iDreamPost
android-app
ios-app

సీనియర్ ఎన్టీఆర్‌ ఫేవరేట్ ఫుడ్ ఏంటో తెలుసా??

  • Published May 28, 2022 | 5:00 PM Updated Updated May 28, 2022 | 5:00 PM
సీనియర్ ఎన్టీఆర్‌ ఫేవరేట్ ఫుడ్ ఏంటో తెలుసా??

మే 28న తెలుగు వారి మహనీయుడు, యుగపురుషుడు, తెలుగు వారి ఆత్మగౌరవాన్ని చాటి చెప్పిన మహా నాయకుడు, ఎందరో అభిమానులకు ఆరాధ్యదైవం అయిన స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి జయంతి. ఈ సారి ఆయన శత జయంతి కూడా కావడంతో ఎన్టీఆర్ అభిమానులు, కుటుంబ సభ్యులు, తెలుగుదేశం పార్టీ ఘనంగా ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు నిర్వహించాలని భావించారు.

ఇవాళ ఉదయం నుంచి ఎన్టీఆర్ ఘాట్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎన్టీఆర్ విగ్రహాల వద్ద అభిమానులు, ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు, సెలబ్రెటీలు, కుటుంబ సభ్యులు, ఆయనతో సన్నిహితంగా ఉన్నవారు మరోసారి ఎన్టీఆర్ ని తలుచుకొని ఎన్టీఆర్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు.

 

భోజన ప్రియుడు అయిన ఎన్టీఆర్ ఎక్కువగా ఏ ఫుడ్ తినేవారో, ఆయన రోజువారీ ఏం తినడానికి ఇష్టపడతారో తెలుసా??

*ఎన్టీఆర్ ఉదయాన్నే 6 గంటల కల్లా 10 నుంచి 15 ఇడ్లీలు, నాటు కోడికూరతో కలిపి బ్రేక్ ఫాస్ట్ తీసుకునేవారట.

*ఆ తర్వాత 10 గంటల సమయంలో మరో అయిదు ఇడ్లీలు తినేవారట.

*ఎన్టీఆర్ కి యాపిల్ జ్యూస్ అంటే చాలా ఇష్టం. ఖాళీ సమయాల్లో అప్పుడప్పుడు రోజుకి కనీసం ఒక లీటరు యాపిల్ జ్యూస్ కచ్చితంగా తాగేవారు. ఎండాకాలంలో అయితే యాపిల్ జ్యూస్ రెండు లీటర్లు వరకు తాగేవారట.

*ఎండాకాలంలో మధ్యాహ్నం పూట రోజూ గ్లూకోజ్ నీళ్లు తాగేవారు.

*ఎండాకాలంలో రోజుకి 2 లీటర్ల బాదంపాలు కూడా తాగేవారట.

*సాయంత్రం స్నాక్స్ లో బజ్జీలు కచ్చితంగా ఉండాల్సిందే. అలవోకగా 10 నుంచి 15 బజ్జీలు తినేవారట ఎన్టీఆర్.

*రోజూ డ్రైఫ్రూట్స్ కూడా సాయంత్రం పూట తీసుకునేవారు. ఆ సమయంలో పక్కన ఎవరన్నా ఉంటే వారికి కూడా ఆ డ్రైఫ్రూట్స్ ఇచ్చేవారట.

*మధ్యాహ్నం భోజనంలో రెండు కూరలు, పెరుగు, నెయ్యి, చారు, అప్పడం ఉండాల్సిందే.

*ఎన్టీఆర్ నాటు కోడికూరని బాగా ఇష్టంగా తింటారట.

 

 

 

 

Jojobet GirişMadridbetMariobetimajbetmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişgrandpashabet giriş