iDreamPost
android-app
ios-app

Laal Singh Chaddha: అమీర్ ఖాన్ కు నిద్రలేని రాత్రులు, బాయ్ కాట్ ధోరణి గురించి ఏమ‌న్నాడంటే!

  • Published Aug 10, 2022 | 3:08 PM Updated Updated Dec 22, 2023 | 6:24 PM

అద్వైత్ చందన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మీద సోష‌ల్ మీడియా రెండ‌గా చీలిపోయింది. కొంద‌రు లాల్ సింగ్ ను బాయ్ కాట్ చేయ‌మంటే, మ‌రికొంద‌రు సినిమాప‌ట్ల‌ పాజిటివ్ గా ఉన్నారు. మొత్తానికి మాస్‌లో చాలా సందడి.

అద్వైత్ చందన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మీద సోష‌ల్ మీడియా రెండ‌గా చీలిపోయింది. కొంద‌రు లాల్ సింగ్ ను బాయ్ కాట్ చేయ‌మంటే, మ‌రికొంద‌రు సినిమాప‌ట్ల‌ పాజిటివ్ గా ఉన్నారు. మొత్తానికి మాస్‌లో చాలా సందడి.

  • Published Aug 10, 2022 | 3:08 PMUpdated Dec 22, 2023 | 6:24 PM
Laal Singh Chaddha: అమీర్ ఖాన్ కు నిద్రలేని రాత్రులు, బాయ్ కాట్  ధోరణి గురించి ఏమ‌న్నాడంటే!

అమీర్ ఖాన్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ లాల్ సింగ్ చద్దా(Laal Singh Chaddha) రేపు విడుదల కానుంది. టామ్ హాంక్స్ చిత్రం ఫారెస్ట్ గంప్‌కి అధికారిక బాలీవుడ్ రిమేక్ లో కరీనా కపూర్ ఖాన్, నాగ చైతన్య నటించారు. అద్వైత్ చందన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మీద సోష‌ల్ మీడియా రెండ‌గా చీలిపోయింది. కొంద‌రు లాల్ సింగ్ ను బాయ్ కాట్ చేయ‌మంటే, మ‌రికొంద‌రు సినిమాప‌ట్ల‌ పాజిటివ్ గా ఉన్నారు. మొత్తానికి మాస్‌లో చాలా సందడి. సినిమా విడుదలకు కొద్ది గంట‌ల ముందు సోషల్ మీడియాలో #BoycottKLaalSinghChaddha ట్రెండ్ అవుతోంది. అమీర్ ఖాన్ అని టైప్ చేసినా, లాల్ సింగ్ చ‌ద్దా అని టైప్ చేసినా బాయ్ కాట్ క‌థ‌నాలు, పోస్టులే క‌నిపిస్తున్నాయి. కొన్నేళ్ల క్రితం అసహనంపై అమీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు కొంద‌రు బహిష్కరణ మంత్రం జ‌పిస్తున్నారు. నాలుగైదేళ్లుగా నిర్మాణంలో ఉన్న LaalSinghChaddha రిలీజ్ పై తాను నిద్రలేని రాత్రులు గడుపుతున్నానని అమీర్ ఖాన్ ఫీల‌య్యాడు.

ఢిల్లీ కార్యక్రమంలో, లాల్ సింగ్ చద్దా(LaalSinghChaddha )ను ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారోనని నిద్రలేని రాత్రులు గడుపుతున్నానని అమీర్ ఖాన్ ఒప్పుకున్నాడు. దేశంలోని వంద చోట్ల‌ షూటింగ్ చేసిన ఈ సినిమాపై #BoycottLaalSingh ట్రెండ్ గురించి కూడా ఆయన మాట్లాడారు. టెన్ష‌న్ తో ఉన్నాన‌ని, ప్రతిదీ సానుకూలంగా ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని చెప్పాడు. “నేను సర్వశక్తిమంతుడిని ప్రార్థిస్తున్నాను. ప్రేక్షకులపై నాకు నమ్మకం ఉంది” అని అమీర్ ఖాన్ చెప్పాడు. తనకు తెలియకుండా బాధపెట్టిన వారికీ క్షమాపణలు చెప్పాడు. “అగర్ మైనే కిసీ కా దిల్ దుఖాయా హై కిసీ చీజ్ సే తో ముఝే ఉస్ బాత్ కా దుఖ్ హై ఔర్ ముఝే మాఫ్ కర్నా” (నేను ఎవరి హృదయాన్ని అయినా దేనితోనైనా గాయపరిచి ఉంటే, అందుకు నన్ను క్షమించండి) అని ఆయన కోరాడు. సినిమా చూడకూడదనుకునే వారిని నేను గౌరవిస్తా. కానీ, ఎక్కువ మంది చూడాలని కోరుకుంటున్నాన‌ని అమీర్ ఖాన్ వ్యాఖ్యానించారు.
sleepless nights for aamir khan, what about the boy cat trend
లాల్ సింగ్ చద్దాతో అక్షయ్ కుమార్ యొక్క పెద్ద రక్షా బంధన్‌తో బాక్సీఫీస్ ద‌గ్గ‌ర పోటీప‌డుతోంది. ఈ రెండు సినిమాలూ ఆగస్ట్ 11న థియేటర్లలోకి రానున్నాయి. ఎవ‌రు బాక్సాఫీస్ విన్న‌ర్?

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet