iDreamPost
android-app
ios-app

శిల్పాశెట్టి కారవాన్ చూశారా?? స్టార్ హోటల్ రూమ్‌కి ఏ మాత్రం తీసిపోదు..

  • Published Jun 09, 2022 | 7:45 AM Updated Updated Jun 09, 2022 | 8:07 AM
శిల్పాశెట్టి కారవాన్ చూశారా?? స్టార్ హోటల్ రూమ్‌కి ఏ మాత్రం తీసిపోదు..

బాలీవుడ్ భామ, యోగా సుందరి శిల్పా శెట్టి 47 ఏళ్ళ వయసులో కూడా తన యోగా తో మంచి ఫిట్నెస్ మైంటైన్ చేస్తూ కుర్ర హీరోయిన్స్ కి ఏ మాత్రం తీసిపోకుండా మెరిసిపోతుంది. సాధారణంగా పెద్ద పెద్ద ఆర్టిస్టులు, స్టార్ సెలబ్రిటీలు బయట షూటింగ్ ఉంటె ఎక్కువగా కారవాన్ వాడతారు. అన్ని సౌకర్యాలతో కూడిన ఓ లగ్జరీ బస్సు లో ఉంటారు. కొంతమంది స్టార్లు వీటిని సొంతంగా కలిగి ఉంటారు. ఇప్పుడు ఉన్న చాలా మంది స్టార్ హీరోలు, హీరోయిన్స్ కి సొంత కార్వాన్స్ ఉన్నాయి. మన తెలుగులో మహేష్ బాబు, అల్లు అర్జున్ లాంటి స్టార్స్ కి ఖరీదైన సొంత కారవాన్స్ ఉన్నాయి.

తాజాగా ఈ బాలీవుడ్ భామ శిల్పా శెట్టి కొత్త కారవాన్ ని కొనుక్కుంది. అత్యంత లగ్జరీ సౌకర్యాలతో, ఖరీదైన కారవాం ని కొనుక్కుంది. బ్లాక్‌ కలర్‌లో ఉన్న ఈ వ్యాన్‌లో అన్ని సదుపాయాలు ఉండేలా చూసుకుంది. కిచెన్‌, వాష్‌ రూమ్‌, యోగా డెక్‌, మేకప్, బెడ్, బస్ పైన ఒక డెక్, పైకి ఎక్కడానికి మెట్లు, పైన యోగా సెటప్ కూడా ఉండటం ఆశ్చర్యం.. ఇలా అన్ని వసతులతో ఏకంగా ఓ స్టార్ హోటల్ రూమ్ ని తలపించే విధంగా చూసుకొని కొనుక్కుంది శిల్పాశెట్టి. దీని ధర దాదాపు కోటి రూపాయల పైనే ఉండొచ్చని సమాచారం. శిల్పాశెట్టి కొత్త కారవాన్ చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు.

jojobet girişmarsbahiscasibomJojobet GirişcasibomJojobet GirişMeritkingcasibom girişholiganbetvaycasinomarsbahis girişJojobetiptv satın alMadridbetHoliganbet Giriş