iDreamPost
android-app
ios-app

దెయ్యాల గురించి అడిగితే.. చావును దగ్గర్నుంచీ చూశానన్న కియారా అద్వానీ

  • Published Jun 07, 2022 | 11:16 AM Updated Updated Jun 07, 2022 | 11:17 AM
దెయ్యాల గురించి అడిగితే.. చావును దగ్గర్నుంచీ చూశానన్న కియారా అద్వానీ

భూల్ భులయ్యా సినిమాకు సీక్వెల్ గా వచ్చిన భూల్ భులయ్యా 2 సినిమాలో యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్, కియారా అద్వానీ, టబు నటించారు. ఈ సినిమా హిట్టవ్వడంతో కియారా సూపర్ హ్యాపీగా ఉంది. తాజాగా కియారా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించింది. దెయ్యాలంటే భయమా అని అడగ్గా.. దెయ్యాలంటే భయం లేదు కానీ.. దెయ్యం సినిమాలు చూడనని పేర్కొంది.

ఎందుకంటే.. రాత్రిపూట ఒక్కదాన్నే పడుకున్నపుడు భయపడతాను. అందుకే దెయ్యాల సినిమాలు చూడనని చెప్పింది. కాలేజీ రోజుల్లో తను ఫేస్ చేసిన మరో విషయం గురించి కూడా తెలిపింది. కాలేజీ రోజుల్లో స్నేహితులతో కలిసి ధర్మశాల టూర్ కి వెళ్లగా.. అక్కడ మంచు ఎక్కువగా కురవడంతో నాలుగురోజులపాటు హోటల్ గదిలోనే ఉండాల్సి వచ్చిందని తెలిపింది.

“ఆ సమయంలో కరెంట్ కూడా లేదు. తాగేందుకు మంచినీళ్లు లేవు. వేడి కోసం వేసిన మంట కూడా ఆరిపోతోంది. నాలుగోరోజు రాత్రి గదిలో అందరం నిద్రపోతున్నప్పుడు మా పక్కనే ఉన్న కుర్చీకి అనుకోకుండా నిప్పు అంటుకుని మంటలు వ్యాపించాయి. అది చూసిన నా ఫ్రెండ్​ మా అందర్నీ నిద్రలేపింది. మేమంతా కేకలు వేయడంతో చుట్టుపక్కవాళ్లు వచ్చి తలుపులు పగలగొట్టారు. ఆరోజు చావుని దగ్గర నుంచి చూసినట్లనిపించింది. అదృష్టం కొద్దీ అక్కడి నుంచి బయటపడ్డాం.” అని కియారా పేర్కొంది. అలా ఆ రోజున చావుని చాలా దగ్గరగా చూశానని చెప్పుకొచ్చింది.

 

Jojobet GirişmeritbetmeritbetholiganbetTophillbet girişcasibomJojobet GirişjojobetjojobetjojobetcasibomholiganbetMadridbetMadridbetJojobet GirişjojobetHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren siteler