iDreamPost
android-app
ios-app

పవన్ కి ఇప్పుడు మత్స్యకారులు గుర్తుకొచ్చారా..?

  • Published Feb 14, 2022 | 12:47 PM Updated Updated Feb 14, 2022 | 12:47 PM
పవన్ కి ఇప్పుడు మత్స్యకారులు గుర్తుకొచ్చారా..?

పవన్ కళ్యాణ్ అంతే. తన సినిమా పనుల్లో  ఉండి అప్పుడప్పుడూ ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తారు. ఆరోజుకి తనకు గుర్తుకొచ్చిన సమస్యను ప్రస్తావిస్తారు. ఆ తర్వాత మళ్లీ మరచిపోతారు. కొన్నిసార్లు సమస్య లేకపోయినా హడావిడి చేయాలని చూస్తుంటారు. తన ఉనికి చాటుకోవడమే లక్ష్యంగా ఏదోటి చేస్తుంటారు. అందులో తాజాగా మత్స్యకారులు ఆయనకు గుర్తుకొచ్చినట్టున్నారు. మత్స్యకారుల సమస్య మీద నరసాపురం వేదికగా కార్యక్రమానికి సిద్ధమవుతున్నట్టు జనసేన ప్రకటించింది. త్వరలో నరసాపురం పార్లమెంట్ స్థానానికి ఉప ఎన్నికలు జరుగుతాయనే అంచనాల నేపథ్యంలో పవన్ సభ ఆసక్తిగా మారింది. రాజకీయ ప్రయోజనాలు ఆశించి చేస్తున్న కార్యక్రమానికి మత్స్యకారులను ఉపయోగించుకోవాలని చూడడం ఆసక్తిగా మారింది.

ఆంధ్రప్రదేశ్ లో మత్స్యకారులకు ప్రభుత్వం భరోసాగా నిలుస్తోంది వ‌రుసగా మూడేళ్లుగా మ‌త్స్య‌కార భ‌రోసా కింద ఒక్కో ల‌బ్ధిదారుడికి రూ. 30 వేల చొప్పున నగదు బదిలీ చేసింది. దాని కోసం రూ. 332 కోట్లు వెచ్చించింది. మొత్తం 1,19,975 కుటుంబాలు ల‌బ్ధి పొందుతున్నాయి. అంతేగాకుండా వేట నిషేధ స‌మ‌యంలో మ‌త్స్య‌కారుల‌కు ఇచ్చే భృతిని రూ. 4 వేల నుంచి రూ. 10 వేలకు పెంపుదల చేయడం ద్వారా ఆ కుటుంబాలకు జగన్ ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. మత్స్యకారుల జీవితాలకు ప్రభుత్వం అండగా ఉందనే విశ్వాసం కల్పించారు. ఇక వేటకు వెళ్లే బోట్లకు వినియోగించే డీజిల్‌పై స‌బ్సిడీని రూ. 6 నుంచి రూ. 9కి ప్రభుత్వం పెంచింది.. వేట‌కు వెళ్లి ప్ర‌మాదవ‌శాత్తు మ‌ర‌ణించే మ‌త్స్య‌కారుల కుటుంబాల‌కు ఇచ్చే భీమాను రూ. 5 ల‌క్ష‌ల నుంచి రూ. 10 ల‌క్ష‌ల‌కు పెంచింది. తద్వారా మత్స్యకారులకు మేలు చేసే దిశలో ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను చొరవగా అమలు చేస్తోంది.

అదే సమయంలో అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి అడుగులు వేసింది రెండు ద‌శ‌ల్లో రూ. 3,623 కోట్ల‌తో 9 ఫిషింగ్ హార్బ‌ర్ల నిర్మాణం చేప‌ట్టింది. మొద‌టి ద‌శ పనులు పూర్తికావొచ్చాయి. త్వరలోనే పలు చోట్ల ఫిషింగ్ హార్బర్లు అందుబాటులోకి తీసుకురావడం ద్వారా మత్స్యకారుల అభివృద్ధికి బీజం పడుతోంది. వాస్తవానికి విశాఖ తర్వాత ఒడిశాలోని పారాదీప్ వరకూ మత్స్యకారులకు జెట్టీలు, హార్బర్లు అందుబాటులో లేవు. దాంతో అనేక మంది గుజరాత్ సహా వివిధ ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. వాటిని అరికట్టేందుకు జగన్ ప్రభుత్వం జెట్టీల నిర్మాణానికి పూనుకుంది. హార్బర్లను సిద్ధం చేస్తోంది. తద్వారా బంగాళాఖాతం తీరం వెంబడి ఉన్న మత్స్యకారుల ఉపాధి అవకాశాలు పెంచే ప్రయత్నంలో నిమగ్నమయ్యింది. 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి గురించి ఆందోళన చెందకుండా మత్స్యకారులకు మరిన్ని సదుపాయాలు అమలు చేసేందుకు పూనుకుంది. ఇది విపక్షాలకు రుచించడం లేదు. చాలాకాలంగా మత్స్యకారులు టీడీపీ వైపు మొగ్గుచూపుతూ వచ్చారు. కానీ చంద్రబాబు మాత్రం మత్స్యకారుల విషయంలో అత్యంత నిర్లక్ష్యం చాటారు. జగన్ దానిని సరిదిద్ది మత్స్యకారుల అభివృద్ధి. సంక్షేమం కోసం పలు చర్యలు చేపట్టడం ఆయా వర్గాలను ఆకర్షిస్తోంది. విపక్షాలకు కంటగింపుగా మారుతోంది. 2012 నాటి నష్టపరిహారం చెల్లింపులో మత్స్యకారులకు చంద్రబాబు అన్యాయం చేస్తే జీవనోపాధి కోల్పోయిన 14,927 మంది మత్స్యకారులకు ఒక్కొక్క కుటుంబానికి రూ.47,250 చొప్పున మొత్తం రూ.75 కోట్ల నష్టపరిహారం జగన్ ప్రభుత్వం చెల్లించింది. జీఎస్పీఎల్ వాటాతో సంబంధం లేకుండా ప్రభుత్వమే చొరవ తీసుకుని వారిని ఆదుకుంది. తద్వారా మత్స్యకారుల పట్ల జగన్ చిత్తశుద్ధిని చాటుకున్నారు. అయినా పవన్ కళ్యాణ్‌ మాత్రం నెల్లూరులో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న విధానంపై పశ్చిమగోదావరి నరసాపురం కేంద్రంగా నిరసన సభకు పూనుకోవడం అతని నైజాన్ని చాటుతోంది. మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం చేపడుతున్న పథకాలను సహించలేనితత్వం బోధపడుతోంది.

Also Read : మత్స్యకారులకు మేలు చేస్తున్నదెవరు.. మాయ చేసిందెవరు?

Jojobet GirişmeritbetmeritbetholiganbetTophillbet girişcasibomJojobet GirişjojobetjojobetjojobetcasibomholiganbetMadridbetMadridbetJojobet GirişjojobetHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren siteler