iDreamPost
android-app
ios-app

Konijeti Rosaiah, Political Journey – రోశయ్య రాజకీయ పయనం అనన్యం, ఆదర్శం

Konijeti Rosaiah, Political Journey – రోశయ్య రాజకీయ పయనం అనన్యం, ఆదర్శం

సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం , రాజకీయాల్లో తలపండిన నేతగా గుర్తింపు, రాష్ట్రంలో దీర్ఘ కాలంపాటు ఆర్ధిక శాఖను ఒంటి చేత్తో నడిపిన నేర్పరితనం, ప్రత్యర్ధులపై చమత్కారాలతో ఇరుకున పెట్టే నైపుణ్యం, రాజకీయాల్లో ఉద్దండుడిగా గుర్తింపు ఇలా అనేక కోణాల్లో ఒక రాజకీయ నేతకు గుర్తింపు రావడం అరుదుగా చెబుతారు. సామాన్యుడిగా మొదలై అసమాన్యుడిగా రాజకీయాల్లో ఎదిగిన నాయకుడు కొణిజేటి రోశయ్య. గవర్నర్, ముఖ్యమంత్రి గా కన్నా ఆర్ధిక మంత్రిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 60 ఏళ్లకు పైగా రాజకీయ పయనం సాగించిన అరుదైన నేత 88 ఏళ్ల వయసులో ఈ రోజు అస్తమించారు.

గుంటూరు జిల్లా వేమూరులో 1933 జూలై 4న ఆదెమ్మ, సుబ్బయ్య దంపతులకు రోశయ్య జన్మించారు. 5వ తరగతి వరకు వేమూరు లో, ఆ తరువాత పక్కనే ఉన్న పేరవలిలో 8వ తరగతి వరకు… కొల్లూరులో 10వ తరగతి వరకు చదువుకున్నారు. కొల్లూరులో చదువుకునే రోజుల్లోనే నాదెండ్ల భాస్కరరావు, ఆలపాటి ధర్మారావు లాంటి వారు తనకు తోటి విధ్యార్ధులుగా ఉండటంతో వారితో స్నేహం ఏర్పడింది. ఆ తరువాత గుంటూరు పున్నారావు వైశ్య హాస్టల్ లో ఉంటూ హిందూ కళాశాలలో కామర్స్ అభ్యసించారు.

గుంటూరులోని హిందూ కాలేజిలో చదువుతున్న రోజుల్లోనే ప్రత్యేక రాష్ట్రం ఉద్యమం జరుగుతున్న సంధర్భంలో రాజకీయాల వైపు మొగ్గు చూపిన రోశయ్య విద్యార్థి నాయకుడిగా ఎదిగారు. ఆ సమయంలోనే సహచర విద్యార్థులతో కలిసి ఆంధ్రా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న కళాశాలలో పలు సభలకి వెళ్లేవారు. ఇదే సమయంలో రోశయ్య మద్రాసు వెళ్ళి నిరసన దీక్షలో ఉన్న పొట్టి శ్రీరాములను కూడా కలిసి వచ్చారు, ఈ దశలోనే రోశయ్యకు గౌతు లచ్చన్న , కందుల ఓబుల్ రెడ్డి లాంటి ప్రముఖులతో పరిచయాలు ఏర్పడ్డాయి. అదే సమయంలో ఎన్ జీ రంగా, ప్రకాశం పంతులు తో కూడా చనువు ఏర్పడింది.

Also Read : TDP, MLA Gorantla – విమర్శల్లో సీనియారిటీ ఏది బుచ్చయ్య..?

ప్రముఖ స్వాతంత్ర్య యోధుడు, కర్షక నాయకుడు ఎన్.జి.రంగా ప్రతి వేసవి కాలంలో నిర్వహించే రైతు సదస్సులకు హాజరయి అక్కడ వక్తగా రోశయ్య వ్యవహరించడంతో అనతికాలంలోనే రంగాకి శిష్యులుగా మారారు. 1959లో స్వతంత్ర పార్టీ ఆవిర్భావంలో రంగాతోపాటు రోశయ్య కూడా పాలుపంచుకున్నారు. 29 ఏళ్ళ వయస్సులోనే రోశయ్య తొలిసారి 1962 ఎన్నికల్లో తెనాలి శాసనసభకు స్వతంత్ర పార్టీ తరుపున పోటీ చేసి ఓడిపోయారు. కాంగ్రెస్ నేత ఆలపాటి వెంకటరామయ్య ఆ ఎన్నికల్లో గెలిచారు. రెండవ ప్రయత్నంలోసంబంధాలున్నికల్లో చీరాల నుండి ఇండిపెండెంట్ గా పొటీకి దిగి స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యరు. ఆ తరువాత 1968లో స్వతంత్ర పార్టీకి ఏడుగురే శాసన సభ్యులున్నా గౌతు లచ్చన్న తోడ్పాటుతో శాసన మండలి బరిలోకి దిగిన రోశయ్యకు కాంగ్రెస్ శాసన సభ్యులతో మంచి సంబంధాలు ఉండటం తో ద్వితీయ ప్రాధాన్యతా ఓటుతో రోశయ్య గెలిచారు. రోశయ్యతో పాటు కాసు వెంగళ రెడ్డి, తోటా రామస్వామి లాంటి ఉద్దండులు కూడా ఆ ఎన్నికల్లో గెలిచారు.

