iDreamPost
android-app
ios-app

సమంతా చేతికి క్రేజీ ప్రాజెక్ట్స్

  • Published Jun 06, 2022 | 5:26 PM Updated Updated Jun 06, 2022 | 5:34 PM
సమంతా చేతికి క్రేజీ ప్రాజెక్ట్స్

మాములుగా పెళ్ళయాక హీరోయిన్ల కెరీర్ నెమ్మదిస్తుంది. అందులోనూ విడాకులు తీసుకున్నాక చెప్పేదేముంది. మెల్లగా అవకాశాలు తగ్గిపోయి క్యారెక్టర్ ఆర్టిస్టుగా షిఫ్ట్ అవ్వాల్సి ఉంటుంది. కానీ సామ్ ఈ సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తూ రివర్స్ లో దూసుకుపోతోంది. నాగచైతన్యతో వివాహ బంధానికి స్వస్తి చెప్పాక తను చేసిన మొదటి స్క్రీన్ ప్రెజెన్స్ పుష్పలో ఐటెం సాంగ్. మొదట్లో కామెంట్స్ వచ్చినప్పటికీ ఆ పాట సినిమా సక్సెస్ లో ఎంత కీలక పాత్ర వహించిందో చూసాక అందరూ సైలెంట్ అయ్యారు. తర్వాత విజయ్ సేతుపతి నయనతార కాంబినేషన్ లో చేసిన కన్మణి రాంబో కతిజ ఆశించిన ఫలితం ఇవ్వనప్పటికీ దాని వల్ల వచ్చిన ఇబ్బందేమీ లేదు.

తాజాగా తనకు చాలా క్రేజీ ఆఫర్స్ తలుపు తడుతున్నాయి. అందులో మొదటిది తమిళ స్టార్ హీరో విజయ్ తో లోకేష్ కనగరాజ్ చేయబోయే సినిమా. విక్రమ్ హిట్ లిస్ట్ తో ఇటీవలే బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ క్రియేటివ్ డైరెక్టర్ నెక్స్ట్ తలపతితో చేసేందుకు రెడీ అవుతున్నాడు. వంశీ పైడిపల్లితో చేస్తున్న తన 66వ సినిమా పూర్తి కాగానే విజయ్ ఇందులో జాయిన్ అవుతాడు. హీరోయిన్ గా సామ్ నే లాక్ చేశారట. ఈ ఇద్దరి కలయికలో గతంలో కత్తి, పోలీసోడు, అదిరింది వచ్చాయి. మొదటిది తెలుగులో ఖైదీ నెంబర్ 150గా రీమేక్ అయ్యింది. కానీ మిగిలిన రెండూ డబ్బింగ్ రూపంలో ఇక్కడా చెప్పుకోదగ్గ విజయాన్నే సాధించాయి. ఇప్పుడిది నాలుగోసారి అవుతుంది.

రణ్వీర్ సింగ్ సరసన నటించేందుకు బాలీవుడ్ ఆఫర్ ఒకటి లైన్ లో ఉందట. ఇది కూడా దాదాపు కన్ఫర్మ్ అనే అంటున్నారు. ప్రస్తుతం సామ్ చేసిన వాటిలో శాకుంతలం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.గుణశేఖర్ దర్శకుడు కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. యశోద ఫినిషింగ్ కు దగ్గరలో ఉంది. ఆగస్ట్ 12 విడుదలకు రెడీ చేస్తున్నారు. విజయ్ దేవరకొండతో మొదటిసారి జట్టు కట్టిన ఖుషి ఇంకొంత పార్ట్ మాత్రమే బ్యాలన్స్ ఉంది. మొత్తం ఈ ఆరు నెలల్లో సమంతా మూడు సినిమాలు విడుదల కాబోతున్నాయంటే విశేషమే. ఎలా చూసుకున్నా సమంతా కెరీర్ ప్లానింగ్ విషయంలో మాములుగా దూసుకెళ్లడం లేదు

Jojobet GirişMadridbetMariobetimajbetmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişgrandpashabet giriş