iDreamPost
android-app
ios-app

ఇంత ఆలస్యంగా రీమేకా ?

  • Published Jun 28, 2021 | 1:44 PM Updated Updated Jun 28, 2021 | 1:44 PM
ఇంత ఆలస్యంగా రీమేకా ?

ఇండియన్ సినిమాలో మోస్ట్ సక్సెస్ ఫుల్ సీక్వెల్ గా నిలిచిన సిరీస్ లో బాహుబలి తర్వాత దృశ్యం గురించి చెప్పుకోవచ్చు. మొదటిది గ్రాఫిక్స్ తో కూడుకున్న వందల కోట్ల బడ్జెట్ ది అయితే రెండోది పెద్దగా ఖర్చేమీ లేకుండా సింపుల్ లొకేషన్లలో కేవలం ఒక స్టార్ హీరోను నమ్ముకుని తీసినది. రెండూ అద్భుత విజయాన్ని అందుకున్నాయి. దృశ్యం 2 ఆ మధ్య మలయాళంలో డైరెక్ట్ ఓటిటిలో రిలీజై అక్కడ సూపర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. అందుకే ఎక్కువ ఆలస్యం చేయకుండా ఎఫ్3కి బ్రేక్ ఇచ్చి మరీ వెంకటేష్ దాని రీమేక్ చకచకా నెలన్నర రోజుల్లో పూర్తి చేశారు. ఇక్కడా ఓటిటి విడుదలనే టాక్ ఉంది కాబట్టి వేచి చూడాలి.

ఇక తమిళ రీమేక్ పనులు మాత్రం స్లోగా సాగుతున్నాయి. కమల్ హాసన్ హీరోగా ఇప్పటికే క్యాస్టింగ్ పనులు మొదలుపెట్టేశారు. అయితే మొదటి భాగంలో జోడిగా నటించిన గౌతమి ఇప్పుడు తన పక్కన చేసే ఛాన్స్ లేకపోవడంతో దర్శకుడు మరో ఆప్షన్ కోసం వెతుకుతున్నారు. ముందు రెండు భాషల్లో నటించిన మీనానే అనుకున్నారట. అయితే రొటీన్ గా అనిపించిందో లేక వేరే కారణమో తెలియదు కానీ ఇప్పుడా స్థానంలో నదియా రాబోతున్నట్టు చెన్నై టాక్. నదియా తెలుగు వెర్షన్ లో పోలీస్ ఆఫీసర్ గా నటించడం గుర్తేగా. అయితే తమిళం ఫస్ట్ పార్ట్ లో ఆవిడ చేయలేదు. అందుకే ఇప్పుడు ఇలా ప్లాన్ చేసినట్టు తెలిసింది

ఒకరకంగా చూస్తే దృశ్యం 2 రీమేక్ అంటే ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. మళయాలం రాని జనాలు కూడా సబ్ టైటిల్స్ సహాయంతో ప్రైమ్ లో దీన్ని చూసేశారు. ఆ అనుమానంతో పాటు కరోనా భయం వల్ల భారీ వసూళ్లు వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని గుర్తించే నిర్మాత సురేష్ బాబు దృశ్యం 2ని ఓటిటికి ఇస్తున్నారనే టాక్ బయలుదేరింది.టెక్నాలజీ పెరిగిపోయిన ఈ కాలంలో ఏ భాషలో హిట్ అయిన సినిమా అయినా వీలైనంత త్వరగా రీమేకులు చేసుకుంటే బెటర్. లేదంటే ఆత్రం తట్టుకోలేక యాప్స్ లో ఒరిజినల్ వెర్షన్లు ఎక్కువ జనాలు చూసేస్తే ఆసక్తి తగ్గిపోతుంది. మొత్తానికి వెరైటీ కాంబోతో దృశ్యం 2 రాబోతుందన్న మాట

jojobet girişJojobet GirişJojobet GirişCasibomiptv satın alluxbetluxbetRulobetkatlaJojobet GirişJojobet GirişMarsbahis GirişCasibom GirişMarsbahis Giriş