iDreamPost
android-app
ios-app

క్లాస్ టచ్ ఇస్తున్న థాంక్ యు

  • Published May 26, 2022 | 5:22 PM Updated Updated May 26, 2022 | 5:22 PM
క్లాస్ టచ్ ఇస్తున్న థాంక్ యు

నాగ చైతన్య కొత్త సినిమా థాంక్ యు టీజర్ ఆన్ లైన్లో అప్పుడే 5 మిలియన్ల వ్యూస్ కి దగ్గరయ్యింది. బంగార్రాజు లాంటి మాస్ హిట్ తర్వాత చైతు కంప్లీట్ క్లాస్ టచ్ ఉన్న స్టైలిష్ ఎంటర్ టైనర్ ని ఎంచుకున్నాడు. జీవితంలో రాజీ పడి, కిందపడి లేచి, గెలిచి ఒక స్థాయికి చేరుకున్న యువకుడు ఇకపై దేనికీ కాంప్రోమైజ్ అవ్వకూడదని నిర్ణయించుకుంటాడు. ప్రేమలో కూడా. ఎందుకే ఇతని లైఫ్ లో ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు ఉంటారు. ఎక్కడో ఇండియాలో చిన్న ఊరిలో ఉండే ఈ అబ్బాయి ప్రయాణం విదేశాల దాకా ఎలా వెళ్ళింది, చాలా పాఠాలు నేర్చుకున్నానని చెబుతున్న అతగాడు ఏం చేశాడనేదే స్టోరీ.

ట్రైలర్ బాగానే అనిపిస్తోంది కానీ విక్రమ్ మార్క్ మనం, ఇష్క్, 24 టైపు మేజిక్ స్క్రీన్ ప్లే ఇందులో ఏ మేరకు ఉందో చూడాలి. అదే ఫైనల్ సక్సెస్ ని డిసైడ్ చేస్తుంది. సోషల్ మీడియాలో దీనికి మిశ్రమ స్పందన వస్తోంది. ప్రేమమ్ షేడ్స్ కొంత, మనం ఫ్లేవర్ కొంత మిక్స్ చేసి చైతుని మూడు నాలుగు షేడ్స్ లో చూపించినట్టు అభిప్రాయపడుతున్నారు. లేత యువకుడిగా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో నాగ చైతన్యని చూపించడం కొత్తగా ఉంది. తమన్ సంగీతం వీడియోలోని మూడ్ కి తగ్గట్టు సింక్ అయ్యింది. పిసి శ్రీరామ్ ఛాయాగ్రహణం ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్న ఈ లవ్ కం రొమాంటిక్ ఎంటర్ టైనర్ హిట్ కావడం నాగచైతన్యకు చాలా కీలకం.

జులై 8న విడుదల కాబోతున్న థాంక్ యులో రాశిఖన్నా, అవికా గోర్, మాళవిక నాయర్ హీరోయిన్లుగా నటించారు. వీళ్ళ ముగ్గురితో సెపరేట్ ట్రాక్స్ సెట్ చేశారు. బివిఎస్ రవి కథను అందించారు. మజిలీ, లవ్ స్టోరీ తరహాలో ఇది కూడా యూత్ కి కనెక్ట్ అయితే హిట్ కన్ఫర్మ్. ఇదే విక్రమ్ కుమార్ తో చైతు దూత అనే వెబ్ సిరీస్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆగస్ట్ లో దాన్ని స్ట్రీమింగ్ చేసే అవకాశం ఉంది. అదే నెలలో అమీర్ ఖాన్ తో కలిసి నటించిన లాల్ సింగ్ చద్దా మీద అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. గీత గోవిందం, సర్కారు వారి పాట ఫేమ్ పరశురామ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన చైతు త్వరలోనే దాన్ని స్టార్ట్ చేయబోతున్నాడు

Jojobet GirişmeritbetmeritbetholiganbetHoliganbet girişcasibomJojobet GirişcasibomjojobetjojobetcasibomholiganbetMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren sitelerCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişdirect to wallet crypto swap