iDreamPost
android-app
ios-app

తెలుగు రాష్ట్రాల్లో మైనర్లపై వేధింపులు.. ఇద్దరు క్రికెట్ కోచ్ లు సస్పెండ్

  • Published Jun 23, 2022 | 7:33 PM Updated Updated Jun 23, 2022 | 7:33 PM
తెలుగు రాష్ట్రాల్లో మైనర్లపై వేధింపులు.. ఇద్దరు క్రికెట్ కోచ్ లు సస్పెండ్

తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరు మైనర్ బాలికలపై జరిగిన లైంగిక వేధింపులు, అఘాయిత్యాలపై కేసులు నమోదయ్యాయి. తెలంగాణలోని పాతబస్తీలో చత్రినకా పీఎస్ పరిధిలోని ఉప్పగూడలో 17 ఏళ్ల మైనర్ బాలికపై ఇద్దరు యువకులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. అలి అనే యువకుడితో బాలికకు పరిచయం ఉంది. ఆ పరిచయంతోనే అతను బాలికను తన ఇంటికి పిలవగా.. స్నేహితుడే కదా అని వెళ్లింది. బాలిక ఇంటికి రాగానే.. అలి తన మిత్రుడైన ఆర్బాస్ తో కలిసి లైంగిక దాడి చేశారు. బాలిక విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పగా.. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధిత బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి అలి, ఆర్బాస్ లను అదుపులోకి తీసుకున్నారు.

ఏపీలో మరో మైనర్ ను వేధించిన ఘటనలో ఇద్దరు క్రికెట్ కోచ్ లు సస్పెండ్ అయ్యారు. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో మైనర్ బాలికపై క్రికెట్ కోచ్ లు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. ఆ ఆరోపణలపై విచారణ చేసిన కడప క్రికెట్ అసోసియేషన్.. ఇద్దరు కోచ్ లను సస్పెండ్ చేసింది. సస్పెండ్ అయిన కోచ్ ల బాధ్యతలను మహిళా క్రికెట్ కోచ్ కు అప్పగించినట్లు ప్రొద్దుటూరు క్రికెట్ యూత్ క్లబ్ నాయకులు తెలిపారు.

Jojobet GirişMadridbetMadridbetMadridbetmeritbetmeritbetzirvebetPradabet güncel girişjojobetgalabetHoliganbetJojobet Girişjojobetjojobetcasibomcasibompokerklas giriş