iDreamPost
android-app
ios-app

Vijay fans -Pawan Kalyan -పవన్ కళ్యాణ్ కి, విజయ్ కి అదే తేడా, అందుకే అక్కడ విజయమా

  • Published Oct 19, 2021 | 2:58 AM Updated Updated Mar 11, 2022 | 10:37 PM
Vijay fans -Pawan Kalyan -పవన్ కళ్యాణ్ కి, విజయ్ కి అదే తేడా, అందుకే అక్కడ విజయమా

ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాజకీయాలకు కొన్ని పోలికలున్నాయి. రెండు రాష్ట్రాల్లోనూ జాతీయ పార్టీలకు అవకాశాలు సన్నగిల్లిపోయాయి. అదే సమయంలో సినీ హీరోలకు మంచి ఆదరణ ఉంటుంది. గతంలోనూ, ఇప్పుడు కూడా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఆధారంగా సినీ స్టార్స్ రాజకీయాలు చూస్తుంటాం. అదే సమయంలో ఇరు రాష్ట్రాల్లోనూ బలమైన నేతలు ముఖ్యమంత్రులుగా ఉన్నారు. ఏపీ సీఎం జగన్ తో పాటుగా తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ నిర్ణయాలు కూడా ఇటీవల దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి. పలు రాష్ట్రాలను అనుసరించేందుకు కారణమయ్యాయి. అయితే తమిళనాడు రాజకీయాల్లో పాగా వేయాలని ఆశిస్తున్న తలైవర్ విజయ్ కి, ఏపీలో అవకాశాలను చేజార్చుకుంటున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ కి చాలా తేడా కనిపిస్తోంది.

తమిళనాడులో అధికారం కోల్పోయిన తర్వాత అన్నా డీఎంకే అతలాకుతలం అయిపోయింది. పళనిస్వామి, పన్నీర్ సెల్వం వర్గాలుగా విడిపోయి బలహీనపడింది. ఓపీఎస్, ఈపీఎస్ లు పార్టీని సమన్వయం చేసే సత్తా కోల్పోయారు. దాంతో అక్కడ విపక్ష స్థానం భర్తీ చేసే నాయకుడు కరువయ్యారు. దానికోసం పోటీ పడుతున్న వివిధ పార్టీలు కూడా పేలవంగా కనిపిస్తున్నాయి. కమలహాసన్ పార్టీ పెట్టి సొంతంగా తానే గెలవలేని స్థితిలో మిగిలిపోయారు. విజయ్ కాంత్ దాదాపు దశాబ్దంన్నర దాటినా ప్రభావం చూపలేకపోయారు. సరిగ్గా దానినే అవకాశంగా మలచుకునే యత్నంలో విజయ్ ఉన్నారు. తమిళ యువతలో విజయ్ కి మంచి ఫాలోయింగ్ ఉంది. దాని ఆధారంగా ఇప్పుడు చక్రం తిప్పే పని ప్రారంభించారు. ఇప్పటికే అనేక కార్యక్రమాలు చేపడుతూ రాజకీయ సంకేతాలు ఇచ్చారు. గత ఎన్నికల సందర్భంలో కూడా సైకిల్ తొక్కొతూ ఓటేయడానికి వెళ్లిన విజయ్ వైనం సంచలనమయ్యింది. ఆయన సంకేతాలు స్పష్టంగా వెల్లడయ్యాయి. ఇక స్థానిక ఎన్నికల్లో స్వయంగా ఆయన అభిమానులు బరిలో దిగి 160 సీట్లలో 115 స్థానాలు గెలుచుకున్నారు. తమిళనాడు స్థానిక ఎన్నికల్లో 29వేల సీట్లలో ఇది చాలా తక్కువే అయినప్పటికీ విజయ్ పట్ల ప్రజల్లో విశ్వాసం కల్పించేందుకు ఈ గ్రామీణ ఓటర్ల తీర్పు తోడ్పడినట్టుగా కనిపిస్తోంది.

