbet