iDreamPost
android-app
ios-app

ఎమ్మెల్యే ఇంట అగ్నిప్రమాదం.. ఎమ్మెల్యే భార్యకు గాయాలు!

ఎమ్మెల్యే ఇంట అగ్నిప్రమాదం.. ఎమ్మెల్యే భార్యకు గాయాలు!

జగిత్యాల జిల్లా కోరుట్ల టీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఇంట్లో అగ్నిప్రమాదం చోటు చేసుకున్న ఘటన సంచలనంగా మారింది. ఈ రోజు అంటే శనివారం తెల్లవారుజామున త్వరలో సంక్రాంతి పండుగ వస్తున్న క్రమంలో ఇంట్లో పిండి వంటలు చేస్తూ ఉండగా గ్యాస్ లీకై ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ఆ సమయంలో అక్కడే ఉండి వంటలు మండుతున్న ఎమ్మెల్యే సతీమణి సరోజకు గాయాలవగా చికిత్స నిమిత్తం హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు. నియోజకవర్గ ప్రజలు, పార్టీ శ్రేణులు, అభిమానులు ఆందోళన చెందవద్దని, ఎమ్మెల్యే కుమారుడు డాక్టర్ సంజయ్ సోషల్ మీడియా వేదికగా కోరారు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు ఇంట్లో ఉన్నారా? లేదా ? అనే దానిపై స్పష్టత లేదు.

1997లో తెలుగుదేశం పార్టీలో చేరి రాజకీయ జీవితం మొదలు పెట్టారు. 1998లో మెట్‌పల్లి అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో టిడిపి తరఫున పోటీచేసి స్వల్ప తేడాతో ఓడిపోయిన ఆయన 2001లో ఇబ్రహీంపట్నం జెడ్పీటీసీ సభ్యుడిగా టీడీపీ తరపున గెలిచి జెడ్పీలో టిడిపి పక్ష నాయకుడిగా ఉన్నారు. ఆ తర్వాత 2002 నుంచి మూడేళ్ళ పాటు కరీంనగర్ ఆర్టీసీ జోన్ చైర్మన్ గా కూడా పని చేశారు. 2004 సాధారణ ఎన్నికల్లో టిడిపి, బిజెపి పొత్తు కారణంగా టికెట్ దక్కకపోవడంతో మెట్‌పల్లి అసెంబ్లీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు.

టీడీపీ మెట్‌పల్లి నియోజకవర్గం ఇంఛార్జ్ గా ఉన్న ఆయన, తెలంగాణ ఉద్యమంలో పాలుపంచుకోవాలని 2008లో కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. పునర్విభజనలో భాగంగా నియోజకవర్గంగా ఏర్పడిన కోరుట్ల నుంచి 2009లో టీఆర్ఎస్ తరపున పోటీ చేసి గెలుపొందారు. 2010 ఫిబ్రవరిలో తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపొందారు. 2014లో, 2018 లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో కూడా భారీ మెజార్టీతో గెలుపొందారు. 2018 నుంచి శాసనసభలో పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీ సభ్యుడిగా ఉన్నారు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యుడిగా కూడా విద్యాసాగర్ రావు ఉన్నారు.

Also Read : వనమా కోసం వేట..!

jojobet girişJojobet GirişCasibomivermectin tabletMadridbetMadridbetMadridbetmeritbetCasibom GirişmeritbetjojobetBetvolemarsbahis girişJojobet GirişJojobet Girişcasibom