iDreamPost
android-app
ios-app

Samantha :పెళ్ళయాక కూడా ఆఫర్ల వెల్లువ

  • Published Mar 06, 2022 | 1:44 PM Updated Updated Mar 06, 2022 | 7:00 PM
  • Published Mar 06, 2022 | 1:44 PMUpdated Mar 06, 2022 | 7:00 PM
Samantha :పెళ్ళయాక కూడా ఆఫర్ల వెల్లువ

హీరోయిన్లకు పెళ్లయ్యాక అవకాశాలు తగ్గడం సహజం. వస్తే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానో లేదా సపోర్టింగ్ రోల్స్ లోనో తీసుకోవడం తప్ప అంతకు మించి ఆశించడానికి ఏమి ఉండదు. ఇది ఎందరి విషయంలోనో ఋజువయ్యింది కూడా. కానీ సమంతా మాత్రం దీనికి అతీతంగా సూపర్ ఇన్నింగ్స్ తో దూసుకుపోతోంది. చైతుతో విడాకులు తీసుకున్నాక తన స్పీడ్ ఇంకా పెరిగింది. తాజాగా విజయ్ దేవరకొండ సరసన శివ నిర్వాణ దర్శకత్వంలో నటించేందుకు ఆఫర్ వచ్చిందన్న వార్త సామ్ అభిమానులను ఆనందంలో ముంచెత్తుతోంది. పుష్పలో ఊ అంటావా ఊహు అంటావా పాట చేశాక తనలో గ్లామర్ ఏ మాత్రం తగ్గలేదని నిరూపించింది సామ్.

తమిళంలో విజయ్ సేతుపతి, నయనతారలతో కలిసి చేసిన సినిమా ఏప్రిల్ రెండో వారంలో విడుదలకు రెడీ అవుతోంది. తెలుగు టైటిల్ ఇంకా డిసైడ్ చేయలేదు. గుణశేఖర్ డైరెక్షన్ లో రూపొందిన శాకుంతలం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఇటీవలే ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్న యశోద శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇవి కాకుండా ఒక హాలీవుడ్ వెబ్ సిరీస్ కు ఆల్రెడీ  ఓకె చెప్పేసింది. ఫ్యామిలీ మ్యాన్ ఫేమ్ రాజ్ డికెలు తీయబోయే కొత్త సిరీస్ లోనూ సామ్ కు అవకాశం దక్కనుంది. ఈ లెక్కన చూస్తే ఈజీగా రెండు మూడేళ్ళకు సరిపడా ప్రాజెక్టులతో సమంతా చాలా బిజీగా ఉండనుంది.

ఒకప్పుడు రోజా, ఆమని, సౌందర్య నుంచి రీసెంట్ గా కాజల్ అగర్వాల్ దాకా వివాహమయ్యాక వాళ్ళ కెరీర్లను గమనిస్తే సమంతా స్పెషల్ ఏంటో అర్థమవుతుంది. పెళ్ళైతే ఆడియన్స్ దృష్టి కోణం మారడం సహజం. కానీ దానికి భిన్నంగా సామ్ కు సినిమాలు క్యూ కట్టడం ఆశ్చర్యం కలిగించే విషయమే. కొత్త జీవిత భాగస్వామి గురించి ఆలోచించడం, ఇప్పుడే అడగటం కరెక్ట్ కాదు కానీ మరికొందరు దర్శక నిర్మాతలు సమంతా కోసం స్క్రిప్ట్ లు సిద్ధం చేసిన మాట వాస్తవం. గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తున్నారు. 12 ఏళ్ళ సుదీర్ఘమైన ప్రస్థానంలో ఇలా లాంగ్ రన్ ముద్రవేసిన వాళ్ళలో నయనతార, సామ్ ల పేర్లే ముందు వరసలో ఉంటాయి.

Also Read : OTT Entertainment : రాధే శ్యామ్ టికెట్లు దొరక్కపోయినా నో టెన్షన్

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş