iDreamPost
android-app
ios-app

ఏడేళ్ళ తర్వాత మోక్షం పొందనున్న ‘బోస్’

  • Published May 06, 2020 | 7:04 AM Updated Updated May 06, 2020 | 7:04 AM
ఏడేళ్ళ తర్వాత మోక్షం పొందనున్న ‘బోస్’

షూటింగుల్లో ఏర్పడిన అవాంతరాల వల్లో లేదా బడ్జెట్ పెరిగిపోవడంతో నిర్మాత చేతులెత్తేయడం వల్లో సినిమాల విడుదల ఆలస్యం కావడం చూస్తూనే ఉంటాం . అప్పుడెప్పుడో అమ్మోరుని 5 సంవత్సరాలు తీస్తే చిరంజీవి లాంటి మెగాస్టార్ ఉన్నా అంజి రిలీజ్ 6 ఏళ్ళ తర్వాత కాని సాధ్యపడలేదు. ఇదంతా గతం. మార్కెట్ ఉన్నప్పుడు లేట్ అయినా సొమ్ము చేసుకోవచ్చు కాని ఇమేజ్ లేని చిన్న హీరోలకు ఇది ప్రాణసంకటంగా మారుతుంది. సందీప్ కిషన్ మూవీ ఒకటి అచ్చం ఇదే తరహాలో రాబోతోంది.

అయితే థియేట్రికల్ రిలీజ్ ఇప్పుడు సాధ్యం కాదు కాబట్టి నేరుగా ఓటిటిలో త్వరలో అందించబోతున్నారు. ఆ సినిమా పేరు డికె బోస్. కాజల్ అగర్వాల్ చెల్లెలు నిషా అగర్వాల్ హీరొయిన్ గా నటించిన డీకే బోస్ లో మీసాలు తిరిగిన వెరైటీ గెటప్ లో సంపత్ రాజ్ విలన్ గా నటించాడు. గబ్బర్ సింగ్ తరహా బాడీ లాంగ్వేజ్ తో సందీప్ కిషన్ తో ఏదో కొత్తగానే ట్రై చేసినట్టు ఉన్నారు కాని ఇంతదానికి ల్యాబులో ఎందుకు మగ్గిపోయిందో మరి. దీని గురించి హరీష్ శంకర్ ప్రత్యేకంగా ట్వీట్ చేయడంతో ఆన్ లైన్ ప్రేక్షకుల దృష్టి దీనివైపు మళ్ళింది.

సందీప్ కిషన్ కు మార్కెట్ కొంచెం డౌన్ లో ఉంది. ఆ మధ్య నిను వీడని నీడను నేనే బాగానే ఆడినప్పటికీ మరీ బ్రహ్మాండమైన వసూళ్లు రాలేదు. సేఫ్ అయ్యింది అంతే. ఈ నేపద్యంలో ఇంత ఆలస్యంగా వస్తున్న డీకే బోస్ కు డిజిటల్ రిలీజే కరెక్ట్. నిషా అగర్వాల్ ఈ సినిమా టైంకి పెళ్లి చేసుకోలేదు. తర్వాత ఓ వ్యాపారవేత్తను వివాహమాడింది. ఇప్పుడు తనకో బాబు కూడా ఉన్నాడు. కాని బోస్ కు మాత్రం ఇప్పుడు మోక్షం కలుగుతోంది. హాల్స్ లో రాని సినిమాలు ఫ్రీగా ఇంట్లోనే చూసే అవకాశం కలగడం ప్రేక్షకులకు మంచి ఆప్షన్ గా నిలుస్తోంది. కాకపోతే ఈ సిరీస్ లో వచ్చిన మొదటిది అమృతరామమ్ తీవ్రంగా నిరాశపరచడంతో ఈ డీకే బోస్ కనీసం ఓ మోస్తరుగా అయినా మెప్పిస్తుందేమో చూడాలి

gamdommarsbahis girişMarsbahisjojobetjojobet giriş