iDreamPost
android-app
ios-app

హౌసులో సినిమా థ్రిల్ – దివికి డేంజర్ బెల్

  • Published Oct 25, 2020 | 5:26 AM Updated Updated Oct 25, 2020 | 5:26 AM
  • Published Oct 25, 2020 | 5:26 AMUpdated Oct 25, 2020 | 5:26 AM
హౌసులో సినిమా థ్రిల్ – దివికి డేంజర్ బెల్

దసరా పండగ సందర్భంగా ఇవాళ బిగ్ బాస్ 4 కొత్త వీకెండ్ మరింత కొత్తగా ఉండబోతోంది. వైల్డ్ డాగ్ షూటింగ్ వల్ల నాగార్జున అందుబాటులో లేకపోవడంతో ఆ బాధ్యతను కోడలు సమంతా తీసుకుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో ప్రోమోలు హడావిడి చేస్తున్నాయి. యాంకర్ గా ఎలా చేసిందన్నది ఇవాళ టెలికాస్ట్ కాబోతున్న మూడు గంటల స్పెషల్ ఎపిసోడ్ లో తేలిపోతుంది. ఓ అయిదారు ఎపిసోడ్లు తనే కంటిన్యూ చేయబోతున్నట్టుగా సమాచారం. ఇరవై రోజులకు పైగా నాగ్ మనాలిలోనే ఉండాల్సి రావడంతో నిర్వాహకులు ఈ ప్లాన్ ని సిద్ధం చేసి ఉంచారు. నిన్నే తన ఎంట్రీ ఉంటుందనుకున్నారు కానీ అలా జరగలేదు. ఆదివారం పండగను దృష్టిలో ఉంచుకునే స్పెషల్ గా ప్లాన్ చేశారు.

ఇక నిన్నటి టాస్క్ విషయానికి వస్తే సభ్యులను సినిమా యూనిట్ మెంబెర్స్ గా మార్చిన బిగ్ బాస్ ఇవాళ వాళ్ళు తీసిన మూవీని ప్రీమియర్ గా ప్రదర్శించారు. దీంతో పాటు బిగ్బాస్ స్టార్ అవార్డ్స్ కూడా ఇచ్చారు. దీని కోసం పార్టిసిపెంట్స్ ప్రత్యేకంగా రెట్రో స్టైల్ లో ముస్తాబై రావడం విశేషం. రెడ్ కార్పెట్ బిల్డప్ కూడా ఉంది. యాంకర్ గా అరియానా వ్యవహరించింది. మొదట మోనాల్ వచ్చి ఇక్కడ తనకు ప్రేమలు లేవని, ఒకవేళ చెబితే మిగిలినవాళ్ళు ఫీలవుతారని తెలివిగా తప్పించుకుంది. ఇక అఖిల్ నుంచి ఏదో సమాధానం ఆశించిన అరియనాను తన నుంచి కూడా ఇలాంటి ఆన్సరే వచ్చింది. ప్రేమే ఇక్కడిదాకా తీసుకొచ్చిందని చెప్పాడు.

ఇక అసలు సినిమాకు ప్రేమ మొదలైయింది అనే టైటిల్ తో ప్రీమియర్ చేశారు. ఇదో ట్రయాంగిల్ లవ్ స్టోరీ. అఖిల్, స్రవంతి, సుబ్బలక్ష్మి, ఏడుకొండలు, మెహబూబ్ పాత్రలు ఉంటాయి. కథ చెప్పుకుంటే సుదీర్ఘంగా అవుతుంది కానీ ఫైనల్ గా కొన్ని మలుపులు తిప్పి రెండు జంటలను ఒక్కటి చేసి విలన్ ని ఫినిష్ చేసి శుభం కార్డు వేశారు. హారిక సోహైల్ లు చేసిన ఐటెం సాంగ్ స్పెషల్ బోనస్. ఇక అవార్డ్స్ ఫంక్షన్ ని లాస్య, సోహైల్ లు కలిసి ప్రకటించారు. ఉన్నదే తక్కువ సభ్యులు కాబట్టి ప్రతి ఒక్కరికి పురస్కారం దక్కింది. ఏదో టైం పాస్ అయితే చేశారు కానీ మరీ ఎగ్జైటింగ్ గా అయితే లేదు. ఇవాళ దివిని ఎలిమినేటి చేయబోతున్నారని ఇప్పటికే లీకు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదే నిజమట.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomjojobet girişjojobet güncel girişdeneme bonusu veren sitelerMariobetmadridbetMadridbetMadridbetcasibomgrandpashabet girişJojobetcasibomcasibomcasibomultrabetgrandpashabetultrabetgrandpashabet girişcasibombetciograndpashabet girişcasibom girişgrandpashabet girişgrandpashabetgrandpashabetholiganbet