iDreamPost
android-app
ios-app

మాజీ, ప్ర‌స్తుత టీడీపీ అధ్య‌క్షుల మ‌ధ్య వార్..?

మాజీ, ప్ర‌స్తుత టీడీపీ అధ్య‌క్షుల మ‌ధ్య వార్..?

రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలో లేదు.. మ‌ళ్లీ అధికారంలోకి వ‌స్తామ‌న్న గ్యారంటీ కూడా లేదు. ఇలాంటి స‌మ‌యంలో కూడా నేత‌ల మ‌ధ్య ఆధిప‌త్య పోరు న‌డుస్తుండ‌డం త‌మ్ముళ్ల‌ను ప‌రేషాన్ లో ప‌డేస్తోంది. పోనీ వారేమైనా చోటా మోటా నాయ‌కులా అంటే అదీకాదు. ఒక‌రు ఏపీ మాజీ అధ్య‌క్షుడు.. మ‌రొక‌రు ప్ర‌స్తుత అధ్య‌క్షుడు. అలాంటి వారే సొంత ప్ర‌తిష్ట కోసం.. పార్టీ ప్ర‌తిష్ఠ‌ ను దెబ్బ‌తీస్తున్నార‌ని త‌మ్ముళ్లు వాపోతున్నారు. వారెవ‌రో ఇప్ప‌టికే అర్థ‌మ‌య్యే ఉంటుంది. వారే కిమిడి కళావెంకట్రావు, కింజార‌పు అచ్చెన్నాయుడు.

ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ రాజ‌కీయ ప్ర‌వేశానికి ముందు సిక్కోలు జిల్లాలో తెలుగుదేశానికి తిరుగులేదు. ఆ పార్టీ ఆవిర్భావం నుంచి ఇక్కడి ప్రజలు పార్టీకి అండగా ఉండి.. మెజార్టీ స్థానాలు కట్టబెడుతున్నారు. వైసీపీ ప్ర‌భావం పెరుగుతున్న కొద్దీ జిల్లాలో టీడీపీ హ‌వా త‌గ్గుతూ వ‌చ్చింది. అయిన‌ప్ప‌టికీ గత సార్వత్రిక ఎన్నికల్లో ఒక ఎంపీ.. ఇద్దరు ఎమ్మెల్యేలు టీడీపీ నుంచి గెలిచారు.

ఇంకొన్నిచోట్ల స్వల్ప ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థులు ఓడిపోయారు. పార్టీకి గట్టిపట్టున్న శ్రీకాకుళం జిల్లాపై చంద్రబాబు కూడా అంతే ప్రేమను చూపిస్తున్నారు. టీడీపీ అధికారంలో ఉన్నా.. లేకున్నా.. స్థానిక నేతలకు ప్రాధాన్యం తగ్గడం లేదు. ఏపీ టీడీపీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన ఇద్దరు నాయకులు శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారే. ప్రస్తుత ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, గత అధ్యక్షుడు కిమిడి కళావెంకట్రావు ఇద్దరూ జిల్లాలో రాజకీయంగా బలం ఉన్న నాయకులే. అయితే కష్ట సమయంలో పార్టీని గాడిలో పెట్టాల్సిన ఈ ఇద్దరు నేతల మ‌ధ్య అంత‌ర్గ‌త పోరు న‌డుస్తుండ‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

అచ్చెన్న, కళా వెంకట్రావుల మధ్య అంత‌ర్గ‌త ఆధిప‌త్య పోరు టీడీపీకి కూడా తలనొప్పిగా మారిందట. ఎప్పటి నుంచో ఇద్దర మధ్య ఆధిపత్యపోరు ఉన్నా.. ప్రస్తుతం అది ముదురిపాకన పడినట్టు తమ్ముళ్ల టాక్‌. జిల్లా రాజకీయాలను తన కనుసన్నల్లో నడపాలని అచ్చెన్న తెరవెనక పావులు కదుపుతున్నారట. అవే పార్టీలో దుమారం రేపుతున్నట్టు సమాచారం. అధికారపార్టీ వర్సెస్‌ విపక్ష పార్టీగా ఉండాల్సిన రాజకీయం.. సొంతపార్టీ నేతలు ఒకరిపై ఒకరు చెక్‌ పెట్టుకునేలా ఉందట. ప్రతిపక్షంలో ఉన్న పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు నేతలు కృషి చేయాలి. బలాన్ని పెంచుకునేందుకు గట్టిగా పోరాడాలి. దూరమైన వర్గాలను కూడదీసుకోవాలి. ప్రత్యర్థి పార్టీ గట్టిగా ఉన్నప్పుడు విపక్ష పార్టీ నేతలు ఐక్యంగా పనిచేయాలి.ఇదే దిశగా కేడర్‌ ఆలోచిస్తున్నా.. పార్టీ పెద్దల్లో ఆ ఆలోచన లేదట. అంతర్గత కుమ్ములాటలకే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారట. కొందరు కీలక నేతలను టార్గెట్ చేస్తూ వెనక గోతులు తవ్వుతున్నారట. ఎచ్చెర్ల, పాలకొండ, శ్రీకాకుళం, రాజాం నియోజకవర్గాలలో పార్టీ బాధ్యులుగా ఉన్నవారికి అచ్చెన్న ఎసరు పెడుతున్నట్టు కళా వర్గం ఆరోపిస్తోంది. రాజాం మినహా మిగతాచోట్ల ఉన్న పార్టీ ఇంఛార్జ్‌లు కళావెంకట్రావు అనుయాయులుగా ముద్ర ఉంది.

ఈ రివర్స్‌ పాలిటిక్స్ కొనసాగినంత కాలం టీడీపీ జిల్లాలో కుదటపడదని తెలుగు తమ్ముళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. పార్టీలో అంతర్గత సమస్యలను పరిష్కరించాల్సిన అచ్చెన్నాయుడే.. జిల్లాలో సమస్యగా మారారన్నది ప్రత్యర్థి వర్గం ఆరోపణ. అచ్చెన్న అనుచరులే పలు నియోజకవర్గాల్లో గందరగోళ వాతావరణాన్ని సృష్టిస్తున్నా ఆయన వారించడం లేదన్నది తమ్ముళ్ల మాట. మరి.. ఎన్నిక‌ల నాటికైనా జిల్లాలో టీడీపీ పరిస్థితి కుదుటుప‌డుతుందా, లేదా చూడాలి.

Also Read : అనగాని తీరుతో తమ్ముళ్ళలో అసహనం, రేపల్లె టీడీపీలో రాజుకున్న వేడి

Jojobet GirişMadridbetMadridbetMadridbetmeritbetCasibom GirişmeritbetzirvebetPradabet güncel girişjojobetgalabetJojobetHoliganbetJojobet GirişJojobet GirişCasibomjojobetjojobetcasibomcasibomjojobetJojobet