iDreamPost
android-app
ios-app

దొంగల్లా తయారయ్యారు: మంత్రి పిల్లి

  • Published Oct 31, 2019 | 2:17 AM Updated Updated Oct 31, 2019 | 2:17 AM
దొంగల్లా తయారయ్యారు: మంత్రి పిల్లి

కొందరు ఏసీబీ అధికారులు దారిదోపిడీ దొంగల్లా తయారయ్యారని  ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌చంద్ర బోస్‌ మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియా తో మాట్లాడుతూ.. అవినీతిని అరికట్టే వాళ్లే లంచాల కోసం అడ్డదారులు తొక్కడం దారుణమని వాపోయారు. కొంతమంది ఏసీబీ అధికారుల పని తీరు చూస్తుంటే అసహ్యం వేస్తోందన్నారు. ఏసీబీ డీజీ, హోం మంత్రితో మధురవాడ సబ్‌ రిజిస్ట్రార్‌ ఏసీబీ కేసు వ్యవహారంపై మాట్లాడినట్టు తెలిపారు. కేసు విషయంలో విచారణే అవసరం లేదని.. పూర్తి సాక్ష్యాధారాలున్నాయని ఆయన వెల్లడించారు.

తప్పు చేసిన వారిపై ఎలాంటి కేసులు పెడతారో.. లంచాల కోసం తప్పులు చేసే ఏసీబీ అధికారులపై కూడా అటువంటి కేసులు పెట్టాలన్నారు. తప్పు చేసిన ఏసీబీ అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టి సస్పెండ్ చేయాలని తెలిపారు. లంచాలు ఇవ్వని అధికారులపై తప్పుడు కేసులు బనాయిస్తారా? ఏపీపీఎస్సీ నుంచి నేరుగా రిక్రూట్ అయిన వాళ్లు పారదర్శకంగా వ్యవహరిస్తుంటే.. తమ శాఖకు చెందిన కొందరు అధికారులు కుమ్మక్కై ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడ్డారని పేర్కొన్నారు. విశాఖ రేంజ్ స్టాంప్స్ రిజిస్ట్రేషన్ల డీఐజీని ప్రభుత్వానికి సరెండర్ చేస్తున్నామని మంత్రి వెల్లడించారు.

jojobet girişJojobet GirişJojobet GirişCasibomtaraftarium24luxbetluxbetRulobetJojobet GirişkatlaJojobet Giriş