Also Read : Janasena-Glass Symbol: గ్లాసు గుర్తు కోరే అవకాశాలు వదులుకుంటోన్న జనసేన

ఏపీలో కూడా విపక్ష టీడీపీ విలవిల్లాడుతోంది. ఇప్పుడిప్పుడే కోలుకుంటుందా అనే సందేహాలున్నాయి. చంద్రబాబు వయోభారం, లోకేష్ కి సమర్థత లేకపోవడంతో టీడీపీ నుంచే నేతలు జారిపోతున్నారు. అలాంటి సమయంలో టీడీపీ పునాదులు దెబ్బతినడం ఆపార్టీ శ్రేణులనే కలవరపరుస్తోంది. అధికార వైఎస్సార్సీపీ రానురాను బలపడుతున్నట్టు ఉప ఎన్నికలు, స్థానిక ఎన్నికలు చాటిచెబుతున్నాయి. దానిని సొమ్ము చేసుకుని ప్రతిపక్ష స్థానాన్ని కైవసం చేసుకోవాలని కమలనాధులు చేసిన యత్నం ఫలించడం లేదు. ఇక పవన్ కళ్యాణ్‌ కి అవకాశం ఉన్నప్పటికీ దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఇక్కడే తమిళనాడులో విజయ్ కి , ఏపీలో పవన్ కి మధ్య ఉన్న తేడా స్పష్టమవుతోంది.

విజయ్ తన మార్క్ రాజకీయాలతో తానే ప్రత్యామ్నాయంగా కనిపించాలని యత్నిస్తున్నారు. ఆయన ఎత్తులు ఫలించే దిశలో ప్రస్తుత పరిణామాలున్నాయి. కానీ పవన్ మాత్రం తనకు బదులుగా చంద్రబాబుని బలపరిచేందుకు చూస్తున్నారనే అభిప్రాయం బలంగా ఉంది. పవన్ అడుగులు కూడా దానికి అనుగుణంగా ఉన్నాయి. రాజకీయంగా తాను ఎదగాలనే ఆశతో కాకుండా తనకు గిట్టని వారిని పదవికి దూరం చేస్తే చాలు అనుకునే రీతిలో పవన్ ఉండడంతోనే జనసేన నేటికీ జవసత్వాలు సమకూర్చుకోలేకపోయినట్టు స్పష్టమవుతోంది. ఏపీలో బలమైన నేతల్లో ఒకరు ఖాళీ అయితే తనకు అవకాశం వస్తుందనే అంచనా వేయలేకపోతున్న పవన్ పూర్తిగా టీడీపీకి బంటుగా మారినట్టు ఆయన తీరు చాటుతోంది. ఈ పరిణామాలతో ఏపీలో ప్రత్యామ్నాయంగా ఎదిగే బదులుగా చంద్రబాబుకి వత్తాసు పలికే నేతగా మిగిలిపోతున్నారు. సొంత కులం కాపులు ఎదగాలని కాకుండా కమ్మ, కాపు కాంబినేషన్ కోసమే ఆరాటపడుతున్నారు. తద్వారా కమ్మలను భుజానమోయాలనే సంకల్పంతో ఉన్నట్టు చాటుకుంటున్నారు.

Also Read : TN Panchayat Elections – సత్తా చాటిన నటుడు విజయ్ ఫ్యాన్స్ క్లబ్

ఇది రాజకీయంగా పవన్ కి పెద్దగా ఉపయోగపడే అవకాశం లేదు. మహా అంటే జనసేన గతంలో ఒక సీటు గెలిస్తే వచ్చే సరికి దానికి ఇంకా ఒకటో రెండో జతకావచ్చు. అన్నీ కలిసి వస్తే మరికొన్ని సీట్లు సొంతం కావచ్చు. కానీ పవన్ ఎన్నటికీ సీఎం కాలేని స్థితి వస్తుందనేది మరచిపోతున్నారు. తమిళనాడులో విజయ్ వంటి యువకుడే వ్యూహాలు పన్నుతూ తానే ప్రత్యామ్నాయం కావాలని ఆశిస్తుంటే పవన్ మాత్రం చంద్రబాబుని మరోసారి మోయాలనే ఉద్దేశంతో ఉండడమే విశేషం. మువీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లోనే పవన్ పరువు తీసినప్పటికీ అది మరచిపోయి మళ్లీ బాబు చెంత వాలేందుకు ఆతృతపడుతున్నట్టు అర్థమవుతుంది. ఇది వ్యక్తిగతంగా పవన్ కి, పార్టీగా జనసేనకు ఏమాత్రం ఉపయోగపడే అవకాశం కల్పించదనే చెప్పాలి.