iDreamPost
android-app
ios-app

ఇంగ్లీష్ మీడియం పై జస్టిస్ ఈశ్వరయ్య కీలక వ్యాఖ్యలు

ఇంగ్లీష్ మీడియం పై జస్టిస్ ఈశ్వరయ్య కీలక వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ను అమలు పరిచే అంశంపై రాష్ట్ర ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. కేవలం సంపన్న వర్గాలకు చెందిన వారు మాత్రమే దీనిని వ్యతిరేకిస్తున్నారన్నారు. ఇంగ్లీష్ మీడియాన్ని వ్యతిరేకించే వాళ్ళు వాళ్ళ పిల్లలను తెలుగులోనే చదివిస్తున్నారా..? అని ప్రశ్నించారు.

మెజారిటీ ప్రజలు అభీష్టం మేరకే ఆంగ్ల విద్యావిధానం ప్రవేశపెడుతున్నామని స్పష్టం చేశారు. చాలా మంది పేదలు తమ పిల్లలను ఇంగ్లీషు మీడియంలో చదివించలేకపోతున్నారని పేర్కొన్నారు. భుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులను పెంచి ఇంగ్లీష్ విద్యను అందిస్తామని తెలిపారు. ఉన్నత విద్య అభివృద్ధి చెందాలంటే ఇంగ్లీషు మీడియం తప్పనిసరి పేర్కొన్నారు.

బడుగు బలహీన వర్గాలు పిల్లలు చదువుకుని అభివృద్ధి చెందకుడదనేలా కొందరి వైఖరి ఉందని ఈశ్వరయ్య అన్నారు. ఇంగ్లీషు మీడియంలో చదివితే వెనుకబడిన వర్గాల వారు అభివృద్ధి చెందుతారని తెలిపారు. ప్రపంచీకరణ నేపధ్యంలో ఆంగ్లభాష అవసరమన్నారు. ప్రైవేట పాఠశాలలు విద్యార్థులు వద్ద ఫీజులు ఎక్కువగా తీసుకోవద్దని చూచించారు. కన్వీనర్ కోటా, మేనేజ్మెంట్ కోటా ఫీజులు తగ్గించాలన్నారు. ఫిబ్రవరి నాటికి ఫీజులు నియంత్రణపై ప్రభుత్వానికి నివేదిక ఇస్తామన్నారు.

Jojobet GirişMadridbetMariobetmeritbetjojobet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetjojobet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet giriş