iDreamPost
android-app
ios-app

బీజేపీకి బిగ్‌ షాక్‌: బాబుల్‌ సుప్రియో రీఎంట్రీ

  • Published Sep 18, 2021 | 10:28 AM Updated Updated Sep 18, 2021 | 10:28 AM
  • Published Sep 18, 2021 | 10:28 AMUpdated Sep 18, 2021 | 10:28 AM
బీజేపీకి బిగ్‌ షాక్‌: బాబుల్‌ సుప్రియో రీఎంట్రీ

భారతీయ జనతా పార్టీకి ఇది నిరాశ కలిగించే వార్త. కేంద్రం మాజీ మంత్రి, బీజేపీ మాజీ నేత బాబుల్‌ సుప్రియో మళ్లీ రాజకీయరంగ ప్రవేశం చేశారు. తృణముల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ)పార్టీలో ఆయన చేశారు. టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్‌ బెనర్జీ సమక్షంలో సుప్రియో టీఎంసీలో చేరారు. ఈ విషయాన్ని టీఎంసీ తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా తెలిపింది.

మోదీ తొలి, మలి కేబినెట్‌లో మంత్రిగా పని చేసిన బాబుల్‌ సుప్రియో.. బెంగాల్‌ శాసన సభలో ఎన్నికల్లో ఓటమి తర్వాత మంత్రి పదవిని కోల్పోయారు. జూలై నెలాఖరులో జరిగిన మంత్రివర్గ విస్తరణలో ఆయనపై బీజేపీ వేటు వేసింది. మంత్రి పదవి నుంచి తప్పించడంతో తీవ్ర అసంతృప్తికి గురైన బాబుల్‌ సుప్రియో.. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు వెంటనే ప్రకటించారు. ఆ మరుసటి రోజే.. బీజేపీతోపాటు ఎంపీ పదవికి రాజీనామా చేశారు. దాదాపు నెలన్నర తర్వాత ఆయన టీఎంసీలో చేరారు. బీజేపీకి, ఎంపీ పదవికి గుడ్‌బై చెప్పిన తర్వాత.. ఆయన టీఎంసీలో చేరతారని జరిగిన ప్రచారం తాజాగా వాస్తవరూపం దాల్చింది.

Also Read : మ‌మ‌త నామినేషన్‌ను ఎన్నికల కమిషన్ తిరస్కరిస్తుందట‌..!

పశ్చిమ బెంగాల్‌కు చెందిన సుప్రియా బరాల్ అలియాస్ బాబుల్ సుప్రియో.. ప్రముఖ సింగర్. ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్‌లో పని చేశారు. పలు హిందీ పాటలు పాడారు. స్టేజ్ షోలు ఇచ్చారు. 2014 మార్చిలో బీజేపీలో చేరారు. ఆ వెంటనే పార్టీ టికెట్ దక్కించుకున్నారు. అసన్సోల్ నుంచి పోటీ చేసి లోక్‌సభకు ఎన్నికయ్యారు. మొదటి సారి ఎంపీ అయిన సుప్రియో.. ప్రధాని నరేంద్ర మోడీ తొలి కేబినెట్‌లో బెర్త్ దక్కించుకున్నారు. పలు శాఖల సహాయ మంత్రిగా పని చేశారు. 2019 ఎన్నికల్లోనూ గెలిచి.. మళ్లీ కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

ఇటీవల బెంగాల్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బాబుల్ సుప్రియో పోటీ చేశారు. టాలీగంజ్‌లో పోటీ చేసి టీఎంసీ అభ్యర్థి చేతిలో 50 వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు. అటు బెంగాల్‌లో పార్టీ ఓటమి, ఇటు పార్టీ స్టేట్ చీఫ్‌తో విభేదాలు, మంత్రిగా పని తీరు.. ఇలా అన్నీ ప్రతికూలంగా మారడంతో వేటు పడింది. మంత్రి పదవి నుంచి తప్పించడంపై ఆయన బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. తన విషయంలో పొగబెట్టారంటూ సోషల్ మీడియాలో అక్కసు వెల్లగక్కారు. రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. తాను ఏ పార్టీలోనూ చేరడంలేదని, చేరమని కూడా తనను ఎవరూ సంప్రదించలేదని స్పష్టం చేశారు. సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చానని.. సేవ చేయాలంటే రాజకీయాల్లోనే ఉండాలన్న రూల్ ఏమీ లేదని, వేరే రంగంలో ఉన్నా సేవ చేయొచ్చని అప్పుడు పేర్కొన్న బాబుల్ తాజాగా టీఎంసీ ద్వారా రీ ఎంట్రీ ఇచ్చారు.

Also Read : కెప్టెన్ అమరీందర్ సింగ్ పదవికి ఎసరు?

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetlunabetMadridbetJojobetMadridbetMadridbetjojobetJojobetbetosferjojobetjojobetcasibomcasibomcasibomcasibomcasibom girişholiganbetjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibom