iDreamPost
android-app
ios-app

స్నేహితుడిని మద్యానికి బానిసను చేసి.. భార్యపై అత్యాచారం ..దంపతుల ఆత్మహత్యాయత్నం

  • Published Jun 24, 2022 | 10:25 AM Updated Updated Jun 24, 2022 | 11:06 AM
స్నేహితుడిని మద్యానికి బానిసను చేసి.. భార్యపై అత్యాచారం ..దంపతుల ఆత్మహత్యాయత్నం

స్నేహానికే ద్రోహం చేశాడు. స్నేహితుడి భార్యకు మత్తు మందు ఇచ్చి పలుమార్లు అత్యాచారం చేశాడు. విషయం తెలిసిన దంపతులు తట్టుకోలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ప్రస్తుతం ఇద్దరూ చావు బ్రతుకుల మధ్య ఆస్పత్రిలో పోరాడుతున్నారు. నెల్లూరు జిల్లా లింగసముద్రం మండలంలోని ఓ గ్రామంలో జరిగిందీ ఘటన. ఆత్మహత్యాయత్నానికి ముందు బాధితురాలు తీసిన సెల్ఫీ వీడియోను పోలీసులు పరిశీలించి, నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

“నా చావుకి , నా భర్త చావుకి కారణం షేక్ ఇలియాజ్. నా భర్తను తాగుడుకి బానిసను చేసి, ఆయన ద్వారానే నాకు మత్తుమందు ఇచ్చాడు. నేను స్పృహ తప్పి పడిపోయాక పలుమార్లు అత్యాచారం చేశాడు. ఆ దృశ్యాలను తన ఫోన్ లో ఫోటోలు, వీడియోల రూపంలో బంధించాడు. పదే పదే వాటిని చూపించి నెట్ లో పెడతానని బెదిరిస్తూ.. మమ్మల్ని మానసికంగా, శారీరకంగా ఇబ్బంది పెడుతున్నాడు. అందుకే మేమిద్దరం చనిపోవాలని నిర్ణయించుకున్నాం. మేం చనిపోయాకైనా అతడికి తగిన శిక్ష పడుతుందని ఆశిస్తున్నాం.” అని బాధితురాలు ఆత్మహత్యాయత్నానికి ముందు రాసిన లేఖలో, సెల్ఫీ వీడియోలో పేర్కొంది.

తమ బాధను, నిందితుడు తమను ఎలా బ్లాక్ మెయిల్ చేశాడో సెల్ఫీవీడియోలో చెప్పిన అనంతరం దంపతులిద్దరూ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ఇరుగుపొరుగువారు గమనించి ఇద్దరినీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం కావలి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. పోలీసులు సెల్ఫీ వీడియో, సూసైడ్ లెటర్ ఆధారంగా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Jojobet GirişmeritbetmeritbetmeritkingPradabet güncel girişcasibomgalabetHoliganbetJojobet GirişjojobetjojobetjojobetcasibommeritkingMadridbetMadridbet