iDreamPost
android-app
ios-app

రాజీవ్‌ ఫౌండేషన్‌కి ‘ప్రధాని’ నిధులు: గాంధీ కుటుంబం పై జెపి నడ్డా ఆరోపణలు, కొట్టిపారేసిన కాంగ్రెస్

రాజీవ్‌ ఫౌండేషన్‌కి ‘ప్రధాని’ నిధులు: గాంధీ కుటుంబం పై జెపి నడ్డా ఆరోపణలు, కొట్టిపారేసిన కాంగ్రెస్

 బిజెపి, కాంగ్రెస్‌ మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. యుపిఎ హయాంలో గాంధీ కుటుంబానికి చెందిన రాజీవ్‌ గాంధీ ఫౌండేషన్‌కు ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (పిఎంఎన్‌ఆర్‌ఎఫ్‌) నుంచి భారీగా నిధులు అందాయని బిజెపి ఆరోపించింది. ప్రధాని సహాయ నిధికి వచ్చి డబ్బుని రాజీవ్‌ ఫౌండేషన్‌కు మళ్లించ డం దేశ ప్రజల్ని దారుణంగా మోసం చేయడమేనని బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రధాని సహాయ నిధి నుంచి నిధుల మళ్లింపునకు సంబంధించి డాక్యుమెంట్లను కూడా ఆయన బయటపెట్టారు.

‘‘కష్టాల్లో ఉన్న ప్రజల్ని ఆదుకోవడానికి ఏర్పాటు చేసిన ప్రధాని సహాయ నిధికి వచ్చిన నిధుల్ని యుపిఎ హయాంలో రాజీవ్‌  ఫౌండేషన్‌కు మళ్లించారు. పిఎంఎన్‌ఆర్‌ఎఫ్‌ బోర్డు సమావేశాల్లో అప్పట్లో సోనియాయే కూర్చొనేవారు. ఆర్‌జిఎఫ్‌కి ఆమే చైర్‌ పర్సన్‌. ఇలాంటి అనైతిక చర్యలకు పాల్పడినందుకు సోనియా బాధ్యత వహించాలి’’అని నడ్డా ట్వీట్‌ చేశారు. ప్రజల నుంచి వచ్చిన సొమ్ముల్ని ఒక కుటుంబానికి ధారపోయడం అంటే దేశ ప్రజల్ని పచ్చి దగా దేయడమేనని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. కాగా నడ్డా ఆరోపణల్ని కాంగ్రెస్‌ పార్టీ తిప్పి కొట్టింది.

Jojobet GirişMadridbetMariobetcasibommatbet girişgrandpashabetcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabet destekgrandpashabet girişGrandpashabetCasibomCasibomCasibomjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetholiganbetjojobetjojobet girişjojobetjojobet giriş