iDreamPost
android-app
ios-app

ఐటీకీ ‘ఆధ్యుడు’ హయాంలో అలా జరిగిందా..?

  • Published Aug 24, 2020 | 7:09 AM Updated Updated Aug 24, 2020 | 7:09 AM
ఐటీకీ ‘ఆధ్యుడు’ హయాంలో అలా జరిగిందా..?

ఆంధ్రప్రదేశ్‌లో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ)కీ, ఆ మాటకొస్తే దేశంలోనే దీనికి నేనే ఆధ్యుడిని అని చెప్పుకునే నారా చంద్రబాబునాయుడి హాయంలో విశాఖలో ఐటీ వెనక్కు నడిచిందా? అవుననే అంటున్నారు వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు ఐటీలో చంద్రబాబు చేసిన ఘనకార్యాలకు, అంతిమంగా విశాఖకు చేసిన ద్రోహానికి సంబంధించిన చర్చను మరోసారి తెరమీదకు తెస్తున్నాయి.

వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హాయంలో విశాఖ ఐటీ టవర్స్‌ను సిద్ధం చేసి, అక్కడ 18వేల మందికి ఉపాధి కల్పించారు. అయితే చంద్రబాబు హయాంలో అందులో సగం మందికి ఉద్యోగాలు పోయాయని, ఇందుకు చంద్రబాబు వైఖరే కారణమని విజయసాయిరెడ్డి ఆరోపణలు గుప్పించారు. విశాఖలో ప్రతియేటా నిర్వహించిన పెట్టుబడుల సదస్సు మాయలో ఇటువంటి అనేక విషయాలను చంద్రబాబు, ఆయన బృందం మరుగున పడేసాయన్న భావన వైఎస్సార్‌సీపీ నాయకుల నుంచి వ్యక్తమవుతోంది.

విశాఖలో ఉన్న సదుపాయాల నేపథ్యంలో పలువురు పెట్టుబడిదారులు ఇక్కడికి వచ్చినప్పటికీ చంద్రబాబు వాటిని అమరావతికి తరలించే ప్రయత్నం చేసారన్న ప్రచారం కూడా జోరుగా సాగింది. ఇప్పుడు ఇదే విషయాన్ని విజయసాయిరెడ్డి కూడా మరోమారు గుర్తు చేసారు. అంతే కాకుండా విశాఖ అభివృద్ధికి ఏ ఒక్క చర్య చేపట్టిన పాపాన పోలేదన్నది ఆయన వ్యక్తం చేస్తున్న అభిప్రాయం. కనీసం విశాఖ వాసుల త్రాగునీటి అవసరాలను కూడా పట్టించుకోలేదని గట్టి ఆరోపణలే చేసారు.

ఇప్పటిక్కూడాS అమరావతి కోసం మాత్రమే మాట్లాడుతున్న చంద్రబాబుకు విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు మరింత ఇబ్బందుల సృష్టించక తప్పవన్నది పరిశీలకుల భావన. ఒక పక్క రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలన్నది తమ అభిప్రాయమని, అందుకు కార్యాచరణతో సహా సిద్ధంగా ఉన్నామని సీయం వైఎస్‌ జగన్‌ బృందం ప్రకటిస్తోంది.

మరో వైపు కేవలం అమరావతిని గురించి మాత్రమే పోరాడుతూ రాష్ట్రానికి ప్రతిపక్ష నేత అయినప్పటికీ ప్రస్తుతం అమరావతికి మాత్రమే నాయకుడిగా చంద్రబాబు మిగిలిపోతున్నారు. ఈ నేపథ్యంలో అమరావతి మినహా మిగిలిన రాష్ట్రానికి చంద్రబాబు ఏరకమైన సమాధానం ఇచ్చుకుంటారో? భవిష్యత్తులో ఏ వ్యూహం అనుసరిస్తారో? వేచి చూడాల్సిందే.

Jojobet GirişmeritbetjojobetKavbet girişcasibomJojobet GirişcasibomjojobetjojobetjojobetjojobetMadridbetMadridbetcasibom girişjojobet girişCasibom Girişmeritkingsuperbetincasibomholiganbet girişholiganbet girişMarsbahis GüncelHoliganbet GirişHoliganbet Güncel GirişMarsbahis GirişMarsbahis Güncel Giriş