iDreamPost
android-app
ios-app

ముఖ్యమంత్రి జగన్ ని కలవనున్న తెలుగుదేశం ఎమ్మెల్సీ పోతుల సునీత ?

  • Published Jan 22, 2020 | 10:10 AM Updated Updated Jan 22, 2020 | 10:10 AM
ముఖ్యమంత్రి జగన్ ని కలవనున్న తెలుగుదేశం ఎమ్మెల్సీ పోతుల సునీత ?

పరిటాల కుటుంబానికి అత్యంత విశ్వాసపాత్రులుగా , తెలుగుదేశానికి బలమైన మద్దతుదారులగా ఉన్న పోతుల సురేష్ కుటుంబం టీడీపీకి షాక్ ఇవ్వబోతోంది. సురేష్ భార్య టీడీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత ముఖ్యమంత్రి జగన్ ను కలవనున్నారనే వార్త రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది. శాసన మండలిలో తెలుగుదేశం ప్రవేశ పెట్టిన రూల్ 71 కి విప్ ధిక్కరించి వ్యతిరేకంగా ఓటు వేసి సొంత పార్టీకే షాక్ ఇచ్చిన పోతుల సునీత , తాజాగా ముఖ్యమంత్రిని కలవబోతున్నారనే వార్తతో ఇక తెలుగుదేశానికి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.

అయితే తెలుగుదేశం మాత్రం విప్ ధిక్కరించినందుకు పోతుల సునీత పై అనర్హత పిటీషన్ ఇచ్చేందుకు టి.డి.ఎల్.పి సిద్దమైనట్టు తెలుస్తుంది. ఒక పక్క పొతుల సునీత కూడా తెలుగుదేశం పార్టీని వీడాలని మానసికంగ సిద్దమయ్యారని, ఇదే విషయమై ఇంతకుమునుపే కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకునట్టు చెబుతున్నారు. ఏది ఏమైన ఎంతో కాలం నుండి పరిటాల కుటుంబానికి విధేయులుగా ఉంటూ వచ్చిన పోతుల సురేష్ కుటుంబం ఇప్పుడు హఠాత్తుగా పార్టీ మారుతున్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో సంచలనం గా మారింది.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetTimebetMeritkingGrandpashabetcasibommadridbet girişgrandpashabetjojobet girişdeneme bonusu veren sitelerMariobetMadridbetmadridbetmariobetjojobetgrandpashabet girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabetcasibomGrandpashabet Giriş