iDreamPost
android-app
ios-app

వరసగా ఐదు కాన్పుల్లోనూ కవలలే, నా వల్ల కాదంటూ ఇల్లు వ‌దిలిపోయిన తండ్రి

  • Published Jul 23, 2022 | 7:34 PM Updated Updated Jul 23, 2022 | 7:34 PM
వరసగా ఐదు కాన్పుల్లోనూ కవలలే, నా వల్ల కాదంటూ ఇల్లు వ‌దిలిపోయిన తండ్రి

భార్య తల్లి కాబోతోందంటే ఆ భర్త ఆనందం మాటల్లో చెప్పలేనిది. అదే కవలలు పుడితే ఆ ఆనందం రెట్టింపు. కానీ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు కాన్పుల్లోనూ కవలలే పుడితే? ఆ తండ్రికి సంతోషం కలగలేదు. పైగా అనుమానం పుట్టింది. ఇదేదో తేడా వ్యవహారంలా ఉందంటూ భార్యను, పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయాడు. ఉగాండాలో జరిగిందీ వింత ఘటన.

ఉగాండాకు చెందిన నాలోంగో గ్లోరియా వరసగా ఐదు కాన్పుల్లో కవలలను ప్రసవించింది. అంటే మొత్తం 10 మంది పిల్లలకు జన్మనిచ్చింది. ఐదో కాన్పులో కూడా కవలలే పుడతారని తెలిసినప్పుడు, నాలోంగో భర్త కోపం కట్టలు తెంచుకుంది. భార్యను పుట్టింటికి వెళ్ళిపొమ్మన్నాడు. కానీ ఆమె చాలా కాలం క్రితమే వేరే ఊరు వచ్చేయడం వల్ల, పుట్టింటితో సంబంధాలు తెగిపోయాయి. అయినా గ‌ర్భ‌వ‌తి ఎక్క‌డికి వెళ్ల‌గ‌ల‌దు? చివరికి భర్తే ఆమెను, పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయాడు. పది మంది పిల్లల్లో ఒకరు చనిపోగా ఒకరిద్దరు పెద్ద పిల్లలు ఇల్లు ఎటో వెళ్ళిపోయారు. ఇప్పుడు నాలోంగో తినడానికి సరైన తిండైనా లేని పరిస్థితుల్లో, తన పిల్లలతో బిక్కుబిక్కుమంటూ బతుకీడుస్తోంది.

దీనికి తోడు ఆమెను, ఆమె”లగేజ్” ని భరించడం తన వల్ల కాదని, వేరే ఇల్లు చూసుకోమని ఇంటి ఓనర్ ఒత్తిడి తెస్తున్నాడు. అయినా ఆ తల్లి తన పిల్లల్ని వదిలి పెట్టేది లేదని గ‌ట్టిగా చెబుతోంది. అంతా ఆ పైవాడే చూసుకుంటాడని గట్టిగా నమ్ముతోంది. తల్లి ప్రేమ అంటే ఇదేనేమో!

Jojobet GirişmeritbetmeritbetholiganbetHoliganbet girişcasibomJojobet GirişcasibomjojobetjojobetcasibomholiganbetMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren sitelerCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişdirect to wallet crypto swap