iDreamPost
android-app
ios-app

Sunny Leone : గాలి నాగేశ్వరరావు జోడిగా ఐటెం బాంబ్

  • Published Mar 08, 2022 | 4:30 PM Updated Updated Jan 06, 2024 | 6:36 PM

తను టాలీవుడ్ సినిమాల్లోనూ అడపాదడపా కనిపించేది. రాజశేఖర్ గరుడవేగాలో ఐటెం సాంగ్ చేయడం అంత ఈజీగా మర్చిపోగలమా. దీనికన్నా ముందు సన్నీ చెప్పుకోదగ్గ లెన్త్ ఉన్న క్యారెక్టర్ వేసింది 2014లో వచ్చిన కరెంట్ తీగలో.

తను టాలీవుడ్ సినిమాల్లోనూ అడపాదడపా కనిపించేది. రాజశేఖర్ గరుడవేగాలో ఐటెం సాంగ్ చేయడం అంత ఈజీగా మర్చిపోగలమా. దీనికన్నా ముందు సన్నీ చెప్పుకోదగ్గ లెన్త్ ఉన్న క్యారెక్టర్ వేసింది 2014లో వచ్చిన కరెంట్ తీగలో.

Sunny Leone : గాలి నాగేశ్వరరావు జోడిగా ఐటెం బాంబ్

ఇండస్ట్రీకి వచ్చి ఏళ్ళు గడుస్తున్నా సన్నీ లియోన్ ఇప్పటికీ ఎందరికో హాట్ ఫేవరెట్. సిల్క్ స్మిత తర్వాత ఆ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న సన్నీ నిజ జీవితం మీద ఏకంగా రెండు సీజన్ల వెబ్ సిరీస్ వచ్చిందంటేనే తన పాపులారిటీని అర్థం చేసుకోవచ్చు. తను టాలీవుడ్ సినిమాల్లోనూ అడపాదడపా కనిపించేది. రాజశేఖర్ గరుడవేగాలో ఐటెం సాంగ్ చేయడం అంత ఈజీగా మర్చిపోగలమా. దీనికన్నా ముందు సన్నీ చెప్పుకోదగ్గ లెన్త్ ఉన్న క్యారెక్టర్ వేసింది 2014లో వచ్చిన కరెంట్ తీగలో. మంచు మనోజ్ హీరోగా జి నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ ఎంటర్ టైనర్ కమర్షియల్ గా అప్పటి థియేటర్లలో బాగానే ఆడింది.

ఇన్నేళ్ల తర్వాత సన్నీ లియోన్ తిరిగి రీ ఎంట్రీ ఇస్తోంది. మంచు విష్ణు హీరోగా ఈషాన్ సూర్య దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో ఓ ప్రధాన పాత్ర పోషిస్తోంది. కోన వెంకట్ రచనా సారధ్యంతో పాటు నిర్మాణ భాగస్వామిగా కూడా వ్యవహరించబోతున్నారు. మెయిన్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ కాగా కీలకమైన మరో క్యారెక్టర్ కోసం సన్నీని తీసుకున్నారు. ప్రస్తుతం దీని షూటింగ్ జరుగుతోంది. ఈ వివరాలన్నీ విష్ణు తన సోషల్ మీడియా హ్యాండిల్స్ లో షేర్ చేసుకున్నావే. ఈ సినిమాలో తన పేరు గాలి నాగేశ్వరరావు. టైటిల్ అదే పెడతారా లేక ఏదైనా మార్పు ఉంటుందా అనేది అధికారిక ప్రకటన వచ్చేదాకా చూడాలి.

ఇంత గ్యాప్ తీసుకున్నాక మంచు ఫ్యామిలీతోనే సన్నీ రీ ఎంట్రీ జరగడం విశేషం. మా ప్రెసిడెంట్ అయ్యాక విష్ణు చేస్తున్న మూవీ కూడా ఇదే. చాలా ఏళ్లుగా బాక్సాఫీస్ సక్సెస్ లేక వెయిటింగ్ లో ఉన్న విష్ణు ఈ సబ్జెక్టు మీద కాన్ఫిడెన్స్ గా ఉన్నాడు. జానర్ ఏదనేది బయటికి చెప్పలేదు కానీ తను షేర్ చేసుకున్న కార్టూన్ క్యారికేచర్స్ ని బట్టి చూస్తే ఏదో మాస్ టచ్ ఉన్న సినిమాలాగే కనిపిస్తోంది. ఇదే ఏడాది విడుదలకు ప్లాన్ చేసుకున్న ఈ గాలి నాగేశ్వరరావు పేరుని గమనిస్తే కామెడీ తరహాలోనే కనిపిస్తోంది. మరోవైపు శ్రీను వైట్లతో ప్లాన్ చేసుకున్న ఢీ అంటే ఢీ(ఢీ సీక్వెల్)ప్రస్తుతానికి ఆగింది. మళ్ళీ ఎప్పుడు మొదలుపెడతారో తెలియాల్సి ఉంది

Also Read : Radhe Shyam : వాళ్ళను మెప్పిస్తే చాలు బాక్సాఫీస్ ఊచకోతే

Jojobet GirişmeritbetmeritbetcasibomvbetjojobetJojobet GirişjojobetjojobetjojobetcasibomcasibomPokerklasMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişbetcio girişCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetin