iDreamPost
android-app
ios-app

కేటీఆర్.. ట్విట్టర్ వాడే స్టైలే వేరు..!

కేటీఆర్.. ట్విట్టర్ వాడే స్టైలే వేరు..!

నాయకులందరూ ట్విట్టర్ తమకోసం వాడితే కేటీఆర్ మాత్రం జనం కోసం వాడుతున్నారు. కరోనా కష్టకాలంలోనూ.. అంతకు ముందు ఆపదలో ఉన్న వాళ్ళను ఆదుకోవడంలో ఆయన చూపిస్తున్న చొరవ అందరికీ తెలిసిందే. ట్విట్టర్ ద్వారా అన్నా.. అని పోస్టు చేస్తే చాలు.. తగిన భరోసా కల్పిస్తారనే నమ్మకం చాలా మందిలో ఉంది. రాజ‌కీయాల్లో తండ్రికి త‌గ్గ త‌న‌యుడుగా ఎలా గుర్తింపు ఉందో.. సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటారని అంతే గుర్తింపు ఉంది.

రోజూ వందల్లో వచ్చే ట్వీట్లలో అవసరమైన వాటికి ఆయన తప్పని సరిగా స్పందిస్తారు. ఖమ్మం జిల్లాకు చెందిన భరద్వాజ క్యాన్సర్‌తో బాధపడుతున్న తన తల్లికి 15 రోజులకోసారి హైదరాబాద్‌లో చికిత్స అందించించాలని మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్‌ ద్వారా విజ్ఞప్తి చేశాడు. దీనికి స్పందించిన కేటీఆర్‌ అతనికి వెంటనే అవసరమైన సహాయం చేయాలని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కు సూచించారు. దీనికి స్పందించిన మంత్రి తక్షణమే వారు హైదరాబాద్‌ వెళ్లేందుకు అవసరమైన అనుమతులు ఇచ్చేలా చర్యలు తీసుకున్నారు… ఆయన ట్విట్టర్ ను ప్రజల క్షేమం గురించి , వారు పడుతున్న సమస్యల గురించి తెలుసుకోవడానికి ఎక్కువగా వినియోగిస్తున్నారు. ట్విట్టర్ వేదికగా ఆయన ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కరించిన సందర్భాలు చాలానే ఉన్నాయి.

లాక్ డౌన్ సమయంలో ఐదు నెలల చిన్నారి ఆహారం లేక ఇబ్బంది పడుతుంటే.. కేవలం ఒక్క ట్వీట్ తో కేటీఆర్ స్పందించారు. వెంటనే ఆ చిన్నారి ఇంటికి ఆహారం కూడా పంపించి.. ఆకలి తీర్చారు. ఇలా.. ఒకటేమిటి ట్రాఫిక్, డ్రైనేజీ, పారిశుధ్యం, వరదలు ఏ సమస్య గురించి పోస్టు చేసినా ఆయన నెటిజన్లకు సమాధాన మిచ్చి.. వాటి పరిష్కారానికి కృషి చేయాల్సిందిగా అధికారులకు ట్యాగ్ చేస్తారు. రామంతాపూర్ కి చెందిన ఓ చిన్నారి… “అంకుల్.. మాకు నాలుగు రోజులుగా నీళ్ళు రావడం లేదు. మా నాన్న అధికారులకు చెప్పినా పట్టించు కోవడం లేదు.” అంటూ ప్లకా ర్డు పట్టుకుని కేటీఆర్ కు ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. దానికి వెంటనే స్పందించిన ఆయన వాళ్ల ఇంటికి నీటి సరఫరా పునరుద్ధరించి.. వాళ్ళతో ఫొటో దిగి.. తనకు పోస్ట్ చేయాలని ఆదేశించారు. అధికారులు ఆఘమేఘాల మీద స్పందించారు. ఇలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి. అందుకే ఆయనకు రోజు రోజుకీ ట్విట్టర్ లో అభిమానులు పెరిగిపోతున్నారు. చివరకు ఒకనాడు ఆయనను ద్వేషించిన వారు కూడా.. మేమిప్పుడు మీ అభిమానులం అని చెప్పుకునే స్థాయికి ఆయన ఎదిగారు. అందుకు ఓ నెటిజన్ చేసిన ట్వీట్ ఉదాహరణ…

ఓ నెటిజన్ కేటీఆర్ ని ఉద్దేశించిన ఓ ట్వీట్ వైరల్ గా మారింది. ఆ ట్వీట్ తో కేటీఆర్ అభిమానులు, టీఆర్ఎస్ కార్యకర్తలు ఫుల్ ఖుషీ అయ్యారు. ఇంతకీ ఆ నెటిజన్ ఏమని ట్వీట్ చేశాడంటే.. ‘‘నేను తెలంగాణకు చెందినవాడిని కాదు. తొలుత మిమ్మల్నీ, మీ నాన్నని ద్వేషించాను. ఇప్పుడు మీ పాలన చూసి అభిమానిగా మారిపోయాను. తెలంగాణకే కాదు.. దేశం మొత్తం మీ న్యాయకత్వాన్ని పొందుతుందని ఆశిస్తున్నాను’’ అంటూ ఓ నెటిజన్ కేటీఆర్ ని ఉద్దేశించి ట్వీట్ చేశాడు. కాగా… ఆ నెటిజన్ ట్వీట్ కి కేటీఆర్ స్పందించిన తీరు మరింత ఆకట్టుకుంటోంది. ‘‘మీలో వచ్చిన పరివర్తనకు అభినందనలు. మీ హృదయంలో ద్వేషం స్థానంలో అభిమానం చోటుచేసుకోవడం చాలా ఆనందంగా ఉంది.’’ అంటూ కేటీఆర్ రిప్లై ఇచ్చారు. ఇప్పుడు వీరి సంభాషణ ట్విట్టర్ లో హైలెట్ గా నిలిచింది.

తెలంగాణలో మంత్రిగా కూడా కేటీఆర్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది. తెలంగాణ ఉద్యమంలో గర్జించిన యువ సింహంలా, తెలంగాణ సాధన ప్రక్రియ పూర్తయిన తర్వాత సమర్ధవంతమైన మంత్రిగా ఆయనకు తెలంగాణ ప్రజలలో ఆదరణ పొందారు. ఆయనకు నాలుగు భాషల్లో పట్టుంది. విదేశీ సదస్సుల్లో ఆయన మాట్లాడే ఆంగ్ల భాషా సరళి, ధరించే టీషర్ట్ లు, తరుచుగా మార్చే హెయిర్ స్టయిల్, సినిమా నటులతో చేసే చిట్ చాట్ లు కేటీఆర్ కు అదనపు ఆకర్షణను తెచ్చి పెట్టాయి. అవసరం ఉంటే తప్ప స్పందించని కేటీఆర్ తత్వం తెలంగాణ ప్రజలను మంత్ర ముగ్థులను చేస్తుందనడంలో అతిశయోక్తి లేదు.- నేడు తెలంగాణ పురపాలక, ఐటీ మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా…

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomcasibomJojobetjojobetgrandpashabetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetmarsbahis giriş