iDreamPost
iDreamPost
ఈ ఏడాది ధియేటర్లలో భారీ సినిమాలు వస్తాయనే ఆశలు ఎవరికీ లేవు. ఒకవేళ అక్టోబర్ నుంచి పరిస్థితి నార్మల్ అయినా నాని వి లాంటివి చాలా చిత్రాలు క్యులో ఉన్నాయి కాబట్టి వాటితోనే డిసెంబర్ దాకా గడిచిపోతుంది. ప్రస్తుతానికి 10కి పైగానే తెలుగు స్ట్రెయిట్ మూవీస్ ఫస్ట్ కాపీతో సిద్ధంగా ఉన్నాయి. వీటిలో ఏవైనా ఓటిటికి వెళ్తాయా లేదా అనే క్లారిటీ ప్రస్తుతానికి లేదు. ఇప్పుడు అందరి కన్ను 2021 సంక్రాంతి మీద ఉంది. తాము వస్తున్నామని నితిన్ రంగ్ దే, అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రకటించారు. శర్వానంద్ శ్రీకారం కూడా లైన్ లో ఉంది. వీటి తల మీద పెద్ద బాంబు వేస్తూ కేజిఎఫ్ ఛాప్టర్ 2 రేస్లోకి రావొచ్చని బెంగుళూరు టాక్.
ఆగస్ట్ 15 తర్వాత నాన్ స్టాప్ షెడ్యూల్ తో సెప్టెంబర్ చివరికంతా షూటింగ్ పూర్తి చేస్తారట. ఆ తర్వాత మూడు నెలలు పోస్ట్ ప్రొడక్షన్, పాన్ ఇండియా ప్రమోషన్ తదితర కార్యక్రమాలు చేపట్టబోతున్నారని తెలిసింది. అదే కనక జరిగితే టాలీవుడ్ బిగ్గెస్ట్ సీజన్ ని కేజిఎఫ్ పట్టేసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే దీని మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. బిజినెస్ కూడా అదే స్థాయిలో జరుగుతోంది. హక్కుల ధరలు మొదటి భాగంతో పోలిస్తే నాలుగైదింతలు పెరిగిందని ట్రేడ్ న్యూస్. ఈ లెక్కన హైప్ విషయంలో కేజిఎఫ్ అందరినీ డామినేట్ చేయడం ఖాయం. అయితే సంక్రాంతి సీజన్ ఈజీగా రెండు మూడు సినిమాలు భారీ వసూళ్లు తెచ్చుకునే అవకాశం ఇస్తుంది కాబట్టి ఖంగారు పడాల్సింది ఏమి లేదు
కానీ దీని వల్ల మిగిలిన వాళ్ళ ఓపెనింగ్స్ మీద మాత్రం ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న కేజిఎఫ్ 2లో సంజయ్ దత్, రవీనాటాండన్ లాంటి బాలీవుడ్ సీనియర్లు తోడయ్యింతర్వాత నేషనల్ వైడ్ దీని మీద ఎక్స్ పెక్టేషన్స్ విపరీతంగా పెరిగిపోయాయి. ఫస్ట్ పార్ట్ ట్రైలర్ మాత్రమేనని అసలు సినిమా ఇందులోనే చూస్తారని ప్రశాంత్ పదే పదే చెప్పడం దీనికి ఊతమిస్తోంది. ఈ లెక్కన చూస్తే అనుకున్న దాని కన్నా ఎక్కువ పోటీ సంక్రాంతి ఉండేలా కనిపిస్తోంది. అసలే ఐదు నెలలుగా థియేటర్లు మూతబడి మూవీ లవర్స్ నరక యాతన పడుతున్నారు. ఇంకో రెండు మూడు నెలలు ఈ కష్టాన్ని ఇలాగే భరిస్తే అంతా సెట్ అయిపోతుంది. ఈ పరిణామాలు గమనించడం వల్లే ఏ నిర్మాతా తమ విడుదల తేదీలు ప్రకటించే విషయంలో తొందరపడటం లేదు