iDreamPost
android-app
ios-app

తేల్చని సీడబ్ల్యూసీ – సాయంత్రం మరో భేటీ

తేల్చని సీడబ్ల్యూసీ – సాయంత్రం మరో భేటీ

మహా రాష్ట్ర లో ప్రభుత్వ ఏర్పాటు పై సందిగ్ధం ఇంకా కొనసాగుతోంది. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటు పై ఉత్కంఠ కొనసాగుతోంది. సాయంత్రం 7:30 గంటలకు ప్రభుత్వ ఏర్పాటు పై శివసేన తన అభిప్రాయాన్ని గవర్నర్ కు తెలియజేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా ప్రభుత్వ ఏర్పాటు పై ఈ మూడు పార్టీల మధ్య సాగుతున్న చర్చలు ఈ రోజు జెట్ వేగం అందుకున్నాయి. శివసేనకు మద్దుతు ఇచ్చే విషయమై ఇప్పటికే ఎన్సీపీ సానుకూలత వ్యక్తం చేసింది. ఈ మేరకు ఎన్సీపీ విధించిన షరతులకు లోబడి కేంద్రం లోని తన మంత్రిని శివసేన రాజీనామా చేయించింది. 

మరో వైపు కాంగ్రెస్ నిర్ణయంపై ఇంకా స్పష్టత రాలేదు. శివసేనకు మద్దతు పై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యూసీ) లో ఈ రోజు ఉదయం నుంచి చర్చలు సాగుతున్నాయి. ఢిల్లీ లోని సోనియా గాంధీ నివాసంలో ఈ భేటీ జరుగుతోంది. మధ్యాహన్నం వరకు సాగిన చర్చలో సీడబ్ల్యూసీ ఏమి తేల్చలేదని సమాచారం. ఈ నేపథ్యం లో ఈ రోజు సాయంత్రం మరో మారు భేటీ అవ్వాలని నేతలు నిర్ణయించారు. సాయంత్రం మహారాష్ట్ర నేతలను ఢిల్లీ రావాల్సిందిగా సోనియా గాంధీ ఆదేశించారు. సాయంత్రం భేటీ తర్వాత తన నిర్ణయాన్ని కాంగ్రెస్ వెల్లడించే అవకాశం ఉంది.