iDreamPost
android-app
ios-app

ఒకటి రెండు కాదు ఏకంగా 5 సినిమాలు

  • Published Jul 05, 2021 | 10:43 AM Updated Updated Jul 05, 2021 | 10:43 AM
ఒకటి రెండు కాదు ఏకంగా 5 సినిమాలు

నందమూరి హరికృష్ణ వారసుడిగా ఇండస్ట్రీకి వచ్చిన కళ్యాణ్ రామ్ కు ఇప్పటిదాకా ప్రత్యేకంగా ఇండస్ట్రీ హిట్ అంటూ లేకపోయినా సరైన కథ పడాలే కానీ తాను చక్కగా మెప్పిస్తానని అతనొక్కడే, పటాస్ లాంటి సక్సెస్ ఫుల్ మూవీస్ ద్వారా గతంలోనే ఋజువు చేశాడు. బ్యాడ్ లక్ ఏంటంటే ఒక సినిమా విజయవంతమైతే ఆ వెంటనే హ్యాట్రిక్ ఫ్లాపులు క్యూ కడుతున్నాయి. గత ఏడాది సంక్రాంతికి మహేష్ బన్నీలతో పోటీ పడి ఎంత మంచివాడవురా రూపంలో డిజాస్టర్ అందుకున్న కళ్యాణ్ రామ్ ఇప్పుడు ఒకటి రెండు కాదు ఏకంగా అయిదు ప్రాజెక్టులతో చాలా బిజీగా ఉన్నాడు. ఇవాళ పుట్టినరోజు సందర్భంగా ప్రకటనలతో సోషల్ మీడియా హంగామా చేశారు.

వీటిలో ముందుగా రాబోయేది బింబిసార. ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో డిఫరెంట్ ఎలిమెంట్ తో రూపొందిన ఈ చిత్రంలో బాహుబలి రేంజ్ గెటప్ లో కళ్యాణ్ రామ్ ఏదో కొత్తగానే కనిపిస్తున్నాడు. ఇదయ్యాక మైత్రి మూవీస్ మేకర్స్ నిర్మించే భారీ చిత్రానికి రాజేంద్ర డైరెక్షన్ చేయబోతున్నాడు. 118 రూపంలో డీసెంట్ సక్సెస్ ఇచ్చిన దర్శకుడు కెవి గుహన్ కు మరో కమిట్ మెంట్ ఇచ్చాడు కళ్యాణ్ రామ్. అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో ఇది తెరకెక్కుతుంది. అభిషేక్ పిక్చర్స్ నవీన్ మేడారం దర్శకత్వంలో నిర్మించే పీరియాడిక్ మూవీకి డెవిల్ టైటిల్ ని లాక్ చేశారు. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో మరో చిత్రం ఉంటుంది. మొత్తం 5 సినిమాలు.

మీడియం రేంజ్ హీరోనే అయినప్పటికీ కళ్యాణ్ రామ్ స్పీడ్ చూస్తుంటే ఏదో గట్టి ప్లాన్ లోనే ఉన్నట్టు కనిపిస్తున్నాడు. ఒకపక్క ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్లు చూసుకుంటూ మరోపక్క ఇన్నేసి సినిమాలతో బిజీగా ఉండటం ఆశ్చర్యం. టాలెంట్ ఉన్నప్పటికీ ఎందుకో వెనుకబడుతున్న కళ్యాణ్ రామ్ కు సరైన బ్రేక్ రావాలని కోరుకుంటున్నారు అభిమానులు. తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ అయ్యాక కొరటాల శివ సినిమాతో బిజీగా ఉన్నాడు. స్టార్ హీరోల తమ్ముళ్లు సక్సెస్ కావడం స్ట్రగుల్ కావడం సహజమే కానీ ఇలా స్టార్ అన్నయ్య సెటిల్ కావడానికి ఇంత టైం తీసుకోవడం మాత్రం వింతే

Jojobet Girişgrandpashabetgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabetmarsbahis girişjojobet girişgrandpashabetgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbetgrandpashabetjojobetGrandpashabetjojobet