1971లో కాసు బ్రహ్మానంద రెడ్డి ప్రోద్బలంతో కాంగ్రెస్ లోకి వచ్చిన రోశయ్య, 1974 వచ్చేసరికి అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళ రావుకి సన్నిహితంగా మారారు, ఆ తరువాత జరిగిన శాసన మండలి ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున జలగం వెంగళ రావు ఎంత ప్రయత్నించినా రోశయ్యకు టిక్కెెెట్ ఇప్పించుకోలేకపోయారు. అయితే స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి వెంగళరావు మరికొంత మంది సభ్యుల సహకారంతో తిరిగి మండలికి ఎన్నికయ్యారు. ఆ తరువాత జలగం తో పెరిగిన సాన్నిహిత్యంతో ఆయనకు ఏపిఐఐసి చైర్మన్, పిసిసి ప్రధాన కార్యదర్శి పదవులు లభించాయి.

1978లో కాంగ్రెస్ పార్టీలో చీలిక ఏర్పడిన నేపథ్యంలో  ప్రజలందరూ ఇందిరా గాంధి వైపే మొగ్గు చూపుతున్నారని తెలిసినప్పటికి కాసు బ్రహ్మానందరెడ్డి, జలగం వెంగళరావు పైన తనకున్న గౌరవంతో కాంగ్రెస్ (ఆర్) లోనే ఉండిపోయారు. అయితే 1978లో ఇందిరా కాంగ్రెస్ తరుపున చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అవ్వగా శాసన మండలిలో రోశయ్య ప్రతిపక్షనేత పాత్ర పోషించారు. అప్పుడు రోశయ్య మండలిలో చెన్నారెడ్డిని అనేక విషయాల్లో తన వాగ్దాటితో ఇరుకున పెట్టగా , హోమ్ మంత్రి హషీం ముందుగానే రోశయ్య దగ్గరకు వచ్చి ఇబ్బంది పెట్టవద్దని కోరేవారంటే అయన విషయ పరిజ్ఞానం, వాగ్ధాటి ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు.

ఆ తరువాత చెన్నారెడ్డి రోశయ్యను తమ పార్టీ లోకి రమ్మని ఆహ్వానించగా తన రాజకీయ భవిష్యత్తు కోసం మండలిలో ప్రతిపక్షనేత గా ఉంటూనే 1979 మే లో కాంగ్రెస్ (ఐ) లో చేరిపోయారు. ఆనాటి రాజకీయాల్లో ఈ పరిణామం తీవ్ర దుమారమే రేపింది. ఈ చేరికతో రోశయ్యకు చెన్నారెడ్డి కెబినేట్ లో రహదారులు భవనాల శాఖ మంత్రిపదవి దక్కడంతో ఆయన రాజకీయ ప్రస్థానంలో అదొక కీలక పరిణామంగా నమోదైంది . ఆ తరువాత అంజయ్య కేబినెట్ లో హౌసింగ్ , రవాణా శాఖలకి మంత్రిగా వ్యవహరించారు రోశయ్య.

Also Read : Chandrababu – దివ్యాంగులను చట్టసభలకు పంపే బాధ్యత బాబుదట..! మరి ఇన్నాళ్లు ఎందుకు పంపలేదో..?

