iDreamPost
android-app
ios-app

KCR Press Meet – దమ్ముంటే ఇన్కమ్ టాక్స్ రైడ్ చేయించు… కేంద్రానికి కెసిఆర్ సవాల్

KCR Press Meet – దమ్ముంటే ఇన్కమ్ టాక్స్ రైడ్ చేయించు… కేంద్రానికి కెసిఆర్ సవాల్

ఈ ఏడాది జరిగిన తమిళనాడు ఎన్నికల్లో ఆ రాష్ట్ర సిఎం స్టాలిన్ కొడుకు చేసిన ఒక సవాల్ దేశ వ్యాప్తంగా సంచలనం అయింది. ఎవరో ఇళ్ళ మీద ఐటి రైడ్ చేయించడం కాదు రా బై దమ్ముంటే నా ఇంటి మీద రైడ్ చేయించు అన్నట్టు కేంద్రాన్ని టార్గెట్ గా చేసుకుని ఎన్నికల ప్రచారంలో చెలరేగిపోయారు ఉధయనిది స్టాలిన్. ఇప్పుడు అదే సవాల్ తెలంగాణా సిఎం కేసీఆర్ నుంచి వచ్చింది. దమ్ముంటే ఈడీ, ఐటి రైడ్ లు తనపై చేయించాలని ఆ రైడ్స్ చేయిస్తే భయపడే వాడు ఎవడూ లేడని సిఎం కేసీఆర్ స్పష్టం చేసారు.

నిన్న మీడియా సమావేశం సందర్భంగా బిజెపి లక్ష్యంగా సిఎం కేసీఆర్ వ్యాఖ్యలు చేయగా దానికి బండి సంజయ్ సమాధానం ఇచ్చిన నేపధ్యంలో నేడు నాలుగు గంటలకు సిఎం కేసీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఘాటుగా సమాధానం చెప్పారు. ఇన్ కం టాక్స్ , ఈడీ లతో రైడ్ లు చేయిస్తే భయపడమన్న కేసీఆర్, ఇది కేంద్ర ప్రభుత్వ స్టైల్ అన్నారు. హద్దులు మీరి మాట్లాడకు మిస్టర్ బండి సంజయ్ అంటూ వార్నింగ్ ఇచ్చారు సిఎం. నా హద్దులు నాకు తెలుసు అని అన్నారు.

దళిత ముఖ్యమంత్రి చేస్తా అని మాట ఇచ్చి చేయలేదు అన్నారు ఆయన. దానికి అనేక కారణాలు ఉన్నాయి అని పేర్కొన్నారు. ఫార్మ్ హౌస్ నా వ్యవసాయ క్షేత్రం… అది నా నియోజకవర్గంలో ఉందని అక్కడికి బజాప్త వెళ్తా అంటూ ఎన్నడు లేని విధంగా సిఎం కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేసారు. బిజెపి విషయంలో సిఎం కేసీఆర్ ఈ మధ్య కాలంలో ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఇదే. అలాగే… రాయలసీమ కు నీళ్లు రావాలని బజాప్త చెప్పిన అని… ఇప్పుడు అదే చెప్తున్నా అన్నారు సిఎం. కృష్ణ నదిలో నీళ్లు లేవు అన్నారు ఆయన.

గోదావరిలో నీళ్లు ఉన్నందున తాము సహకరిస్తామని ఆంధ్రప్రదేశ్ కి చెప్పా అని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. 20 ఏళ్ల నుండి రాష్ట్రంలో అనేకమంది కిరికిరి గాళ్లను చూస్తున్న అంటూ మాట్లాడిన కేసీఆర్ బండి సంజయ్ ఎవరో తెలంగాణా సమాజానికి తెలియదని అన్నారు. గొర్రెలకు డబ్బులు కేంద్రం ఇచ్చింది అని ప్రూవ్ చేస్తే ఇప్పుడే రాజీనామా చేస్తా అంటూ ఆయన సవాల్ చేసారు. సమాధానం చెప్పే స్థాయి , సబ్జెక్టు లెనోడు పిచ్చి కూతలు కుస్తారు అని వడ్లు వేయమని తెలంగాణ రైతులను గందరగోళంలోకి నెట్టడం సరికాదు అని హితవు పలికారు.

మేము అడిగిన దానికి సమాధానం చెప్పకుండా యాసంగి పంటలను వేయమని పిచ్చి మాటలు మాట్లాడకు అంటూ బండి సంజయ్ ని ఉద్దేశించి కేసీఆర్ వ్యాఖ్యలు చేసారు. తెలంగాణ ఉద్యమంలో నువు ఎక్కడ పన్నావ్ అంటూ తన స్టైల్ లో బండి సంజయ్ ను ప్రశ్నించారు. నీ ఉనికి తెలంగాణ సమాజానికి తెలియదన్న కేసీఆర్ నిన్న మొన్న వచ్చి మాట్లాడుతున్నావ్. రాష్ట్రంలో, దేశంలో నువు ఎవడికి తెలుసు అంటూ ఎద్దేవా చేసారు. తెలంగాణ లో ప్రభుత్వ పథకం అందని ఏ ఒక్క ఇల్లు కూడా లేదన్నారు ఆయన.

Jojobet GirişmeritbetholiganbetMeritbetcasibomJojobet GirişjojobetjojobetjojobetjojobetjojobetMadridbetMadridbetcasibom girişjojobet girişCasibom Girişmeritkinggalabetjojobetholiganbet girişholiganbet girişMarsbahis GüncelHoliganbet GirişHoliganbet Güncel GirişMarsbahis GirişMarsbahis Güncel Giriş