iDreamPost
android-app
ios-app

మద్యం మీద మాట్లాడడానికి మరెవరూ దొరకలేదా ??

మద్యం మీద మాట్లాడడానికి మరెవరూ దొరకలేదా ??

అసెంబ్లీలో 23 మంది తెలుగుదేశం శాసనసభ్యులు ఉంటే పార్టీలో ఒక్కగాను ఒక్క మహిళా శాసనసభ్యురాలు ఆదిరెడ్డి భవాని గారి చేత బార్లు.. బ్రాండ్లు..అంటూ మహిళలకి అందులోను అనుభవంలేని మొదటి సారి అసెంబ్లీలో అడుగుపెట్టిన యువ శాసన సభ్యురాలి చేత మాట్లాడించడం ఏమైనా బాగుందా బాబుగారు? పాపం ఆమెకి ఏమి తెలుసు ఆమె ఏమైనా రాత్రి 8 తరువాత పెద్దగా బయటకి వచ్చేదా?? మద్యం దుకాణాల దగ్గర బార్ షాప్ ల దగ్గర పరిస్థితులు ఎలా ఉంటాయో చూసేదా ??

మీరేమో ఈమధ్య ఎక్కడకి వెళ్లినా ఏంటండీ ఈ అన్యాయం బార్లని రద్దు చెయ్యడం ఏంటండీ? పర్మిట్ రూం లని రద్దు చెయ్యడం ఏంటండీ ?? మద్యం రేట్లు ఇష్టాను రీతిగా అలా పెంచడం ఏంటడీ?? ఇలా అయితే రోజు తాగేవాడు ఏమైపోవాలి అని మీడియా సాక్షిగా బహిరంగంగా తాగుబోతులకి వత్తాసు పలకడం చూసి జనం ముక్కున వేలేసుకుంటున్నారు. కొందరైతే ఇప్పటికే ఆయన్ని నారా చంద్రబాబు నాయుడు.. కాదు సారా చంద్రబాబు నాయుడు అని మీమీద జోకులు వేసుకుంటున్నారు

ఒకపక్క వెలగపూడి రామకృష్ణ బాబు లాంటి పేరు మోసిన నాటు సారా మద్యం కాంట్రాక్టర్లని, టికెట్ ఇచ్చి గెలిపించుకొని అసెంబ్లీలో ఆయన ప్రక్కనే కుర్చోపెట్టుకుంటారు. ఆయన బావమరిది గారు హిందూపూర్ శాసనసభ్యులు బాలకృష్ణ గారి పేరు చెబితే మొదట జనానికి కొన్నిమద్యం బ్రాండ్లే గుర్తొస్తున్నాయి. ఆయనేమో శాసన సభ్యుడిని అని కూడా లేకుండా “మామా ఏక్ పెగ్గు లా..” అని స్టెప్పులు వేస్తున్నాడు.పోనీ లోకేష్ బాబు ఏమన్నా తక్కువా ?? ఆయన మీద చాలా ఫోటోలు ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతున్నాయి. సాక్షాత్తూ బాబుగారి ప్రభుత్వంలో మాజీ మంత్రి జవహర్ గారు బీర్ ని హెల్త్ డ్రింక్ అంటారు.

బాబుగారి హయాంలో రాష్ట్రంలో ఏ గ్రామాన్ని వదలకుండా కార్యకర్తల చేత.. మీ జన్మభూమి కమిటీ సభ్యుల చేత వీధికో దుకాణం, ఊరికో బారు, బజారుకో బెల్ట్ షాప్ తెరిపించి, వారి పార్టీ శాసనసభ్యుల చేత భారీ ఎత్తున మద్యం కాంట్రాక్టులు పాడించి ఎమ్మార్పీ ధరలకి అమ్మాల్సిన మద్యానికి, ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచడమే కాకుండా వారి పార్టీ శాసనసభ్యుల చేత మద్యం దుకాణాల ద్వారా అక్రమ సొమ్మును వసూలు చేయించి అక్రమంగా సంపాదించిన వందల కోట్ల రూపాయలను ఎన్నికలల్లో ఓట్లు కొనడానికి కుమ్మరించి, రాష్ట్రాన్నిమధ్యాంధ్ర ప్రదేశ్ గా మార్చినా, ఇప్పుడు ఇలా ఒక ఆడకూతురి ద్వారా భ్రాండ్లు రేట్లు అంటూ ఇలాంటి ప్రశ్నలు అడిగిస్తారా ?.

పాపం ఒక సాధారణ గృహిణిగా , ఇంటి నుండి బయటకి వచ్చి మొదటిసారి అసెంబ్లీ లో అడుగుపెట్టిన ఆమెకి దీనిమీద అంత అవగాహన ఉంటుందని ఎవరైనా ఎలా అనుకుంటారు ? ఇలాంటి ప్రశ్నలడిగించడానికి ఆమె సొంత చిన్నాన బాబుగారి కుడి భుజం అచ్చెం నాయుడు ఉన్నాడు కదా? ఇదేనా ఆయన ఎప్పుడూ చెప్పుకొనే నలభై ఏళ్ల అనుభవం ? ఇంకా నయం రాష్ట్రంలోనే పేరుమోసిన మద్యం కాంట్రాక్టర్ అయిన తోటి శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణ బాబు చేత ఈ ప్రభుత్వం మీద దాడి చేయించలేదు..అందుకు సంతోషం..

Jojobet GirişjojobetcasibomjojobetcasibomcasibomStarzbetMadridbetbetciomatbet girişjojobetgrandpashabetgrandpashabet belge numarasıgrandpashabet belge numarasıJojobet GirişGrandpashabet destekgrandpashabet girişJojobetcasibom girişPoliwinGrandpashabetGrandpashabetcasibomjojobetcasibomCasibom Güncel Giriş