1983లో రాష్ట్రంలో తెలుగుదేశం ఆవిర్భావంతో రాజకీయ పరిణామాలు వేగంగా మారాయి. ఎన్.టి.ఆర్ ముఖ్యమంత్రి గా ఉండగా శాసన మండలి లో విపక్ష నేతగా రోశయ్య ఉండేవారు. అయితే ఎన్.టి.ఆర్ మండలి రద్దు నిర్ణయం తీసుకోవడంతో 1989 వరకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి కోశాధికారిగా, అధికార ప్రతినిధిగా, కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. 1989 ఎన్నికల్లో చీరాల నుండి శాసన సభకు పోటీ చేసిన రోశయ్య చెన్నారెడ్డి కేబినెట్ లో ఆర్ధిక , ప్రణాళిక, విద్యుత్, ఉన్నత విద్యా ,చేనేత జౌళి శాఖలకు మంత్రిగా పని చేశారు. ఆ తరువాత వచ్చిన ముఖ్యమంత్రులు నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి, కోట్ల విజయ భాస్కర్ రెడ్డి క్యాబినెట్ లో కూడా ఆర్ధిక శాఖతో పాటు వివిద శాఖలకు మంత్రిగా పనిచేశారు.

1994లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర ఓటమి పాలైంది. కేవలం 26 సీట్లకే పరిమితం అవ్వడంతో ఆ ఎన్నికల్లో చీరాల నుండి పోటీ చేసిన రోశయ్య కూడ స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. ఆ తరువాత 1995లో పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు.1998లో మధ్యంతర ఎన్నికలు రావడంతో నర్సరావు పేట పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేసిన రోశయ్య తెలుగుదేశం అభ్యర్ధి కోట సైదయ్యపై విజయం సాధించారు.

ఏడాదికే లోక్ సభ రద్దయి1999 నాటికే మళ్ళీ ఎన్నికలు రావడంతో ఈ సారి రోశయ్య తెనాలి నుండి శాసన సభకు పోటీ చేశారు. అయితే రోశయ్య లాంటి వాగ్దాటి కలిగిన ఉద్దండుడు అసెంబ్లీ లో ఉంటే తనకు కష్టం అని భావించిన చంద్రబాబు తెనాలి లోనే మకాం పెట్టి రోశయ్య ఓటమికి కృషి చేసి సఫలీకృతం అయ్యారు. స్వల్ప తేడాతో ఓటమి పాలైనా ఏమాత్రం నిరుత్సాహ పడకుండా ఫలితాలు వచ్చిన మరుసటి రోజే రోశయ్య గాంధీ భవన్ లో ప్రత్యక్షం అవ్వడం అందరినీ ఆశ్చర్య పరిచింది.

ఇక రోశయ్యకు దివంగత ముఖ్యమంత్రి వై.యస్ రాజశేఖర రెడ్డితో ఉన్న బంధం ప్రత్యేకమైనదనే చెప్పాలి. కాంగ్రెస్ లో ఎన్ని గ్రూపు తగాదాలు ఉన్నా, ఎన్ని వర్గాలు ఉన్నా ఆ ప్రభావం వైఎస్సాఆర్, రోశయ్య మధ్య ఉన్న బంధం పై పడలేదనే చెప్పాలి.వైఎస్సార్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా విజయభాస్కర్ రెడ్డి ప్రోద్బలంతో రోశయ్య ప్రధానిగా ఉన్న పివి నరసింహా రావుకు లేఖ ఇచ్చినా ఆ ఘటనను వైఎస్ పెద్దగా పట్టించుకోలేదనే చెప్పాలి. రోశయ్య స్వభావం తెలిసిన వైఎస్ ఆ ఫిర్యాదు ఎవరి ప్రోద్భలంతో చేశారో గ్రహించారు.

వైఎస్1999లో ప్రతిపక్షనేత గా ఉన్నప్పుడు శాసన సభలో చర్చించాల్సిన అనేక అంశాల పై వీరిరువురూ గంటల తరబడి చర్చించి ప్రధాన పక్షాన్ని ఇరుకున పెట్టే వారు. 2004లో వైఎస్ పాదయాత్ర అనంతరం జరిగిన ఎన్నికల్లో చీరాల నుండి పోటీ చేసి ఘన విజయం సాదించిన రోశయ్య వైఎస్ కేబినెట్ లో ఆర్ధిక మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. శాసన సభలో నెంబర్ 2గా వ్యవహరించి వైఎస్ కు అండగా నిలబడి తన వాగ్దాటితో ప్రతిపక్షానికి చమటలు పట్టించారు.

Also Read : Up – ఉత్తరప్రదేశ్‌… అస్థిరత్వం నుంచి స్థిరత్వం వైపు…

ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు అసెంబ్లీలో రోశయ్యను ఉద్దేశించి మీకు ఈ మద్య తెలివితేటలు ఎక్కువ అయ్యాయని ఎద్దేవా చేశారు. బాబు వ్యాఖ్యను ధీటుగా తిప్పికొడుతూ.. చురకలు అంటించారు. ” నాకే తెలివితేటలు ఉంటే .. చెన్నా రెడ్డిని, నేదురుమల్లి జనార్ధనరెడ్డిని, అంజయ్యను, నన్ను నమ్మిన వైఎస్ ను ఎప్పుడో ఒంటరిగా ఉన్న సమయం చూసి వెన్ను పోటు పొడిచి ముఖ్యమంత్రి కుర్చీ ఎక్కేవాడిని” అంటూ పరోక్షంగా వైస్రాయి సంఘటనను గుర్తు చేస్తూ బాబుకు చురకలు అంటించారు.

2009లో రోశయ్య తాను ఇక శాసన సభకు పోటీ చేయదలుచుకోలేదు అని చెప్పిన మరుక్షణం వైఎస్.. రోశయ్య చేత మంత్రి పదవికి శాసన సభకు రాజీనామా చేయించి మండలికి ఎంపిక చేశారు. 2009లో ఎన్నికలలో విజయం సాధించాక రోశయ్యను మళ్ళీ ఆర్ధిక మంత్రిగా కొనసాగించారు. 2009 సెప్టెంబర్ 2న వైఎస్ హెలికాఫ్టర్ ప్రమాదానికి గురై దివంగతులైన దుర్వార్తను కూడా రోశయ్యే గద్గద స్వరంతో చెప్పాల్సి వచ్చింది.

వైఎస్ మరణానతరం అధిష్టానం ఆదేశాల మేరకు అనూహ్యమైన పరిణామాలతో ముఖ్యమంత్రి అయిన రోశయ్య ఉన్నది కొద్ది రోజులైనా అనేక ఇబ్బందుల మధ్యనే ఆ పదవిలో కొనసాగారు. చివరికి అధిష్టానం ముఖమంత్రి పదవికి కిరణ్ కుమార్ రెడ్డిని ని ఎంపిక చేయడంతో 2011 ఆగష్టు 31న తమిళ నాడు గవర్నర్ గా వెళ్ళారు. 2014 లో కాంగ్రెస్ ప్రభుత్వం ఓటమి పాలై నరెంద్ర మోడి అధికారంలోకి వచ్చిన తరువాత కాంగ్రెస్ నియమించిన గవర్నర్లను అనేక చోట్ల తొలగించి వేరే వారిని నియమిస్తే తమిళనాడులో మాత్రం కాంగ్రెస్ వ్యక్తి అయిన రోశయ్యను మాత్రం తొలగంచకుండా కొనసాగించారు. వివాద రహితంగా తమిళనాడులో పేరు తెచ్చుకోబట్టే నాటి ముఖ్యమంత్రిగా ఉన్న జయలలిత మోడి సర్కార్కు రోశయ్యనే తమకు గవర్నర్ గా కొనసాగించాలని కోరినట్టు వార్తలు వచ్చాయి. రోశయ్య 2016లో తమిళనాడు గవర్నర్ గా పదవి విరమణ చేశారు.

ఐదుగురు ముఖ్యమంత్రుల దగ్గర మంత్రిగా , ఆ తరువాత ముఖ్యమంత్రిగా , గవర్నర్ గా అనేక పదవులు చేపట్టిన ఆయన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో దురందరుడిగా పేరు గడించారు . ఆర్ధిక శాఖ అంటే నాకు అత్యంత ఇష్టమైన సబ్జెక్టు అని ప్రకటించుకున్న ఆయన ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ఏకంగా 15 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన నేతగా గుర్తింపు పొందారు, ఈ క్రమంలో వరుసుగా 7 సార్లు బడ్జెట్ ప్రవేశ పెట్టిన నేతగా కూడా రికార్డు సృష్టించారు. అధికారంలో ఉన్నప్పుడు ఆ దర్పం చూపడం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దిగాలు పడటం ఎరుగని రోశయ్య పయనం ఈ తరం నేతలకు ఆదర్శం.

Also Read : Ex.CM Rosaiah Died- మాజీ ముఖ్యమంత్రి రోశయ్య కన్నుమూత..

jojobet girişJojobet GirişEnbet Girişivermectin tabletPusulabetPusulabetMadridbetmeritbetCasibom GirişmeritbetjojobetTophillbetmarsbahis girişJojobet GirişJojobet GirişcasibomHoliganbetCasibom Giriş