iDreamPost
android-app
ios-app

రోడ్డుప్రమాదంలో గుంటూరు మాజీ ఎమ్మెల్యే కుమారుడి మృతి

రోడ్డుప్రమాదంలో గుంటూరు మాజీ ఎమ్మెల్యే కుమారుడి మృతి

ఏపీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, గుంటూరు మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలి కుమారుడు ఫారుక్ రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. దీంతో మస్తాన్ వలీ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

వివరాల్లోకి వెళితే మస్తాన్ వలి కుమారుడైన షేక్‌ ఫారుక్ గుంటూరు నుండి హైదరాబాద్‌కు బైక్‌పై వెళుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం ధర్మాజిగూడెం క్రాస్‌రోడ్డు వద్ద షేక్‌ ఫారుక్ తన బైక్‌ను హైవే పక్కన నిలిపి స్వెట్టర్ ధరిస్తున్న సమయంలో చౌటుప్పల్‌ నుంచి హైదరాబాద్‌ వైపు అతివేగంగా వెళుతున్న కారు షేక్ షారుఖ్ బైక్‌ను ఢీకొనడంతో బైక్‌పై కూర్చొని ఉన్న షారుఖ్‌ అక్కడిక్కడే మృతిచెందగా ఆయన స్నేహితుడు ఈ ప్రమాదం నుండి తప్పించుకున్నాడు.

రోడ్డు ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలీకి మరణించిన ఫారుక్ ఏకైక కుమారుడు కావడంతో ఆయన కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి.

Jojobet Girişmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet giriş